ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

209.27 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం

12-14 ఏళ్ల వారికి 3.99 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,01,830

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 15,754

ప్రస్తుత రికవరీ రేటు 98.58%

వారపు పాజిటివిటీ రేటు 3.90%

Posted On: 19 AUG 2022 9:52AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 209.27 కోట్ల ( 2,09,27,32,604 ) డోసులను అధిగమించింది. 2,78,10,025 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.


12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.99 కోట్లకు పైగా ( 3,99,04,328 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.
 

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:  

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,13,391

రెండో డోసు

1,01,00,654

ముందు జాగ్రత్త డోసు

66,09,494

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,33,413

రెండో డోసు

1,76,88,341

ముందు జాగ్రత్త డోసు

1,28,47,874

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,99,04,328

రెండో డోసు

2,94,36,395

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,15,29,678

రెండో డోసు

5,19,02,009

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

56,01,76,401

రెండో డోసు

51,15,08,473

ముందు జాగ్రత్త డోసు

4,68,71,656

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,38,22,393

రెండో డోసు

19,59,30,545

ముందు జాగ్రత్త డోసు

2,78,87,495

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,75,30,132

రెండో డోసు

12,24,58,264

ముందు జాగ్రత్త డోసు

3,76,81,668

ముందు జాగ్రత్త డోసులు

13,18,98,187

మొత్తం డోసులు

2,09,27,32,604

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,01,830. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.23 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.58 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 15,220 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,36,85,535 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 15,754 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

గత 24 గంటల్లో మొత్తం 4,54,491 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 88.18 కోట్లకు పైగా ( 88,18,73,052 ) పరీక్షలు నిర్వహించారు.


వారపు పాజిటివిటీ రేటు 3.90 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 3.47 శాతంగా నమోదయ్యాయి.

 

                                                                                                                                                                                                                        ****

 



(Release ID: 1853158) Visitor Counter : 96