ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

హ‌ర్ ఘ‌ర్ తిరంగా ప్ర‌చారం కోసం గువాహ‌తి ప‌ర్య‌ట‌న‌లో డిఒఎన్ఇఆర్ అధికారుల ప‌ర్య‌ట‌న‌.

Posted On: 12 AUG 2022 2:17PM by PIB Hyderabad

 హ‌ర్ ఘ‌ర్ తిరంగా ప్ర‌చారాన్ని ప్రోత్స‌హించేందుకు, ఈశాన్య ప్రాంత ప్రాజెక్టుల స్థితిగ‌తుల‌ను ఈశాన్య కౌన్సిల్‌, ఎన్ఇడిఎఫ్ఐ అధికారుల‌ను క‌లిసి స‌మీక్షించేందుకు  ఎండిఒఎన్ఇఆర్ సంయుక్త కార్య‌ద‌ర్శి, గ‌ణాంక స‌ల‌హాదారు శ్రీ ఎస్ సురేష్‌కుమార్ గువాహ‌తి/  షిల్లాంగ్‌ల‌లో రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా, హ‌ర్ ఘ‌ర్ తిరంగా ప్ర‌చారాన్ని ప్రోత్స‌హించేందుకు ఒక బైక్ ర్యాలీని ప్రారంభించారు. 
గువాహ‌తిలో ని ఎన్ఇడిఎఫ్ఐ కేంద్ర కార్యాల‌యంలో ఈశాన్య ప్రాజెక్టుల‌ను స‌మీక్షించేందుకు, ఎన్ఇడిఎఫ్ఐ సిఎండి & కీల‌క అధికారుల‌తో క‌లిసి శ్రీ సురేష్ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు. 
ఎన్ఇడిఎఫ్ఐ హౌజ్‌లో ఎన్ఇడిఎఫ్ఐ క్రాఫ్ట్స్ కార్నివాల్ స‌హా ప‌లు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌ను హ‌ర‌ఘ‌ర్ తిరంగా ప్ర‌చారాన్ని ప్రోత్స‌హించేందుకు చేప‌డుతున్నారు. ఈ కార్య‌క్ర‌మాలు 15 ఆగ‌స్టు 2022 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. శ్రీ మూర్తితో క‌లిసి శ్రీ సురేష్ కార్నివాల్‌ను సంద‌ర్శించారు.  చేతివృత్తి క‌ళాకారులు & వ్యాపార‌వేత్త‌ల దేశీయంగా చేసిన ఉత్ప‌త్తుల‌ను కార్నివాల్‌లో ప్ర‌ద‌ర్శిస్తున్నారు. పౌరుల కోసం ఉచిత కోవిడ్‌-19 వాక్సినేష‌న్ శిబిరాన్ని కూడా నిర్వ‌హిస్తున్నారు. 

***
 



(Release ID: 1851496) Visitor Counter : 95