ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రాజ్యసభ అధికారులను కలుసుకొని వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ నాయుడు


- "మీరు ఎల్లప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటారు" - రాజ్యస‌భ ఉద్యోగులతో ఉపరాష్ట్రప‌తి

- రాజ్యసభ అధికారుల‌తో తన‌ రోజులను ఉద్వేగభరితంగా గుర్తు చేసుకున్న శ్రీ వెంక‌య్య నాయుడు

- పార్లమెంట్ భ‌వ‌నంలో ఉద్యాన‌వ‌నాల వద్ద సీతా అశోక మొక్కను నాటిన ఉపరాష్ట్రప‌తి

Posted On: 10 AUG 2022 3:02PM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ శ్రీ ఎం. వెంకయ్య నాయుడు ఈరోజు పార్లమెంట్ హౌస్‌లో రాజ్యసభ సెక్రటేరియట్ అధికారులతో సమావేశమయ్యారు. గత ఐదేళ్లుగా వారు అందించిన ప్రేమ, మద్దతుకు ఆయ‌న ధన్యవాదాలు తెలిపారు. వారి అంకితభావాన్ని మరియు కర్తవ్య భావాన్ని అభినందిస్తూ శ్రీ నాయుడు వారి భవిష్యత్తుకు మంచి జరగాలని ఆకాంక్షించారు. "మీరు ఎల్లప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటారు" అని ఆయన రాజ్యసభ ఉద్యోగులతో అన్నారు. రాజ్యసభకు చెందిన  సీనియర్ అధికారులు శ్రీ నాయుడుతో తాము గ‌డిపిన‌ రోజులను గుర్తుచేసుకుని, సంవత్సరాలుగా ఆయన మార్గదర్శకత్వం మరియు నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపినప్పుడు సన్నివేశం చాలా ఉద్వేగభరితంగా మారింది. పదవీవిరమణ చేసిన ఛైర్మన్‌కు వారు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. దీనికి ముందు, ఉపరాష్ట్రపతి పార్లమెంట్ హౌస్ ఉద్యానవ‌రం వద్ద సీతా అశోక మొక్కను  నాటారు. మన సహజ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. భారతీయ సంప్రదాయంలో ఒక చెట్టును ఎందరో కొడుకులతో సమానంగా పరిగణిస్తారని, దేశవ్యాప్తంగా చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలని ఉప‌రాష్ట్రప‌తి పిలుపునిచ్చారు.
                                                                                     

 

*****


(Release ID: 1850574) Visitor Counter : 186