రక్షణ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో రేపు ఆత్మపరిశీలనః సాయుధ దళాల ట్రిబ్యునల్ అన్న అంశంపై జాతీయ సెమినార్‌ను ప్రారంభించనున్న రక్షణమంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
Posted On:
19 AUG 2022 9:20AM by PIB Hyderabad
ఆత్మపరిశీలనః సాయుధ దళాల ట్రిబ్యునల్ ( ‘Introspection: Armed Forces Tribunal’) అన్న అంశంపై ఆగస్టు 20, 2022న న్యూఢిల్లీలో సాయుధ దళాల ట్రిబ్యునల్ (ప్రిన్సిపల్ బెంచ్) బార్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్న జాతీయ సెమినార్‌ను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. మాజీ సైనికులు, వారి కుటుంబాలు, యుద్ధ వితంతువులతో పాటుగా సాయుధ దళాలలో పని చేస్తున్న సిబ్బందికి వేగవంతమైన. ఖర్చు తక్కువతో న్యాయాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన సాయుధ దళాల ట్రిబ్యునల్ పనితీరును పరిశీలించేందుకు ఈ సెమినార్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దాని పనితీరును విశ్లేషించి, సత్వరమైన న్యాయాన్ని పొందే క్రమంలో లిటిగెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను, కష్టాలను పరిష్కరించడం, లోటుపాట్లను సవరించుకునేందుకు సూచనలను అందించడం ఈ సెమినార్ లక్ష్యం.
రక్షణ మంత్రి ముఖ్య అతిథి కాగా, న్యాయ, చట్ట శాఖల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ, చట్ట & న్యాయ శాఖ, న్యాయవ్యవస్థకు సంబంధించిన సీనియర్ అధికారులు, సిబ్బంది ఈ సెమినార్‌లో పాల్గొంటారని భావిస్తున్నారు. సాయుధ దళాల ట్రిబ్యునల్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో భాగంగా ఈ సెమినార్‌ను నిర్వహిస్తున్నారు.
***
(Release ID: 1853138)
Visitor Counter : 126