రక్షణ మంత్రిత్వ శాఖ
మలేషియా నిర్వహిస్తున్న ద్వైపాక్షిక విన్యాసాలలో పాల్గొంటున్న భారతీయ వైమానిక దళం
Posted On:
12 AUG 2022 1:51PM by PIB Hyderabad
ఉదరశక్తి పేరిట జరుగుతున్న ద్వైపాక్షిక విన్యాసాల కోసం భారతీయ వైమానిక దళ బృందం ఒక శుక్రవారం మలేషియాకు బయలుదేరి వెళ్ళింది.
భారత వైమానిక దళం ఎస్‌యు-30 ఎంకెఐను, సి-17 విమానంతో ఆకాశ విన్యాసాలలో పాల్గొంటుండగా, ఆర్ఎంఎఎఫ్ ఎస్‌యు 30 ఎంకెఎం విమానాలను ఎగురవేయనుంది. భారతీయ వైమానిక దళం నేరుగా కౌంతన్‌లోని ఆర్ఎంఎఎఫ్ స్థావరాన్ని చేరుకునేందుకు తన వైమానిక స్థావరాలలో ఒకదాని నుంచి బయలుదేరి వెళ్ళింది.
ఈ విన్యాసాలు భారతీయ వైమానిక దళ సభ్యులకు ఆర్ఎంఎఎఫ్‌లోని అత్యుత్తమ నిపుణులతో ఉత్తమ అభ్యాసాలను పంచుకునేందుకు, నేర్చుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. అదే సమయంలో పరస్పర పోరాట సామర్ధ్యాలను చర్చించేందుకు తావు ఇవ్వనుంది.
నాలుగు రోజులు జరుగనున్న ఈ విన్యాసాలలో ఇరు వైమానిక దళాల మధ్య పలు వైమానిక పోరాట కవాతులు జరుగనున్నాయి.
ఉదరశక్తి దీర్ఘకాలిక స్నేహ బంధాన్ని బలపరచడమే కాక రెండు వైమానిక దళాల మధ్య రక్షణ సహకార మార్గాలను మెరుగుపరచడం ద్వారా ఈ ప్రాంతంలో భద్రతను పెంచనుంది.
***
(Release ID: 1851497)
Visitor Counter : 266