పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్మార్ట్ మరియు స్థిరమైన ఏవియేషన్ టెక్నాలజీ సహకారాన్ని సులభతరం చేయడానికి స్వీడన్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన ఏఏఐ

Posted On: 26 AUG 2022 12:13PM by PIB Hyderabad

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మరియు స్వీడన్‌కు చెందిన ఎల్‌ఎఫ్‌వి ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ ఈరోజు న్యూఢిల్లీలోని ఏఏఐ కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్‌లో అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.

స్మార్ట్ ఏవియేషన్ సొల్యూషన్స్‌ను అన్వేషించడానికి, తదుపరి తరం స్థిరమైన ఏవియేషన్ టెక్నాలజీని నిర్మించడంలో మరియు అమలు చేయడంలో భారతదేశం మరియు స్వీడన్‌ల
రెండు ఎయిర్ నావిగేషన్ సర్వీస్ ప్రొవైడర్లను ఈ ఒప్పందం ఒకచోట చేర్చింది. ఈ ఎమ్ఒయు రెండు దేశాల మధ్య విమానయాన నైపుణ్యం మరియు సాంకేతికత ద్వైపాక్షిక మార్పిడికి మార్గం సుగమం చేస్తుంది. ఇది స్వీడిష్ ఆవిష్కరణ మరియు నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటూ భారతీయ కంపెనీలను వృద్ధిని వేగవంతం చేయడానికి అనుమతిస్తుంది. ఎంఓయూ కింద, కంపెనీలు పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో సహకరించుకోవచ్చు.

 

image.png

 

ఎం. సురేష్, సభ్యుడు (ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్), ఏఏఐ మరియు శ్రీ మాగ్నస్ కోరెల్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ఎల్‌ఎఫ్‌వి స్వీడన్ ఈ ఎమ్ఒయుపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఏఐ చైర్మన్ శ్రీ సంజీవ్ కుమార్ ; ఎంఎస్. మాలిన్ సెడర్‌ఫెల్డ్ట్ ఓస్ట్‌బర్గ్, స్టేట్ సెక్రటరీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మంత్రిత్వ శాఖ, స్వీడన్, హెచ్‌ఈ క్లాస్ మోలిన్, భారతదేశంలో స్వీడన్ రాయబారి మరియు హెచ్.ఇ. తన్మయ లాల్, స్వీడన్‌లో భారత రాయబారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఏఐ,ఎల్‌ఎఫ్‌వి, స్వీడన్ ఎంబసీ, న్యూఢిల్లీ మరియు బిజినెస్ స్వీడన్ -ది స్వీడిష్ ట్రేడ్ & ఇన్వెస్ట్ కౌన్సిల్ నుండి సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

తదుపరి తరం స్మార్ట్ విమానాశ్రయాలకు సంబంధించి వేగవంతమైన అభివృద్ధి అవసరం. ఈ నేపథ్యంలో స్థిరమైన రవాణా వ్యవస్థలను నిర్మించాల్సిన ఆవశ్యకతను అంగీకరిస్తూ రెండు పార్టీలు ఎమ్ఒయులోని క్రింది అంశాలకు సమ్మతించాయి:

 

  • విమానయాన పరిజ్ఞానం మరియు సాంకేతిక బదిలీ కార్యక్రమం మార్పిడి
  • రెండు ఏజెన్సీల మధ్య సన్నిహిత మరియు స్నేహపూర్వక సంబంధాలను ప్రోత్సహించండి
  • విమానాశ్రయాలలో సాంకేతిక సహకారాన్ని విస్తరించడం లక్ష్యం
  • సురక్షితమైన, స్థిరమైన మరియు సమర్థవంతమైన విమానయాన రంగ అభివృద్ధికి మద్దతు ఇవ్వండం
  • ద్వైపాక్షిక మరియు అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో సానుకూల సహకారం


ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ శ్రీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. సమర్థవంతమైన, సురక్షితమైన, మరియు స్థిరమైన విమానయాన అభివృద్ధికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను బలోపేతం చేయడానికి సహకార ప్రయత్నాన్ని ఈ చొరవ తీసుకున్నందుకు భారత ప్రభుత్వం మరియు స్వీడన్ ప్రభుత్వాన్ని అభినందించారు. ఏఏఐ మరియు ఎల్‌ఎఫ్‌వి స్వీడన్‌ల మధ్య పౌర విమానయానంలో పరస్పర మార్పిడి తదుపరి తరం స్మార్ట్ మరియు స్థిరమైన ఏవియేషన్ టెక్నాలజీని నిర్మించడంలో మరియు అమలు చేయడంలో చాలా దూరం వెళ్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

భారత్‌లోని స్వీడన్ రాయబారి మిస్టర్ క్లాస్ మోలిన్ భారతదేశం మరియు స్వీడన్ మధ్య దీర్ఘకాల సహకారం గురించి మాట్లాడారు. "ఇప్పటికే సుస్థిరత, ఆరోగ్యం, ఆవిష్కరణలు, ఎనర్జీ వంటి విస్తృతమైన  రంగాల్లో భారత్-స్వీడన్ సహకారానికి ఈ కార్యక్రమం కూడా జతకలుస్తుంది.  విమానయాన రంగంలో వాతావరణ-స్మార్ట్ పరిష్కారాలను అన్వేషించడానికి స్వీడన్ మరియు భారత్‌లకు ఎంఓయు మరిన్ని అవకాశాలను ఎలా పెంపొందించగలదో చూడాలని నేను ఎదురు చూస్తున్నాను.

స్వీడన్‌లోని భారత రాయబారి శ్రీ తన్మయ లాల్ మాట్లాడుతూ “భారత్, స్వీడన్ భాగస్వామ్యం పురోగమిస్తోంది. ఈ ఎమ్ఒయు మరో కొత్త గ్రౌండ్‌ను కవర్ చేస్తుంది మరియు విమానయాన రంగంలో భద్రత, స్థిరత్వం మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సాంకేతిక సహకారాన్ని సులభతరం చేస్తుంది. భారతదేశంలో ప్రాంతీయ వైమానిక కనెక్టివిటీ వృద్ధి చెందుతున్న సందర్భంలో కూడా ఇది ఒక ముఖ్యమైన పరిణామం." అని తెలిపారు.

సహకార ప్రాంతాలు మరియు కార్యాచరణ ప్రణాళిక

ఏఏఐ మరియుఎల్‌ఎఫ్‌విలు భారత్ మరియు స్వీడన్ ప్రభుత్వ ఏజెన్సీలు, ఈ క్రింది సహకార రంగాలలో సంయుక్తంగా సహకరిస్తాయి:

 

  1. ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణ
  2. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్
  3. రిమోట్ విమానాశ్రయ నిర్వహణ మరియు ట్రాఫిక్ నియంత్రణ
  4. ఎయిర్‌స్పేస్ డిజైన్ మరియు ప్లానింగ్
  5. ఎయిర్‌పోర్ట్ డిజైన్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
  6. డిజిటలైజ్డ్ ఎయిర్‌పోర్ట్ మరియు ఏవియేషన్
  7. సామర్థ్యం మరియు శిక్షణ
  8. స్థిరమైన విమానాశ్రయాలు మరియు విమానయానం
  9. పైలట్ల కోసం ప్రక్రియలు
  10. స్కేల్-అప్ కోసం ప్రక్రియలు

రెండు దేశాల మధ్య ఆసక్తి ఉన్న రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి మరియు సహకారాన్ని కొనసాగించడానికి జాయింట్ వర్కింగ్ గ్రూప్ నిర్వహించబడుతుంది. సుస్థిరత, ఆరోగ్య సంరక్షణ, ఆవిష్కరణ, ఇంధనం మరియు మౌలిక సదుపాయాలు మొదలైన ఇతర కార్యక్రమాలకు అదనంగా విమానయాన రంగంలో భారతదేశం మరియు స్వీడన్ ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని కొనసాగించడంలో ఈ ఎమ్ఒయు కీలక పాత్ర పోషిస్తుంది.

 

***


(Release ID: 1854684) Visitor Counter : 198