రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టులో పురోగతి సాధన
Posted On:
17 AUG 2022 2:51PM by PIB Hyderabad
ఢిల్లీ- ఢెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు విషయంలో ఆటంకాలను అధిగమించి పురోగతి సాధించారు. తన ట్వీట్ల పరంపరలో కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, చివరి 20 కిమీల విస్తరణ రాజాజీ జాతీయ పార్కు సున్నితమైన పర్యావరణ జోన్ ద్వారా వెడుతుందని, ఇక్కడ ఆసియాలోనే అత్యంత పొడవైన ఎత్తైన వన్య ప్రాణి కారిడార్ (12 కిమీల)ను నిర్మిస్తున్నారని, ఇందులో 340 మీటర్ల దాత్ కాలి సొరంగం కూడా భాగమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోడీ ప్రభుత్వ ధ్యేయం సుస్థిరమైన వృద్ధి అన్నారు.
ఈ సొరంగం ఉద్దేశ్యం చుట్టుపక్క వన్యప్రాణులను పరిరక్షించడమని మంత్రి చెప్పారు. ఒకసారి పూర్తి అయితే, డెహ్రాడూన్- ఢిల్లీల మధ్య ప్రయాణ కాలాన్ని ఈ ఎక్స్‌ప్రెస్ 6 నుంచి 2,30 గంటలకు తగ్గిస్తుందని, ఇక ఢిల్లీ - హరిద్వార్‌ల మధ్య సమయాన్ని 5 నుంచి రెండు గంటలకి తగ్గిస్తుందని ఆయన వివరించారు.
***
(Release ID: 1852878)
Visitor Counter : 131