రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ 2.0, నవీనీకరించిన ఫార్మా సాహి దామ్ యాప్ ఆవిష్కరణ

ప్రజా సంక్షేమం, ప్రజలందరికీ ఆరోగ్యం లక్ష్యంగా ఔషధాలు ఉత్పత్తి చేసి పరిశోధనలు చేపట్టాలని పరిశ్రమలకు సూచించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ నియంత్రణ వ్యవస్థగా మాత్రమే కాకుండా వ్యవహారాలు సులభంగా జరిగే వ్యవస్థగా పనిచేస్తోంది... డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

పరిశ్రమ ప్రయోజనాలకు భంగం కలుగకుండా సరసమైన ధరలకు ఔషధాలు లభించేలా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ కృషి చేస్తున్నది .. : శ్రీ భగవంత్ ఖూబా

Posted On: 29 AUG 2022 1:55PM by PIB Hyderabad

ఈ రోజు ఢిల్లీలో జరిగిన నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ రజతోత్సవ వేడుకల్లో కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి  డాక్టర్ మన్సుఖ్ మాండవీయ  పాల్గొన్నారు. కేంద్ర రసాయన, ఎరువులు, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖూబా కార్యక్రమానికి  గౌరవ అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ప్రసంగించిన డాక్టర్ మాండవీయ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ నియంత్రణ వ్యవస్థగా  మాత్రమే కాకుండా వ్యవహారాలు సులభంగా జరిగే వ్యవస్థగా పనిచేస్తున్నదని అన్నారు. గత 25 సంవత్సరాలుగా ప్రజలకు నాణ్యమైన ఔషధాలు సకాలంలో, సరసమైన ధరలకు లభించేలా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ కృషి చేస్తున్నదని  మంది ప్రశంసించారు. 

 

భారతీయ పరిశ్రమలు నిరంతరం నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నాయని కేంద్ర మంత్రి అన్నారు.  వాణిజ్య ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా ప్రజల  ఆరోగ్యం మరియు సంక్షేమం  లక్ష్యంతో ఔషదాలు ఉత్పత్తి చేయాలని, వినూత్న పరిశోధనలను చేపట్టాలని  డాక్టర్ మాండవీయ సూచించారు. 

భారత ఔషధ ఉత్పత్తి సంస్థలకు  కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని డాక్టర్ మాండవీయ హామీ ఇచ్చారు. ఫార్మా రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్న పిఎల్ఐ 1,  పిఎల్ఐ 2 పధకాలను ఈ సందర్భంగా డాక్టర్ మాండవీయ ప్రస్తావించారు. ప్రభుత్వ పథకాల వల్ల కీలకమైన ఏపిఐల స్వదేశీ తయారీ ప్రారంభమైందని మంత్రి పేర్కొన్నారు. . కోవిడ్ సంక్షోభ సమయంలో భారతీయ ఫార్మా కంపెనీల నుంచి ప్రభుత్వానికి అందిన సానుకూల సహకారాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.  ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించడంలో ప్రభుత్వం మరియు పరిశ్రమల మధ్య సహకారం మరియు సహకారం అవసరమని అన్నారు. 

 గత 25 సంవత్సరాలుగా దేశానికి మరియు ఫార్మా రంగానికి  నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అందిస్తున్న సేవలను  శ్రీ భగవంత్ ఖూబా ప్రశంసించారు. "పరిశ్రమ ప్రయోజనాలకు హాని కలగకుండా సరసమైన మందులు లభించేలా   నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ  కృషి చేస్తుంది " అని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు ప్రారంభించిన రెండు అప్లికేషన్‌లతో రాబోయే సంవత్సరాల్లో   నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ   తన పనిని మరింత సాఫీగా మరియు సమర్ధవంతంగా కొనసాగించగలదని ఆయన తన ఆశావాదాన్ని కూడా వ్యక్తం చేశారు.

రజతోత్సవ వేడుకల్లో భాగంగా  ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ 2.0 (IPDMS 2.0) మరియు ఫార్మా సాహి దామ్ 2.0 యాప్‌ను ప్రారంభించారు.

సమీకృత ప్రతిస్పందన  క్లౌడ్ ఆధారిత అప్లికేషన్ గా పనిచేసే IPDMS 2.0 ని  సెంటర్ ఫర్ అడ్వాన్స్ కంప్యూటింగ్ (C-DAC) సాంకేతిక సహకారం తో   నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ  అభివృద్ధి చేసింది.   డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (DPCO), 2013 కింద తప్పనిసరి చేసిన వివిధ ఫారమ్‌ల సమర్పణలకు ఏక గవాక్ష విధానాన్ని అందుబాటులోకి తెచ్చి సులభతర వ్యాపార నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ లక్ష్య సాధన కోసం  IPDMS 2.0 ని అభివృద్ధి చేయడం జరిగింది.   నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీలో కాగిత రహిత పాలన జరిగేలా IPDMS 2.0 సహకరిస్తుంది.   దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ 
తో సంబంధిత వర్గాలు అనుసంధానం అయ్యే అంశాన్ని సులభతరం చేస్తుంది. 

నవీకరించిన  ఫార్మా సాహి దామ్ 2.0 యాప్  స్పీచ్ రికగ్నిషన్ వంటి  సౌకర్యాలు  కలిగి ఉంటుంది.  హిందీ మరియు ఆంగ్లంలో యాప్ అందుబాటులో ఉంటుంది. షేర్ బటన్ మరియు బుక్‌మార్కింగ్ సౌకర్యాలను కూడా దీనిలో కల్పించారు.  వినియోగదారుల ఫిర్యాదుల నిర్వహణ మాడ్యూల్ ద్వారా వినియోగదారు ఫిర్యాదులను ప్రారంభించే సదుపాయాన్ని కూడా యాప్  కలిగి ఉంది. యాప్ iOS మరియు Android వెర్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

 ' యాన్ ఓవర్‌వ్యూ ఆఫ్ డ్రగ్ ప్రైసింగ్ @ NPPA 25 ఇయర్ ఒడిస్సీ' అనే శీర్షికతో ఒక పుస్తకాన్ని విడుదల చేశారు.  25 సంవత్సరాల నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ సాధించిన విజయాలు, అమలు చేసిన చర్యలు, ధరల నియంత్రణకు అమలు చేసిన  ప్రత్యేక చర్యలు,  దేశంలో ఔషధ నియంత్రణ వ్యవస్థ యొక్క పరిణామం తదితర అంశాలను దీనిలో పొందుపరిచారు. .
 ఎన్‌పిపిఎ ఛైర్మన్‌ శ్రీ కమలేష్‌ పంత్‌ స్వాగతోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో ఫార్మాస్యూటికల్స్ విభాగం కార్యదర్శి శ్రీమతి ఎస్ అపర్ణ, ఎన్‌పిపిఎ మెంబర్ సెక్రటరీ డాక్టర్ వినోద్ కొత్వాల్ పాల్గొన్నారు.
ఫార్మాస్యూటికల్ మరియు మెడ్‌టెక్ పరికరాల పరిశ్రమ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైస్ మానిటరింగ్ మరియు రిసోర్స్ యూనిట్లు, సివిల్ సొసైటీ, పేషెంట్ అడ్వకేసీ గ్రూపులు, ఫార్మాస్యూటికల్ పరిశోధన, విద్యా సంస్థల ప్రతినిధులు  కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. .




(Release ID: 1855275) Visitor Counter : 151