మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని నిర్వహించిన భారత ప్రభుత్వం


గుజరాత్‌లోని జాతీయ ఉప్పు సత్యాగ్రహ స్మారకం వద్ద శ్రీ పర్షోత్తం రూపాలా జాతీయ జెండాను ఎగురవేశారు

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 400 ప్రముఖ ప్రాంతాల్లో కార్యక్రమాల నిర్వహణ

Posted On: 12 AUG 2022 2:41PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం 11 ఆగష్టు నుండి 15 ఆగస్ట్ 2022 వరకూ హర్‌ఘర్‌ తిరంగ కార్యక్రమాన్ని జరుపుతోంది. ఆజాదికా అమృత్ మహోత్సవ్ ఏడాదిలో భాగంగా గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం..దేశవ్యాప్తంగా 400 ప్రముఖ ప్రదేశాలలో ఈ కార్యక్రమాన్ని జరుపుతోంది.


image.png


భారత ప్రభుత్వ పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ, ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖలు నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డిడిబి), గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్) మరియు వల్సాద్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్‌ (దూద్‌సాగర్ డెయిరీ) 2022 ఆగస్టు 12న హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని గుజరాత్‌ నవ్‌సారిలోని దండి జాతీయ ఉప్పు సత్యాగ్రహ స్మారక చిహ్నం వద్ద కార్యక్రమాన్ని జరుపుకుంది.


image.png


కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా ముఖ్య అతిథిగా హాజరుకాగా పలువురు ప్రముఖుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుజరాత్‌లోని దండిలో గల జాతీయ ఉప్పు సత్యాగ్రహ స్మారక చిహ్నం వద్ద కేంద్ర మంత్రి జాతీయ జెండాను ఎగురవేసి, అమరవీరులు/స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను సత్కరించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేలా కేంద్ర మంత్రి ప్రజలను ప్రేరేపించారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి గుజరాత్ ప్రభుత్వం అన్ని పరిపాలనా మరియు లాజిస్టిక్ సహాయాన్ని ఉత్సాహంగా అందించింది.



image.png


***



(Release ID: 1851239) Visitor Counter : 203