ఆయుష్
azadi ka amrit mahotsav

'సూర్య నమస్కారం- శాస్త్రీయత' పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్

Posted On: 29 AUG 2022 2:41PM by PIB Hyderabad
'సూర్య నమస్కారం- శాస్త్రీయత' పేరిట రూపొందిన ఒక పుస్తకాన్ని కేంద్ర ఆయుష్, మహిళా శిశు అభివృద్ధి  శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్ ఆవిష్కరించారు. వివిధ యోగాసనాలకు సంబంధించి శాస్త్రీయ పద్దతిలో సేకరించిన సమాచారాన్ని పుస్తకం లో పొందుపరిచారు.ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్  ఆయుర్వేదలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐఐఏ డైరెక్టర్ ప్రొఫెసర్ తనూజా మనోజ్ నేసరి, ఇన్‌స్టిట్యూట్ డీన్‌లు, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు. 
సంస్థలో 2022 ఆగస్టు 22 నుంచి 27 వరకు జరిగిన  కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (CME) ప్రోగ్రాం 2022 కార్యక్రమ నిర్వాహకులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యూఢిల్లీకి చెందిన రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠం తో కలిసి స్వస్థవృత్తా, ద్రవ్యగుణ, పంచకర్మ విభాగాలు కార్యక్రమాన్ని నిర్వహించాయి. 
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్  ఆయుర్వేద కి చెందిన స్వస్థవృత్తా, యోగ విభాగాలు 'సూర్య నమస్కారం- శాస్త్రీయత' పుస్తకాన్ని రూపొందించాయి. 'సూర్య నమస్కారం- శాస్త్రీయత' పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి భారతీయ సంప్రదాయాలు,  అభ్యాసాలను శాస్త్రీయ విధానాల ద్వారా ప్రచారం కల్పిస్తున్నఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్  ఆయుర్వేద సిబ్బంది, పరిశోధకులను అభినందించారు. 

సిఎంఇ లో పాల్గొన్న  వారిని ఉద్దేశించి డాక్టర్ మహేంద్ర భాయ్ మాట్లాడారు.  అత్యాధునిక సాంకేతిక సాధనాలు ఉపయోగించి  ప్రయోగాత్మక శిక్షణ అందించడం,  పంచకర్మ విధానాలపై  శాస్త్రీయ సదస్సులు నిర్వహించి  క్షేత్రస్థాయి సందర్శనలు నిర్వహించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.  రోగనిరోధక శాస్త్రంపర్యావరణంఆరోగ్యంచికిత్సా యోగా మరియు ప్రాథమిక వైద్య గణాంకాలపై  శాస్త్రీయ సదస్సులు నిర్వహించడం వల్ల  భారతదేశంలో ఆయుర్వేద అధ్యయనాల స్థాయి పెరుగుతుందని  అన్నారు.  ఆయుర్వేదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని మంత్రి అన్నారు. ఆయుర్వేద విద్యను  అభ్యసిస్తున్న విద్యార్థులకు దీనివల్ల కలిగే ప్రయోజనాలను మంత్రి వివరించారు. 

హాస్పిటల్ బ్లాక్‌లో నూతనంగా నిర్మించిన  పంచకర్మ గదిని  మంత్రి ప్రారంభించారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్  ఆయుర్వేద సమకూర్చుకున్న ఇ-రిక్షా, అంబులెన్స్‌ను జెండా ఊపి మంత్రి ప్రారంభించారు.

 
***
 
 

(Release ID: 1855348) Visitor Counter : 159