రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ముంబై నుంచి ఢిల్లీకి కేవలం 12 గంటల్లో ప్రయాణించే లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను ప్లాన్ చేద్దాం: కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ


ఇటువంటి కార్యక్రమాలు సుస్థిర రవాణా రంగానికి గతిశీల బలాన్ని ఇస్తాయి, ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి ప్రధాన మంత్రి దార్శనికత సాకారం కావడానికి సహాయపడతాయి- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ


ముంబైలో అశోక్ లేలాండ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు ప్రారంభించిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ

Posted On: 18 AUG 2022 4:29PM by PIB Hyderabad

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈరోజు ఆగస్టు 18, 2022న ముంబైలో స్విచ్ ఇఐవి 22పేరుతో అశోక్ లేలాండ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సును ప్రారంభించారు. ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభిస్తూ, కేంద్ర రవాణా మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, " దేశ రవాణా వ్యవస్థను దీర్ఘకాల దృక్కోణం నుండి మార్చవలసిన అవసరం ఉంది. పట్టణ రవాణాను సంస్కరించడంపై దృష్టి సారించి, మనం తక్కువ కర్బన ఉద్గారాలతో అధిక ప్రయాణీకుల సాంద్రత కలిగిన ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మొబిలిటీ ఎకోసిస్టమ్ను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము. పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్ను అందుకునే రవాణా పరిష్కారాలతో, ప్రభుత్వ దార్శనికత విధానాలు ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా ఉత్పత్తికి ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి."

అశోక్ లేలాండ్ సంస్థ పేర్కొన్నట్టు స్విచ్ ఇఐవి 22 అనేది భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ బస్సు, ఇది భారతదేశంలో రూపొందించి అభివృద్ధి చేశారు. Switch EiV 22 సరికొత్త సాంకేతిక, అల్ట్రా-ఆధునిక డిజైన్, అత్యధిక భద్రత ఉత్తమమైన సౌకర్యాల ఫీచర్లతో తయారైందని కంపెనీ తెలియజేసింది.

ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ హైవే కోసం తన విజన్ను పంచుకుంటూ కేంద్ర మంత్రి: నారిమన్ పాయింట్ నుండి ఢిల్లీకి అనుసంధానం చేయాలని ప్రణాళిక. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయి. ఆటోమొబైల్ కంపెనీలను ప్రోత్సహిస్తూ, “ముంబయి నుంచి ఢిల్లీకి కేవలం 12 గంటల్లో ప్రయాణించగల లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సు చేద్దాంఅని ఆయన అన్నారు.

డీజిల్ వంటి ఇతర ఇంధనాలతో పోల్చినప్పుడు ఆటోమొబైల్ ఇంధనంగా విద్యుత్తు అత్యంత సరసమైనదని కేంద్ర రవాణా మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు. “ముడి చమురు దిగుమతి ప్రభుత్వానికి పెద్ద సవాలు. సౌరశక్తిని ఉపయోగించడం వల్ల విద్యుత్ ఖర్చు చాలా వరకు తగ్గింది.

విద్యుత్తును ప్రత్యామ్నాయ ఇంధనంగా ముందుకు తెస్తున్న కేంద్ర మంత్రి, దేశంలో 35% కాలుష్యం డీజిల్, పెట్రోల్ల వల్లనే అని అన్నారు. ఈ నేపథ్యంలో దిగుమతి-ప్రత్యామ్నాయం, తక్కువ ఖర్చుతో కూడిన, కాలుష్య రహిత, స్వదేశీ ఉత్పత్తుల ఆవశ్యకతను మంత్రి ఎత్తిచూపారు. "భారతదేశం ఆటోమొబైల్ రంగానికి విద్యుత్, ఇథనాల్, మిథనాల్, బయో-డీజిల్, బయో-CNG, బయో-LNG గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించడం ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది".

ఆటోమొబైల్ పరిశ్రమ కోసం తన ప్రణాళికలను పంచుకుంటూ, శ్రీ గడ్కరీ, “నా స్వప్నం ఆటోమొబైల్ పరిశ్రమ ప్రస్తుత రూ. 7.5 లక్షల కోట్ల నుంచి రూ. 2024 చివరి నాటికి 15 లక్షల కోట్లకు చేర్చడం; ఇది సాధించగల లక్ష్యమని ఆయన అన్నారు. ఈ రంగం గరిష్ట ఉపాధి అవకాశాలను కలిగి ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గరిష్ట పన్నులను ఇస్తుందని మంత్రి గమనించారు.

స్విచ్ EiV గురించి (అశోక్ లేలాండ్ ప్రకారం)

స్విచ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్, సింగిల్ డెక్కర్ బస్సుతో పోల్చితే దాదాపు రెట్టింపు సంఖ్యలో కూర్చున్న ప్రయాణికులను రవాణా చేయగలదు, కేవలం 18% బరువు (ప్రయాణికులు లేకుండా) పెరుగుదలతో ఇది సాధ్యమవుతుంది.

సమకాలీన స్టైలింగ్ ఫీల్ గుడ్ ఇంటీరియర్స్ ఎక్స్‌ టీరియర్స్‌ తో, డబుల్ డెక్కర్‌లో విశాలమైన ముందు వెనుక తలుపులు, రెండు మెట్లు తాజా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఎమర్జెన్సీ డోర్ ఉన్నాయి. AC భారతదేశంలోని వేడి వాతావరణ పరిస్థితులలో ప్రభావవంతమైన శీతలీకరణ అందిస్తుంది, అయితే 65 మంది ప్రయాణికులకు అనుకూలమైన సీటింగ్ అనేది ఇచ్చిన నమూనాలో అందించగలిగే గరిష్ట సంఖ్యలో సీట్లు.


ప్రతి సీటు తేలికైన కుషన్ కలిగి ఉంటుంది ఇంటీరియర్స్ ప్రయాణీకుల సౌలభ్యం కోసం కారు లాంటి సౌకర్యంతో వస్తాయి. ఈ అత్యాధునిక ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ పట్టణ ప్రయాణాలకు ఆదర్శవంతమైన పరిష్కారంగా పనిచేస్తుంది, ఎందుకంటే ఈ బస్సు లో కూర్చున్న ప్రయాణికులు తక్కువ రోడ్డు, టెర్మినల్ డిపో ఫ్లోర్ స్థలాన్ని ఆక్రమిస్తారు.

ఇండియా సైన్స్ టీవీ ద్వారా నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ గురించి సమాచార వీడియో ఇక్కడ ఉంది

https://www.indiascience.in/videos/national-electric-mobility-mission-e-1



(Release ID: 1853670) Visitor Counter : 92