పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా దాల్ సరస్సు వద్ద 7500 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు.

Posted On: 15 AUG 2022 5:42PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ(నార్త్), ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ శ్రీనగర్ మరియు డార్జిలింగ్ హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా 7500 చ.కి. భారత త్రివర్ణ పతాకాన్ని శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డున ప్రదర్శించారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు మరియు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఇది జరిగింది.

ఈ చారిత్రాత్మక ఘట్టానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా ముఖ్య అతిథిగా హాజరై  ప్రసంగించారు. లెఫ్టినెంట్ గవర్నర్ తన ప్రసంగంలో జమ్మూ & కాశ్మీర్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు మరియు రాబోయే 25 సంవత్సరాల అభివృద్ధి ప్రణాళిక గురించి మాట్లాడారు.

 

image.png



ఈ జెండా 80-85 కిలోల బరువు కలిగి ఉంది. 2021 ఏప్రిల్‌లో సిక్కిం హిమాలయాల్లో మొదటిసారిగా హెచ్ఎంఐ బృందం అదే జెండాను ప్రదర్శించింది. ఆ తర్వాత 15 ఆగస్టు 21న కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ వద్ద మరియు 31 అక్టోబర్ 2021న గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రదర్శించడం  జరిగింది.

 

image.png



ఆ తర్వాత, అంటార్కిటికాలో జెండా ప్రదర్శించబడింది. అంటార్కిటికాలో  ప్రదర్శించబడిన అతిపెద్ద జాతీయ జెండాగా ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఇప్పుడు భారతదేశ హర్ ఘర్ తిరంగ కార్యక్రమం మరియు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో నేపథ్యంలో ఈ జెండా శ్రీనగర్‌లో ప్రదర్శించబడింది.



image.png
 

ఈ జెండా శ్రీనగర్ చేరుకోవడానికి ముందు 80 సంవత్సరాల క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా 08 ఆగస్టు 2022న డార్జిలింగ్‌లో ప్రదర్శించబడింది. జెండా పరిమాణంలో చాలా పెద్దది కాబట్టి, ఇది మూడు ప్యానెల్‌లలో తయారు చేయబడింది. భద్రతా యాంకర్‌లను తగిన విధంగా అమర్చారు. తద్వారా జెండా అధిక వేగంతో వచ్చే పర్వత గాలుల నుండి అంటార్కిటికా సబ్జెరో ఉష్ణోగ్రత వరకు వాతావరణ అంత్య భాగాలను మరియు ఇతర తీవ్రమైన వాతావరణ అంశాలను కూడా తట్టుకోగలదు.

శ్రీ అనిల్ ఒరావ్, రీజినల్ డైరెక్టర్ (నార్త్) సాంప్రదాయకంగా లెఫ్టినెంట్ గవర్నర్‌కు స్వాగతం పలికారు మరియు దాల్ లేక్ శ్రీనగర్‌లో జెండాను ప్రదర్శించడానికి గలప్రాముఖ్యత గురించి మాట్లాడారు. జె& కె ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరుణ్ కుమార్ మెహతా ఐఏఎస్, ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ సర్మద్ హఫీజ్ మరియు ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు, ట్రావెల్ ట్రేడ్ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు వేడుకకు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లకు ట్రావెల్ ట్రేడ్ & హాస్పిటాలిటీ సెక్టార్ ప్రతినిధులు, హోటళ్లు, ప్రభుత్వ ప్రతినిధులు సహా అన్ని వర్గాల ప్రజలు అధికారులు, విద్యార్థులు కూడా హాజరయ్యారు.


 

*******


(Release ID: 1852164) Visitor Counter : 247