భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నూతన సాంకేతిక పరిజ్జాన రంగాలపై నార్త్‌క్యాప్ యూనివర్శిటీతో ఒప్పందం కుదుర్చుకున్న ఐసిఏటి


వాహన ఉత్పత్తి రంగంలో నైపుణ్యం అభివృద్ధిని మెరుగుపరచడానికి కోర్సులను రూపొందించనున్న రెండు సంస్థలు
విద్యుత్ వాహన తయారీపై పరిశోధనలకు ప్రత్యేక ప్రాధాన్యత

Posted On: 30 AUG 2022 12:12PM by PIB Hyderabad

గురుగ్రామ్‌లోని నార్త్‌క్యాప్ యూనివర్శిటీతో కలిసి   విద్యుత్ వాహనాల ఉత్పత్తి, ఇతర రంగాలలో చోటుచేసుకుంటున్న సాంకేతిక పరిజ్జాన అంశాలపై స్వల్ప, మధ్య కాలిక కోర్సుల నిర్వహణ, పరిశోధన చేపట్టేందుకు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసిఏటి) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోర్సుల నిర్వహణ, పరిశోధన కార్యక్రమాలపై కుదిరిన ఒప్పందంపై ఐసిఏటి డైరెక్టర్  శ్రీమతి పమేలా టిక్కూ , నార్త్‌క్యాప్ యూనివర్శిటీ ఉప కులపతి ప్రొఫెసర్ నుపుర్ ప్రకాష్ సంతకాలు చేశారు. కార్యక్రమంలో రెండు సంస్థలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
 ఈ సందర్భంగా ప్రసంగించిన శ్రీమతి పమేలా టిక్కూ విద్యుత్ వాహనాల తయారీ రంగానికి అవసరమైన నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు ఐసిఏటి తో కలిసి పని చేస్తామని అన్నారు.  
వాహన తయారీ రంగంలో ఐసిఏటి అపారమైన అనుభవం కలిగి ఉందని నార్త్‌క్యాప్ యూనివర్శిటీ ఉప కులపతి ప్రొఫెసర్ నుపుర్ ప్రకాష్ తెలిపారు. విద్యా రంగంలో నార్త్‌క్యాప్ యూనివర్శిటీ తనకంటూ గుర్తింపు పొందిందని అన్నారు. ఐసిఏటితో కలిసి భారతదేశంలో వాహన తయారీ రంగానికి అవసరమైన వివిధ నిపుణులను సిద్ధం చేసేందుకు అవసరమైన కోర్సులకు రూపకల్పన చేసి అందిస్తామని అన్నారు.  
 మనేసర్‌ కేంద్రంగా  ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ ( ఐసిఏటి  ), 1996 లో ఏర్పాటయింది.   భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ క్రింద NATRiP (NAB) ఇంప్లిమెంటేషన్ సొసైటీ (NATIS)  విభాగంగా ఐసిఏటి  పనిచేస్తుంది.

 

 


ఆటోమొబైల్స్ మరియు వాటి కీలకమైన భద్రతా భాగాల  టెస్టింగ్ మరియు సర్టిఫికేషన్ కోసం  సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ కింద కేంద్ర  రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ గుర్తించి  నోటిఫై చేసిన స్వతంత్ర పరీక్షా ఏజెన్సీలలో ఐసిఏటి ఒకటి. నార్త్‌క్యాప్ విశ్వవిద్యాలయం 1996లో గురుగ్రామ్‌లో స్థాపించబడింది.  నేషనల్  అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) 'A'  విశ్వవిద్యాలయంగా నార్త్‌క్యాప్ విశ్వవిద్యాలయం గుర్తింపు పొందింది.  కేంద్ర  మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF)  కింద ఈ విశ్వవిద్యాలయం  ఇంజనీరింగ్ విభాగంలో మొదటి  100 విశ్వవిద్యాలయాల జాబితాలో స్థానం పొందింది.
ఇన్నోవేషన్ అచీవ్‌మెంట్ 2021 (ARIIA) లో అటల్ ర్యాంకింగ్ పొందిన యూనివర్సిటీలు మరియు డీమ్డ్ యూనివర్సిటీ తరగతి లో 30 ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో నార్త్‌క్యాప్ విశ్వవిద్యాలయం స్థానం సాధించింది.  భారతదేశంలోని  అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నవిశ్వవిద్యాలయంగా సంస్థ గుర్తింపు  పొందింది   ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, అప్లైడ్ సైన్సెస్ మరియు లా వంటి విభాగాలలో  వివిధ రకాల అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను విశ్వవిద్యాలయం అందిస్తుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ,  బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) నార్త్‌క్యాప్ విశ్వవిద్యాలయం గుర్తింపు పొందింది.  విశ్వవిద్యాలయం అసోసియేషన్ ఆఫ్ ఇండియన్  యూనివర్శిటీస్ (AIU), అసోసియేషన్ ఆఫ్ కామన్వెల్త్ యూనివర్శిటీస్ (ACU), యూకే లలో నార్త్‌క్యాప్ విశ్వవిద్యాలయం సభ్యత్వం కలిగి ఉంది .
అమెరికన్ సొసైటీ ఫర్ క్వాలిటీ (I) ప్రైవేట్ లిమిటెడ్‌లో సభ్యత్వం కలిగి ఉన్న నార్త్‌క్యాప్ విశ్వవిద్యాలయానికి యూకే లోని అక్రిడిటేషన్  సర్వీసెస్ ఫర్ ఇంటర్నేషనల్ కాలేజస్ (ASIC)  'ప్రీమియర్' విశ్వవిద్యాలయాల విభాగంలో  'ప్రశంసనీయ' గ్రేడ్‌ అందించింది.  

***

 


(Release ID: 1855492) Visitor Counter : 155


Read this release in: English , Urdu , Hindi , Tamil