మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అపూర్వమైన అవకాశాలను సృష్టించేందుకు భారతదేశంలో సంస్కరణలు, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత ఒకే లక్ష్యంగా పయనిస్తున్నాయి- శ్రీ ధర్మేంద్ర ప్రధాన్


శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మెల్‌బోర్న్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో - భవిష్యత్తు కోసం
నైపుణ్యాలను పెంపొందించడంపై పాలసీ డైలాగ్‌లో పాల్గొన్నారు

ఆస్ట్రేలియా నైపుణ్యాలు, శిక్షణ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరిపిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

రెండు దేశాలను నాలెడ్జ్ ఎకానమీలుగా మార్చేందుకు ఒకరికొకరు
ఉత్తమ పద్ధతులు ఇచ్చి పుచ్చుకోవాలని పిలుపునిచ్చిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

Posted On: 23 AUG 2022 4:14PM by PIB Hyderabad

ఈరోజు మెల్‌బోర్న్‌లోని డాక్‌లాండ్స్‌లోని కంగన్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన 'విఈటి: పాలసీ డైలాగ్ ఆన్ డెవలపింగ్ స్కిల్స్ ఫర్ ది ఫ్యూచర్'లో విక్టోరియన్ స్కిల్స్ అథారిటీ   సీఈఓ క్రెయిగ్ రాబర్ట్‌సన్,, బెండిగో కంగన్ ఇన్స్టిట్యూట్ సీఈఓ సాలీ కర్టెన్ తో కలిసి కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ఆస్ట్రేలియన్ స్కిల్లింగ్ ఎకోసిస్టమ్ దిగ్గజాలు కూడా ఈ సదస్సు  పాల్గొన్నారు. భవిష్యత్తులో నైపుణ్యాలతో యువతను సన్నద్ధం చేయడానికి, ఉపాధితో వారిని కనెక్ట్ చేయడానికి, నైపుణ్య ఫలితాలను మెరుగుపరచడానికి, పరిశ్రమ, విద్యా సంబంధాలు బలోపేతం చేయడానికి ఈ సమావేశం చాల కీలకమైనది. నైపుణ్యం అవసరాలకు చురుకైన ప్రతిస్పందనను అందించడానికి భారతదేశంలో ఆస్ట్రేలియన్ నైపుణ్య ప్రమాణాలు, సర్టిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్‌లను అమలు చేసే సంభావ్యత...  చర్చలలో  ప్రధాన అంశాలు అయ్యాయి.

 

Fa01aBzUcAE1s0I.jpg

Fa01aByVsAUqTDq.jpg

 

నైపుణ్యం కలిగిన, అధిక-ఉత్పాదక మానవ వనరుల కోసం భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా మార్చడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనలను, ప్రయత్నాలను శ్రీ ప్రధాన్ వివరించారు. 21వ శతాబ్దంలో భారతదేశం యువ జనాభా  అతిపెద్ద బలం అని అన్నారు. నైపుణ్యం కలిగిన భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు దోహదపడుతుందని అన్నారు.

శ్రీ ప్రధాన్ ఆస్ట్రేలియాలోని నైపుణ్య సంస్థల సహకారం కోసం భారత్ తరఫున ఆసక్తిని కూడా వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో పరస్పర ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడంలో ఆస్ట్రేలియాలో అనేక అవకాశాల కోసం భారతదేశ యువతకు నైపుణ్యం కల్పించడంలో భారతదేశాన్ని భాగస్వామిగా ఉంచడానికి ఆస్ట్రేలియా ఆసక్తిని ఆయన ప్రశంసించారు. నైపుణ్యాల మదింపు, అర్హతలు, నైపుణ్యాల గుర్తింపు, కరికులం డెవలప్‌మెంట్, వర్క్‌ఫోర్స్ డెవలప్‌మెంట్ రంగాలలో కలిసి పనిచేయడానికి భారతదేశం, ఆస్ట్రేలియా రెండూ అనేక అవకాశాలను కలిగి ఉన్నాయి. మన దేశాల్లోని భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న వర్క్‌ఫోర్స్ ప్రపంచ అవకాశాలతో అనుసంధానం అవ్వడానికి  బాగా సిద్ధం చేస్తుందని అన్నారు.

బెండిగో కంగన్ ఇనిస్టిట్యూట్‌లోని ఆటోమోటివ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను కూడా శ్రీ ప్రధాన్ సందర్శించారు. ఆటోమోటివ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఏస్) కస్టమైజ్డ్, హ్యాండ్-ఆన్ ఆటోమోటివ్ ట్రైనింగ్, రీసెర్చ్, డెవలప్‌మెంట్‌ను ఒకచోట చేర్చడం ద్వారా పారిశ్రామిక సంస్థల వృద్ధిని ప్రోత్సహించడానికి స్థాపించారు. డాక్‌ల్యాండ్స్‌లో ఏర్పాటు చేసిన 'ఏస్'  కేంద్రంగా, విక్టోరియా రిటైల్, సర్వీస్, రిపేర్, తయారీ పరిశ్రమలకు అందుబాటులో ఉండేలా రూపొందించారు. కంగన్ ఇన్స్టిట్యూట్ జాతీయంగా గుర్తింపు పొందిన టేఫ్ అర్హతలు, చిన్న కోర్సులు, ప్రత్యేక అవసరాలను తీర్చడానికి ప్రత్యేక శిక్షణ ప్రణాళికలను అందిస్తుంది, ఆన్-సైట్ శిక్షణతో సహా సౌకర్యవంతమైన అభ్యాస ఎంపికలు చేసుకోవచ్చు.

Fa1UG8WUIAA9HSz.jpg

శ్రీ ప్రధాన్ మెల్‌బోర్న్‌లోని డీకిన్ యూనివర్శిటీని కూడా సందర్శించారు. యూనివర్శిటీ గురించి వివరణాత్మక అవలోకన చేసుకున్నారు. ముఖ్యంగా పరిశ్రమ-రూపకల్పన చేసిన కోర్సులు, పరిశోధన డిగ్రీలు, ప్రవేశ మార్గాల గురించి అడిగి తెలుసుకున్నారు. భారత్ లో జాతీయ విద్యా విధానం (ఎన్ ఈ పి)- 2020 ప్రారంభం, అనేక రంగాలలో మార్గనిర్దేశిత సంస్కరణలు, అభివృద్ధి చెందుతున్న ఆవిష్కరణలు, స్టార్టప్ వాతావరణం భారతదేశం అవకాశాలతో నిండి ఉండేలా చేశాయని శ్రీ ప్రధాన్ అన్నారు. శ్రీ ప్రధాన్ భారతదేశంలోని అవకాశాలను అన్వేషించడానికి, రెండు దేశాలను జ్ఞాన ఆర్థిక వ్యవస్థలుగా మార్చడానికి ప్రతిపాదన చేశారు. రెండు దేశాల ప్రజల శ్రేయస్సు కోసం ఒకరి నుండి మరొకరు ఉత్తమ పద్ధతులను నేర్చుకోవడానికి, యంత్రాంగాన్ని రూపొందించడానికి డీకిన్ విశ్వవిద్యాలయం, అన్ని ఆస్ట్రేలియ విశ్వవిద్యాలయాలు, నైపుణ్య సంస్థలను ఆహ్వానించారు.

 

శ్రీ ప్రధాన్ ఆస్ట్రేలియన్ నైపుణ్యాలు, శిక్షణ మంత్రి బ్రెండన్ ఓ'కానర్‌తో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెక్టార్‌లో లోతైన సహకారాన్ని ఏర్పరచుకోవడం, అత్యంత ఉత్పాదకత, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న మానవ వనరులను సృష్టించడం కోసం కలిసి పని చేయడంపై వారు చర్చలు జరిపారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు అవకాశాలను అన్వేషించడం కోసం భారతదేశాన్ని సందర్శించాల్సిందిగా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆస్ట్రేలియా మంత్రిని ఆహ్వానించారు. భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య అర్హత ప్రమాణాల సమన్వయం భారతదేశంలోని టేఫ్ ఇన్‌స్టిట్యూట్‌ల స్థానికీకరించిన సంస్కరణ నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్ కదలికను వేగవంతం చేస్తుందని శ్రీ ప్రధాన్ అన్నారు.

 

 

Fa1dkNcVsAAcNeE.jpg Fa1di8YUEAEwwrY.jpg

తరువాత, సాయంత్రం మెల్‌బోర్న్‌లోని ప్రవాస భారతీయులతో కూడా మంత్రి సంభాషించారు.

***


(Release ID: 1854000) Visitor Counter : 184