రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాలలో సహకారం కోసం అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసిన ఎన్‌హెచ్ ఐడిసిఎల్, ఎన్ఎస్‌డిసిల
प्रविष्टि तिथि:
11 AUG 2022 3:26PM by PIB Hyderabad
ఎన్‌హెచ్ఐడిసిఎల్ (నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ఎండి, ఎన్ఎస్‌డిసి (నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) అఫీషియేటింగ్ సిఒఒలు 08.08.2022న అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ అగాహనా ఒప్పందం ఎన్‌హెచ్ఐడిసిఎల్, ఎన్ఎస్‌డిసిల మధ్య అధికారిక పరస్పర చర్యను అందించడమే కాక, ప్రధానమంత్రి నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమ లక్ష్యాలను సాధించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది.
భారత దేశాన్ని నైపుణ్యాల రాజధానిగా మార్చేందుకు అవసరమైన బహుళ చొరవలను చేపట్టడం, ఎన్‌హెచ్ఐడిసిఎల్, ఎన్ఎస్‌డిసిల మధ్య సహకారానికి ప్రాతిపదికను ఏర్పచడం ఈ అవగాహన ఒప్పంద ప్రధాన ఉద్దేశ్యం.
తమ తమ రంగాలలో ముందున్న అగ్రగామి జాతీయ సంస్థలు అయిన ఎన్‌హెచ్ ఐడిసిఎల్, ఎన్ఎస్‌డిసి, పరస్పర సహాయం చేసుకోవడం ద్వారా తమ అత్యుత్తమ సామర్ధ్యాలు, గరష్ట పరస్పర సహకారంతో జాతీయ లక్ష్యాలను సాధించేందుకు ఒక జట్టుగా కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాయి.
***
(रिलीज़ आईडी: 1851082)
आगंतुक पटल : 167