మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శ్రీ పర్షోత్తం రూపాలా వంటలకు సంబంధించిన కాఫీ టేబుల్ పుస్తకం ' ఫిష్ అండ్ సీఫుడ్ - ఎ కలెక్షన్ అఫ్ 75 గౌర్మెట్ రెసిపీస్'ను ఆవిష్కరించారు


Posted On: 10 AUG 2022 4:47PM by PIB Hyderabad

కేంద్ర ఫిషరీస్ పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ పర్షోత్తమ్ రూపాలా ఈరోజు ఇక్కడఫిష్ & సీఫుడ్ -ఏ కలెక్షన్ ఆఫ్ 75 గౌర్మెట్ రెసిపీస్అనే పేరుతో ఒక ప్రత్యేకమైన కాఫీ టేబుల్ బుక్‌ను ప్రారంభించారు. చేపలు సముద్ర ఆహారాల దేశీయ వినియోగాన్ని పెంపొందించే ప్రయత్నం లో, స్థానిక చేప జాతుల ప్రాచుర్యం కల్పించడంతోపాటు, ఫిషరీస్, పశుసంవర్ధక పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మత్స్య శాఖ ఈ చొరవతో ముందుకు వచ్చింది. ఈ పుస్తకాన్ని కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ ఎల్. మురుగన్, డాక్టర్ సంజీవ్ కుమార్ బల్యాన్ ల సమక్షంలో ఆవిష్కరించారు; కార్యదర్శి -శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్, జాయింట్ సెక్రటరీ(ఇన్లాండ్ ఫిషరీస్) -శ్రీ సాగర్ మెహ్రా; జాయింట్ సెక్రటరీ (మెరైన్ ఫిషరీస్)- శ్రీ జె బాలాజీ, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన శాఖ అధికారులు, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ PMC అధికారులు, ప్రత్యేక అతిథిగా ప్రముఖ చెఫ్ శ్రీ కునాల్ కపూర్ ఈ సందర్భంలో ఉన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రచారం కింద భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 అద్భుతమైన సంవత్సరాల వేడుకలో కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం ఒక భాగం. వంటల పుస్తకం దేశీయ నీటి వనరులలో లభించే వివిధ చేపల దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న వండే శైలులను సూచించే గొప్ప ప్రయత్నం. ఇది మనదేశ పాక వారసత్వ గరిమ.

కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో, శ్రీ రూపాల భారతీయ 'వంటలు', వివిధ సాంప్రదాయ చేపల వంటల సంస్కృతి సారాంశ సమ్మేళనాన్ని సంగ్రహించే ఆసక్తికర రీతిలో రూపొందించిన పుస్తకాన్ని సూచించినందుకు శాఖను అభినందించారు. సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, తన అభినందన ప్రసంగంలో పుస్తకంలోని తమిళనాడు వంటకాలు, నోరూరించే తీరప్రాంత చేపల వంటకాలను ప్రస్తావిస్తూ తనను టైమ్ ట్రావెల్ ద్వారా ఎలా వ్యామోహాన్ని కలిగించాయో పంచుకున్నారు. శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్ తన సొంత రాష్ట్రం ఒడిశా వారి దైనందిన ఆహారంలో భాగంగా చేపలను ఎలా ఆస్వాదిస్తారనే దాని గురించి కూడా మాట్లాడారు. చిన్న చేతివృత్తిగా ఉన్న చేపల రైతుల జీవనోపాధిని ఆదుకోవడానికి శాఖ వివిధ రకాల ప్రయత్నాలు చేస్తోందని కూడా ఆయన ప్రస్తావించారు. తన ప్రత్యేక భారతీయ వంటకాలకై ప్రసిద్ధి చెందిన ప్రముఖ చెఫ్ కునాల్ కపూర్ కూడా చేపల పేర్లతో పాటు వివిధ ప్రాంతాల నుండి స్థానిక వంటకాలు కలిగి ఉన్న పుస్తక భావనను ప్రశంసించారు. ఈ సంఘటన తన చిన్ననాటి జ్ఞాపకాలు తన తండ్రి తన కుటుంబానికి చేప పిల్లలను ఎలా తెచ్చేవారో, తరువాత దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రకాల చేపల రకాలు దాని వైవిధ్యమైన వంట పద్ధతిని ఎలా పరిచయం చేశారో పేర్కొన్నారు.

పురాతన కాలం నుండి భారతీయ ఆహారంలో చేపలు, సముద్ర ఉత్పత్తుల ఆహారం ముఖ్యమైన భాగం. సింధు లోయ నాగరికతలో చేపల వినియోగాన్ని ముఖ్యమైన ఆహార అంశంగా సూచించడానికి అనేక అవశేషాలు కనుగొనబడ్డాయి. చేపలు దాని పోషక విలువలను పరిగణనలోకి తీసుకుంటే భారతీయ ఆహార విధానాలలో అంతర్భాగంగా మారింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) అంచనాల ప్రకారం, 2030 నాటికి భారతదేశ చేపల ఉత్పత్తిలో దాదాపు మూడింట రెండు వంతులకి ఆక్వాకల్చర్ బాధ్యత వహిస్తుంది. ఇది ఉపాధికి మత్స్య ఉత్పాదన సంస్కృతి ముఖ్యమైనదని, అలాగే చేపలు ఆహారంగా కీలక వనరు అని సూచిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు పోషకాహార భద్రత కు ఇవే ఆలంబన.

మత్స్య రంగ ప్రాముఖ్యతను గుర్తించి, సమగ్ర, వ్యూహాత్మక కేంద్రీకృత జోక్యాలను తీసుకోవడానికి, భారత ప్రభుత్వం తన ప్రధాన పథకం ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY)ని మే 2020లో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా అత్యధిక పెట్టుబడితో రూ. . 20,050 కోట్లు తీసుకువచ్చింది. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో ఆర్ధిక సంవత్సరం 2020-21 నుంచి2024-25 వరకు ఐదు సంవత్సరాల వ్యవధిలో ఈ పథకం అమలు అవుతుంది. ఈ పథకం మత్స్యరంగ స్థిరమైన బాధ్యతాయుతమైన అభివృద్ధిని కొనసాగించడానికి, మత్స్యకారులు, చేపల పెంపకందారులు విలువ-గొలుసులోని అన్ని ఇతర భాగస్వాముల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి భరోసా ఇస్తుంది. పిఎమ్‌ఎంఎస్‌వై చేపల ఉత్పత్తి ఉత్పాదకత, నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం కలయిక, ఎంపిక, అనంతర మౌలిక సదుపాయాలు నిర్వహణలో ఉన్న క్లిష్టమైన అంతరాలను పరిష్కరించడానికి ఈ రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తుంది. ప్రైవేట్ రంగంలో మత్స్య వ్యాపార అభివృద్ధి, ఆవిష్కరణ,వ్యవస్థాపకత, సులభంగా వ్యాపారం చేయడం ఇతర అవసరమైన మద్దతును పెంపొందించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం మత్స్యశాఖ లక్ష్యం.

కాఫీ టేబుల్ బుక్ ద్వారా, మత్స్యశాఖ, దేశీయ చేపల వినియోగాన్ని పెంచడం ఆహారం, పోషకాహార భద్రత కోసం చేపల ప్రొటీన్‌లను ప్రోత్సహించడంతోపాటు, భారతీయ చేపల పాక వారసత్వం స్థానిక వంటకాల వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి కూడా ఉద్దేశించింది.

పిఎంఎంఎస్‌వై పథకం ద్వారా దేశీయ చేపల వినియోగాన్ని తలసరి 5 కిలోల నుండి 12 కిలోలకు పెంచడానికి తమ శాఖ వివిధ వ్యూహాత్మక కార్యక్రమాలు చేపడుతున్నదని జాయింట్ సెక్రటరీ (ఇన్‌ల్యాండ్ ఫిషరీస్) శ్రీ మెహ్రా పేర్కొన్నారు, ఎగుమతులను రెండింతలు రూ. 1 లక్ష కోట్లు ఉత్పాదకతను హెక్టారుకు 3 టన్నుల నుండి 5 టన్నులకు పెంచడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. వారు తన ప్రసంగంలో ప్రతి ఒక్కరినీ వారి ఆహారంలో చేపలను తప్పనిసరి చేసుకోమని ప్రేరేపించారు, ఎందుకంటే ఇది పుష్కలంగా లభించే ప్రోటీన్ మూలం. ఆవిష్కరించిన పుస్తకంలో ఉన్న వంటకాలను వండే క్రమంలో వంటలప్రయోగాలు చేయమని ప్రతి ఒక్కరినీ శ్రీ మెహ్రా ప్రోత్సహించారు.

 

****




(Release ID: 1850819) Visitor Counter : 147