మంత్రిమండలి

పేటెంట్ కార్యాలయాలతో పాటు వినియోగదారులకు సంప్రదాయ విజ్ఞాన డిజిటల్ లైబ్రరీ (టికెడిఎల్) డేటాబేస్ ను విస్తృతం చేయడానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 17 AUG 2022 3:20PM by PIB Hyderabad

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ సమావేశం " పేటెంట్ కార్యాలయాలతో పాటు వినియోగదారులకు ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ (టికెడిఎల్ ) డేటాబేస్ ను విస్తృతం చేయడానికి" ఆమోదం తెలిపింది. టికెడిఎల్ డేటాబేస్ ను వినియోగదారులకు యాక్సెస్ ఇవ్వడం అనేది భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన, దూరదృష్టితో కూడిన చర్య.  విభిన్న రంగాలలో భారతదేశ విలువైన వారసత్వం ఆధారంగా పరిశోధన, అభివృద్ధి తో పాటు సృజనాత్మకతను టికెడిఎల్ ముందుకు తీసుకువెళుతుంది కనుక, ఇది భారతీయ సంప్రదాయ జ్ఞానానికి ఒక నవ ఉదయమే అవుతుంది.  నూతన విద్యా విధానం 2020 కింద భారతీయ జ్ఞాన పరంపర ద్వారా ఆలోచన మరియు విజ్ఞాన నాయకత్వాన్ని పెంపొందించడానికి టికెడిఎల్ ఓపెనింగ్ కూడా ఉద్దేశించబడింది.

 

భారతీయ సంప్రదాయ విజ్ఞానం (టికె) జాతీయ మరియు ప్రపంచ అవసరాలను తీర్చడానికి అపారమైన సామర్థ్యాన్ని అందిస్తుంది, తద్వారా సామాజిక ప్రయోజనాల తో పాటు ఆర్థిక వృద్ధికి దారి తీస్తుంది.  ఉదాహరణకు, మన దేశం నుండి వచ్చిన సంప్రదాయ వైద్య విధానాలు, స్వస్థత, అనగా ఆయుర్వేదం, సిద్ధ, యునానీ, సోవా రిగ్పా తో పాటు యోగా నేటికీ భారతదేశం మరియు విదేశాల నుండి వచ్చిన ప్రజల అవసరాలను తీరుస్తున్నాయి.  ఇటీవలి కోవిడ్-19 మహమ్మారి భారతీయ సాంప్రదాయ ఔషధాలను విస్తృతంగా ఉపయోగిస్తోంది, దీని ప్రయోజనాలు రోగనిరోధక శక్తిని పెంచడం నుండి లక్షణాల-ఉపశమనం వరకు యాంటీ వైరల్ కార్యకలాపాల వరకు ఉంటాయి.  ఈ ఏడాది ఏప్రిల్లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) భారతదేశంలో తన మొట్టమొదటి ఆఫ్-షోర్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్స్ (జిసిటిఎమ్) ను స్థాపించింది.  ఇవి ప్రపంచం లోని  ప్రస్తుత, అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడంలో సాంప్రదాయ జ్ఞానం నిరంతర ఔచిత్యాన్ని ప్రదర్శిస్తాయి.

 

పేటెంట్ కార్యాలయాలకు మించి డేటాబేస్ ప్రాప్యతను విస్తృతం చేయడానికి, సృజనాత్మకత మరియు వాణిజ్యాన్ని పెంపొందించే దిశగా ప్రస్తుత విధానాలతో సంప్రదాయ పరిజ్ఞానాన్ని సమీకృతం చేయడం తో పాటు సహకరించడం పై  దృష్టి పెడుతుంది.  టికెడిఎల్ విజ్ఞానం మరియు సాంకేతిక సరిహద్దులను అభివృద్ధి చేయడం కోసం టికె,  సమాచారం ముఖ్యమైన మూలాధారంగా పనిచేస్తుంది. టికెడిఎల్ ప్రస్తుత కంటెంట్‌లు భారతీయ సాంప్రదాయ ఔషధాలను విస్తృతంగా స్వీకరించడానికి దోహదపడతాయి, అదే సమయంలో కొత్త తయారీదారులు, ఆవిష్కర్తలు మా విలువైన విజ్ఞాన వారసత్వం ఆధారంగా సంస్థలను లాభదాయకంగా నిర్మించడానికి ప్రోత్సహిస్తాయి.

 

టికెడిఎల్ వ్యాపారాలు/కంపెనీలు {హెర్బల్ హెల్త్‌కేర్ (ఆయుష్, ఫార్మాస్యూటికల్స్, ఫైటోఫార్మాస్యూటికల్స్ మరియు న్యూట్రాస్యూటికల్స్), వ్యక్తిగత సంరక్షణ మరియు ఇతర ఎఫ్.ఎం.సి.జి}, పరిశోధనా సంస్థలు: పబ్లిక్ మరియు ప్రైవేట్; విద్యా సంస్థలు: అధ్యాపకులు, విద్యార్థులు; మరియు ఇతరులు: ఐ.ఎస్.ఎం అభ్యాసకులు, నాలెడ్జ్ హోల్డర్లు, పేటెంట్లు మరియు వారి చట్టపరమైన ప్రతినిధులు మరియు ప్రభుత్వం, అనేక ఇతర వ్యక్తులతో పాటు టికెడిఎల్ డేటాబేస్‌కు యాక్సెస్ చెల్లింపు సబ్‌స్క్రిప్షన్ మోడల్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ వినియోగదారులకు దశల వారీగా తెరవబడుతుంది.

 

భవిష్యత్తులో , ఇతర రంగాల నుండి భారతీయ సాంప్రదాయ జ్ఞానం గురించి మరింత సమాచారం టికెడిఎల్ డేటాబేస్‌కు “ 3 P అంటే సంరక్షణ, రక్షణ మరియు ప్రచారం ” (ప్రిజర్వేషన్, .  ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్)" దృక్కోణాల నుంచి జోడించబడుతుంది ". భారతీయ సంప్రదాయ విజ్ఞానం పై తప్పుడు పేటెంట్ల మంజూరును నిరోధించే దాని ప్రాథమిక ఆదేశాన్ని తీర్చేటప్పుడు, టికెడిఎల్ డేటాబేస్ సృజన శీలురను ఆరోగ్యకరమైన మరియు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన జనాభాకు మెరుగైన, సురక్షితమైన మరియు మరింత సమర్థవంతమైన పరిష్కారాల కోసం ఆవిష్కరణ చేయడానికి ప్రేరేపిస్తుంది.  భారతదేశపు గొప్ప వారసత్వం కొత్త సామాజిక-ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాదిని ఏర్పరుస్తుంది

 

టికెడిఎల్ గురించి: సాంప్రదాయ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ (టికెడిఎల్) అనేది 2001 సంవత్సరంలో స్థాపించబడిన భారతీయ సాంప్రదాయ విజ్ఞానం యొక్క పూర్వ కళ (గతంలో తెలిసిన) డేటాబేస్. ఇది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సి.ఎస్.ఐ.ఆర్) మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ అండ్ హోమియోపతి (ఐ.ఎస్.ఎం&ఎచ్, ఇప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ) సంయుక్తంగా ఏర్పాటు చేసింది. టికెడిఎల్ ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైన మొదటి డేటాబేస్ మరియు ఇతర దేశాలకు ఆదర్శప్రాయమైన మోడల్‌గా పనిచేస్తోంది. టికెడిఎల్ ప్రస్తుతం ఐ.ఎస్.ఎం కి సంబంధించిన ఆయుర్వేదం, యునాని, సిద్ధ, సోవ రిగ్పా మరియు యోగా వంటి సాహిత్యాల నుండి సమాచారాన్ని పొందుపరుస్తుంది. ఈ సమాచారం ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్, జపనీస్ మరియు స్పానిష్ అనే ఐదు అంతర్జాతీయ భాషలలో డిజిటలైజ్డ్ ఫార్మాట్‌లో డాక్యుమెంట్ చేయబడింది. టికెడిఎల్ పేటెంట్‌లను తప్పుగా మంజూరు చేయడాన్ని నివారించడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేటెంట్ కార్యాలయాల్లోని పేటెంట్ ఎగ్జామినర్‌లు అర్థం చేసుకోగలిగే భాషలు మరియు ఫార్మాట్‌లలో సమాచారాన్ని అందిస్తుంది. ఈ రోజు వరకు, పూర్తి టికెడిఎల్ డేటాబేస్ యాక్సెస్ శోధన మరియు పరీక్ష ప్రయోజనాల కోసం ప్రపంచవ్యాప్తంగా 14 పేటెంట్ కార్యాలయాలకు పరిమితం చేయబడింది. భారతీయ సంప్రదాయ జ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు టికెడిఎల్ తగినంత ప్రభావవంతంగా ఉంటుంది మరియు గ్లోబల్ బెంచ్‌మార్క్‌ గా పరిగణించబడుతుంది.

 

 

 (Release ID: 1852614) Visitor Counter : 300