సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో తొలి దివ్యాంగ్ పార్క్‌ ఏర్పాటు


సీనియ‌ర్ సిటిజెన్ల‌కు, దివ్యాంగుల‌కు మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో సామాజిక అధికార‌త శిబిరం

Posted On: 26 AUG 2022 9:14AM by PIB Hyderabad

 రాష్ట్రీయ వ‌యోశ్రీ యోజ‌న (ఆర్‌వివై ప‌థ‌కం) కింద వ‌యోవృద్ధుల‌కు, భార‌త సామాజిక న్యాయ‌, సాధికార‌త మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఎడిఐపి ప‌థ‌కం కింద  దివ్యాంగుల‌కు తోడ్పాటు, స‌హాయ ప‌రిక‌రాల పంపిణీ కోసం   నాగ్‌పూర్ జిల్లా ప‌రిపాల‌న శాఖ‌, నాగ్ పూర్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (ఎన్ఎంసి), ఎఎల్ఐఎంసిఒతో క‌లిసి సామాజిక న్యాయం, సాధికార‌త విభాగం  సామాజిక అధికార‌త శిబిర్‌ను నాగ్‌పూర్ (మ‌హారాష్ట్ర)లోని రేషిమ్‌బాగ్ మైదానంలో శుక్ర‌వారం నిర్వ‌హించింది. 
కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన‌ కేంద్ర రోడ్డు ర‌వాణా, హైవేల మంత్రి శ్రీ‌నితిన్ గ‌డ్క‌రీ, పంపిణీ శిబిరాన్ని ప్రారంభించిన దివ్యాంగుల‌కు, సీనియ‌ర్ సిటిజెన్ల‌కు భిన్న స‌హాయ‌క ప‌రిక‌రాల‌ను, ఎయిడ్స్‌ను కేంద్ర సామాజిక న్యాయం, సాధికార‌త మంత్రి డాక్ట‌ర్ వీరేంద్ర కుమార్ స‌మ‌క్షంలో అంద‌చేశారు. 
కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కం కింద రూ. 3483.00 ల‌క్ష‌ల విలువైన మొత్తం 241200 స‌హాయ ప‌రిక‌రాల‌ను ఉచితంగా 27356 మంది సీనియ‌ర్ సిటిజెన్ల‌కు, 7780 మంది దివ్యాంగ ల‌బ్ధిదారుల‌కు పంపిణీ చేయ‌నున్నారు. 
ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, స‌మాజంలోని బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన వ్య‌క్తికి, వ‌రుస‌లో చిట్ట చివ‌ర ఉండే వ్య‌క్తికి ప్ర‌భుత్వ ప‌థ‌క ల‌బ్ధి చేకూర్చ‌డం ద్వారా వారిని సాధికారం చేయ‌డం మ‌న ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గ‌డ్క‌రీ అన్నారు. త‌న మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని సామాజిక సంక్షేమ ప‌థ‌కాల‌ను నాగ్‌పూర్ న‌గ‌రంలో అమ‌లు చేస్తున్నందుకు కేంద్ర సామాజిక న్యాయం & సాధికార‌త మంత్రి డాక్ట‌ర్ వీరేంద్ర కుమార్‌కు ఆయ‌న త‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 
కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో తొలి దివ్యాంగ్ పార్క్ ను ఏర్పాటు చేసేందుకు త‌మ మంత్రిత్వ శాఖ సాధ్య‌మైనంత తోడ్పాటునందించ‌నుంద‌ని, ఈ దిశ‌గా త్వ‌ర‌లోనే ప‌ని ప్రారంభం కానుంద‌ని డాక్ట‌ర్ విరేంద్ర కుమార్ ప్ర‌క‌టించారు. దివ్యాంగుల‌కు సెన్స‌రీ గార్డెన్ (సంవేద‌నాత్మ‌క తోట‌), టెక్స్‌టైల్ పాత్‌వే ట‌చ్ (మార్గంలో తివాచీ ప‌రిచిన భావ‌న‌), స్మెల్ గార్డెన్ (సువాస‌న‌లు పీల్చ‌గ‌ల‌), నైపుణ్యాల శిక్ష‌ణా సౌక‌ర్యం, పున‌రావాస కేంద్రం, క్రీడ‌లు & ఇన్ఫోటైన్‌మెంట్ త‌దిత‌ర భిన్న సౌక‌ర్యాలు ఉంటాయి. 
 నాగ్‌పూర్ ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల‌లో భిన్న ప్ర‌దేశాల‌లో నాగ్‌పూర్‌ జిల్లా ప‌రిపాల‌నా యంత్రాంగం, ఎన్ ఎంసితో క‌లిసి ఎఎల్ ఐ ఎంసిఒ నిర్వ‌హించిన అసెస్‌మెంట్ శిబిరాల‌లో పాల్గొని న‌మోదు చేసుకున్న గుర్తించిన సీనియ‌ర్ సిటిజెన్ల‌కు & దివ్యాంగ ల‌బ్ధిదారుల‌కు భిన్న‌ర‌కాలైన స‌హాయక ప‌రిక‌రాల‌ను ద‌శ‌ల‌వారీగా అంద‌చేస్తారు.  ల‌బ్దిదారుల గుర్తింపు కోసం ఈ అసెస్‌మెంట్ శిబిరాల‌ను ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి మే వ‌ర‌కు నిర్వ‌హించారు. రేషింబాగ్ మైదానంలో నిర్వ‌హించిన ప్రారంభ పంపిణీ శిబిరంలో  రూ. 919.00 ల‌క్ష‌లు మొత్తం 68683 స‌హాయక ప‌రిక‌రాల‌ను ద‌క్షిణ నాగ్‌పూర్ కు చెందిన 9018 మంది ముందుగా గుర్తించిన ల‌బ్ధిదారుల‌కు (8164 సీనియ‌ర్ సిటిజెన్లు, 854 దివ్యాంగుల‌కు) పంపిణీ చేయ‌నున్నారు. 
ద‌క్షిణ నాగ్‌పూర్‌లో గుర్తించిన‌ ల‌బ్ధిదారుల‌కు పంపిణీ చేయ‌నున్న స‌హాయ‌క ప‌రిక‌రాల‌లో 30 మోటార్ త్రిచ‌క్ర‌వాహ‌నాలు, 98 ద్విచ‌క్ర‌వాహ‌నాలు, 1530 చ‌క్రాల కుర్చీలు, 305 క్ర‌చ్‌లు, 6488 చేతిక‌ర్ర‌లు, 21 బ్రెయిలీ కిట్లు, 75 బ్రెయిలీ కేన్‌లు, 09 రోలాట‌ర్‌లు ( చ‌క్రాలు క‌లిగిన ప్ర‌త్యేక వాక‌ర్లు), 4166 వినికిడి మెషిన్లు, 102 ఎంఎస్ఐఇడి కిట్లు, 11 సి.పి. కుర్చీలు, 64 స్మార్ట్ ఫోన్లు, 6436 సెర్విక‌ల్ కాల‌ర్లు (మెడ చుట్టూ వేసుకునే ప‌ట్టీ), 211 కాలిప‌ర్లు (పెట్టుడు కాలు)తో పాటు సినియ‌ర్ సిటిజెన్ల‌కు ఉద్దేశించిన ప‌రిక‌రాల‌లో 13 ఫుట్ కేర్ యూనిట్లు, 1585 ట్రైపాడ్లు (మూడు కాళ్ళున్న చేతిక‌ర్ర‌లు)1247 స్పైన‌ల్ స‌పోర్ట్ (వెన్నుముక‌కు మ‌ద్ద‌తుగా ఉండే ప‌ట్టీలు), 8107 ఎల్ఎస్ బెల్టులు (న‌డుముకు క‌ట్టుకునే బెల్టులు), 213 క‌మోడ్ క‌లిగిన చ‌క్రాల కుర్చీలు, 7677 క‌మోడ్ క‌లిగిన చైర్ స్టూళ్ళు, 7855 సిలికాన్ ఫోం కుష‌న్‌, 03 సీటుతో కూడిన చేతిక‌ర్ర‌లు, 581 వాక‌ర్లు, 4763 క‌ళ్ళ‌జోళ్ళు, 16168  నీ బ్రేసెస్ (మోకాలికి క‌ట్టుకునే ప‌ట్టీలు), 935 డెంచ‌ర్లు (క‌ట్టుడు ప‌ళ్ళు) ఉన్నాయి. 
భార‌త ప్ర‌భుత్వ సామాజిక న్యాయం & సాధికార‌త  విభాగం అద‌న‌పు కార్య‌ద‌ర్శి శ్రీ సురేంద్ర సింగ్‌, నాగ్‌పూర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (ఎన్ఎంసి) క‌మిష‌న‌ర్ శ్రీ బి. రాధాకృష్ణ‌న్‌, నాగ్‌పూర్ ఎన్ఎంసి డిప్యూటీ క‌మిష‌న్ శ్రీ విజ‌య్ హుమ్నే, నాగ్‌పూర్ జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ విపిన్ ఇంత‌న్‌కార్‌, నాగ్‌పూర్ జిల్లా ప‌రిష‌త్ సిఇఒ శ్రీ యోగేష్ కుంభేజ్‌క‌ర్‌, మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు, ఎఎల్ఐఎంసిఒకు చెందిన సినియ‌ర్ అధికారులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.  

 

***


(Release ID: 1854685) Visitor Counter : 196