సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
అభివృద్ధి పథంలో నడుస్తున్న కాంగ్రా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకును అభినందించిన కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్
ఉద్యోగుల అంకిత భావంతో పనిచేయడంతో బ్యాంకు 3,000 కోట్ల రూపాయల మేరకు లావాదేవీలు స్థాయికి చేరుకుంది .. శ్రీ అనురాగ్ ఠాకూర్
సహకారం ద్వారా శ్రేయస్సు సాధించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర ఆకాంక్షిస్తున్నారు.. శ్రీ అనురాగ్ ఠాకూర్
Posted On:
11 AUG 2022 4:12PM by PIB Hyderabad
అద్భుత పనితీరుతో నష్ఠాల నుంచి బయటపడి లాభాల బాట పట్టిన కాంగ్రా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకును కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ అభినందించారు. గత నాలుగు సంవత్సారాలుగా 46 కోట్ల రూపాయల మేరకు నష్ఠాలను మూటగట్టుకున్న బ్యాంకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 87 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. ఆవిర్భావం తర్వాత బ్యాంకు ఇంత పెద్ద మొత్తంలో లాభం ఆర్జించడం ఇదే తొలిసారని మంత్రి అన్నారు.
'ఆజాదీ కా అమృత కాల్' స్ఫూర్తితో సహకార స్ఫూర్తిని విలీనం చేసి అభివృద్ధి సాధించాలన్న పట్టుదలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి అన్నారు. సహకార సంఘాలు మార్కెట్‌లో పోటీతతత్వంతో పని చేసి అభివృద్ధి సాధించేలా చూసేందుకు అవసరమైన చర్యలు అమలు చేస్తున్నామని అన్నారు. సహకార రంగం మార్కెట్ లో కీలకంగా మారాలన్న లక్ష్యంతో సహకార సంఘాల పై పన్నులు తగ్గించామని శ్రీ ఠాకూర్ వివరించారు. బ్యాంక్ సాధించిన విశేషమైన అభివృద్ధి “సహకరిత సే సమృద్ధి” (సహకారం ద్వారా శ్రేయస్సు) అనే నినాదాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుందని మంత్రి అన్నారు.
గత నాలుగు సంవత్సరాల కాలంలో బ్యాంకు సాధించిన అభివృద్ధి పట్ల శ్రీ ఠాకూర్ సంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాంక్ నిర్వహిస్తున్న వివిధ సామాజిక భద్రతా పథకాల కింద ఖాతాదారులు పెద్ద సంఖ్యలో చేరారని అన్నారు. బ్యాంకు అభివృద్ధి సాధించడానికి సహకరించిన 1,400 మంది ఉద్యోగులను ఆయన అభినందించారు. అంకిత భావంతో ఉద్యోగులు పనిచేయడంతో బ్యాంక్ లావాదేవీలు గత నాలుగు సంవత్సరాల కాలంలో 3000 కోట్ల రూపాయల మేరకు వృద్ధి నమోదు చేశాయని అన్నారు.
కాంగ్రా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ (KCCB) గురించి
కాంగ్రా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ కు 1920లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేయబడింది. అదే సంవత్సరం మార్చిలో బ్యాంక్ తన కార్యకలాపాలు ప్రారంభించింది. ధర్మశాలలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న బ్యాంక్ 26 శాఖలు కలిగి ఉంది. గత నాలుగు సంవత్సరాల కాలంలో వివిధ సూచీలలో బ్యాంక్ అద్భుతమైన వృద్ధిని సాధించింది. బ్యాంకు పెట్టుబడులు 2324 కోట్ల రూపాయలకు , రిజర్వ్ ఫండ్స్ 26 కోట్ల రూపాయలకు పెరిగాయి. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు 87.53 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించింది. 2018 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లాభం 4.55 కోట్ల రూపాయలుగా ఉంది.
***
(Release ID: 1851080)
Visitor Counter : 134