వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ప్ర‌పంచం ఇప్పుడు భార‌త్‌ను ఆర్థిక వృద్ధికి ఇంజ‌న్‌గా చూస్తోందిః శ్రీ పీయూష్ గోయెల్

Posted On: 09 AUG 2022 5:58PM by PIB Hyderabad

అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు భార‌త్‌తో వాణిజ్య ఒప్పందాల‌పై సంత‌కాలు చేసేందుకు ఆస‌క్తితో ఉన్నాయి;  2014 ముందు వారికి సందేహాలుండేవిః శ్రీ గోయెల్‌

 అధికారి  వేధింపుల‌కు వ్య‌తిరేకంగా గ‌ళం ఎత్తే వ్యాపారులు, వాణిజ్య‌వేత్త‌ల‌కు ప్ర‌భుత్వం పూర్తి మ‌ద్ద‌తుః శ్రీ గోయెల్‌

ప్ర‌జ‌లు, వ్యాపారాల అనువ‌ర్త‌న  భారాన్ని త‌గ్గించేందుకు వ్యాపారులు ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌ని చేయాలి, కానీ వారు నైతిక వాణిజ్య ప‌ద్ధ‌తుల‌ను ఖ‌చ్చితంగా పాటించాలిః శ్రీ గోయెల్ 

పేద‌లు కూడా వినియోగ‌దారుల‌య్యేందుకు తోడ్ప‌డుతున్న ప్ర‌ధాన‌మంత్రి మోడీ సంక్షేమ విధానాలుః శ్రీ గోయెల్‌

భార‌తదేశ ప్ర‌జానీకాన్ని పెద్ద ఆస్తిగా మార్చిన ప్ర‌ధాని మోడీ సంక్షేమ ప‌థ‌కాలుః శ్రీ గోయెల్‌

ప్ర‌ధాన మంత్రి మోడీ సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల ఉత్ప‌త్తి డిమాండ్ నుంచి వ్యాపారులు, ఎంఎస్ఎంఇలు ల‌బ్ధిపొందాలిః శ్రీ గోయెల్ 

న్యూఢిల్లీ, ఆగ‌స్టు 9 (పిఐబి)ః ప్ర‌పంచం ఇప్పుడు భార‌త్‌ను ఆర్థిక వృద్ధికి ఇంజ‌న్‌గా చూస్తోంద‌ని కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌లు, వినియోగ‌దారుల వ్య‌వ‌హారాలు, ఆహారం, ప్ర‌జా పంపిణీ, జౌళి శాఖ‌ల మంత్రి శ్రీ పీయూష్ గోయెల్ మంగ‌ళ‌వారం అన్నారు. ఆయ‌న మంగ‌ళ‌వారం న్యూఢిల్లీలో జ‌రిగిన వ్యాపారి ఉద్య‌మి స‌మ్మేళ‌నాన్ని ఆయ‌న ప్ర‌సంగించారు. 
నేడు భార‌త్ ప్ర‌పంచ విశ్వాసాన్ని పొందుతోంద‌ని అంటూ, అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు భార‌త్‌తో వాణిజ్య ఒప్పందాల‌పై సంత‌కాలు చేసేందుకు ఆస‌క్తితో ఉన్నాయ‌ని శ్రీ గోయెల్ అన్నారు. భార‌తీయ ఆర్థిక వ్య‌వస్థ‌ను 2014కు ముందు దుర్బ‌ల‌మైన‌దానిగా భావించేవార‌ని, భార‌త్‌తో వ్యాపారం చేయ‌డం ప‌ట్ల పెట్టుబ‌డిదారుల సందేహంతో ఉండేవార‌ని ఆయ‌న చెప్పారు. 
పార‌దర్శ‌క‌త‌,  వ్యాపారం చేయ‌డం సుల‌భ‌త‌రం చేయాల్సిన అవ‌స‌రాన్ని నొక్కి చెప్తూ, ఏ అధికారి త‌మ‌ను వేధిస్తుంటే గ‌ళం ఎత్తే వ్యాపారులు, వాణిజ్య‌వేత్త‌ల‌కు ప్ర‌భుత్వం పూర్తి మ‌ద్ద‌తును అందిస్తుంద‌ని మంత్రి వారికి హామీ ఇచ్చారు. 
ప్ర‌జ‌లు, వ్యాపారాల అనువ‌ర్త‌న  భారాన్ని త‌గ్గించేందుకు వ్యాపారులు ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌ని చేయాలంటూ, కానీ వారు నైతిక వాణిజ్య ప‌ద్ధ‌తుల‌ను ఖ‌చ్చితంగా పాటించాల‌ని కోరారు. వ్యాపారం చేయ‌డాన్ని సుల‌భ‌త‌రం చేయ‌డాన్ని మెరుగుప‌రిచేందుకు అన‌వ‌స‌ర‌మైన‌,  ప్ర‌తిబంధ‌క‌మైన‌, ప్ర‌తికూల ఉత్పాద‌క‌ చ‌ట్టాల‌ను, నిబంధ‌న‌ల‌ను నిర్మూలించాల‌ని ఆయ‌న అన్నారు.
భార‌త అందిస్తున్న నాణ్య‌త క‌లిగిన వ‌స్తువులు, సేవ‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఆయ‌న వ్యాపారుల‌ను కోరారు. భార‌త‌దేశ వృద్ధి క‌థ‌నానికి యువ‌శ‌క్తిని అందించేందుకు యువ‌త ముందుకు వ‌చ్చేందుకు యువ‌త‌ను ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రాన్ని ఆయ‌న నొక్కి చెప్పారు. ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీ ఇచ్చిన వోక‌ల్ ఫ‌ర్ లోక‌ల్ అన్న స్ప‌ష్ట‌మైన పిలుపును దేశ యువ‌త త‌ప్ప‌నిస‌రిగా చేప‌ట్టాల‌న్నారు. అంతేకాకుండా, మ‌రింతమంది మ‌హిళ‌లు వ్యాపారులు, వాణిజ్య‌వేత్త‌లు అయ్యేందుకు మ‌నం ప్రోత్సాహాన్నందించాల‌న్నారు. 
ప్ర‌ధాన‌మంత్రి దార్శ‌నిక సంక్షేమ విధానాల‌ను కొనియాడుతూ, ఈ విధానాలు నిరుపేద‌లు కూడా వినియోగ‌దారులుగా ఉద్భ‌వించేందుకు తోడ్ప‌డ‌డ‌మే కాక భార‌త‌దేశ ప్ర‌జానీకాన్ని త‌న అతిపెద్ద బ‌లంగా విజ‌య‌వంతంగా ప‌రివ‌ర్త‌న చేశార‌ని వివ‌రించారు. ప్ర‌ధాన‌మంత్రి అవిశ్రాంత కృషి వంట గ్యాసు, మంచి నీరు, విద్యుత్‌, మ‌రుగుదొడ్లు దేశంలోని ప్ర‌తి ఆవాసానికీ అందుబాటులోకి  వ‌చ్చేలా చేసింద‌ని, అంతేకాకుండా ప్ర‌తి గ్రామంలో ఇంట‌ర్నెట్ అందుబాటులోకి వ‌చ్చింద‌న్నారు. ప్ర‌భుత్వ విధానాలు ప్ర‌తి భార‌తీయుడికీ వ్యాపార‌వేత్త కావాల‌ని ఆకాంక్షించే సాహ‌సాన్ని, ఆశ‌యాన్ని, విశ్వాసాన్ని ఇచ్చాయ‌ని శ్రీ గోయెల్ పేర్కొన్నారు. 
సూక్ష్మ‌, చిన్న, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు (ఎంఎస్ఎంఇలు) ప్ర‌ధాన‌మంత్రి సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల నుంచి ఉత్ప‌త్తుల కోసం వ‌చ్చే డిమాండ్‌తో ల‌బ్ధిపొందాల‌ని మంత్రి నొక్కి చెప్పారు. మ‌రింత‌గా భార‌తీయ ఉత్ప‌త్తుల‌ను ప్రోత్స‌హించ‌డం ద్వారా స్వావ‌లంబ‌న క‌లిగిన భార‌త్ క‌ల‌ను ముందుకు తీసుకువెళ్ళ‌డానికి క‌లిసి చేయ‌డానికి ముందుకు రావ‌ల‌సిందిగా ఆయ‌న‌ పెద్ద‌, చిన్న స‌హా అంద‌రు వ్యాపారులు, వాణిజ్య‌వేత్త‌లు, వ్యాపారాలు  కోరారు. 

 

***



(Release ID: 1850424) Visitor Counter : 130