యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

44వ చదరంగం ఒలింపియాడ్‌, ఓపెన్ సెక్షన్‌, తొమ్మిదో రౌండ్ పోటీలో బ్రెజిల్‌ ను ఓడించే విధంగా భారత్-'ఏ' జట్టు తిరిగి పుంజుకోడానికి సహాయపడిన - శశికిరణ్, ఎరిగైసి

Posted On: 08 AUG 2022 2:26PM by PIB Hyderabad

తమిళనాడులోని మామల్లపురంలో జరుగుతున్న 44వ చదరంగం ఒలింపియాడ్‌, ఓపెన్ సెక్షన్‌, తొమ్మిదో రౌండ్ పోటీలో, కృష్ణన్ శశికిరణ్, అర్జున్ ఎరిగైసి ఆదివారం విజయం సాధించడంతో, బ్రెజిల్‌ ను 3-1 తేడాతో ఓడించడానికి, భారత్-'ఏ' జట్టు తన విజయావకాశాలను మెరుగుపరుచుకుంది.  

 

తమిళనాడులోని మామల్లపురంలో ఆదివారం జరిగిన 44 చదరంగం ఒలింపియాడ్ తొమ్మిదో రౌండ్ పోటీలో భారత్ ఓపెన్-'జట్టు కు చెందిన కృష్ణన్ శశికిరణ్ (ఫోటో సౌజన్యం : ఎఫ్..డి.) 

 

శనివారం అర్మేనియా తో జరిగిన పోటీలో ఓడిన తర్వాత,  నిమ్జో ఇండియన్ పోటీలో ఆండ్రీ డైమంట్‌ తో జరిగిన మొదటి పాయింట్‌ లో శశికిరణ్ ర్యాక్ చేయడంతో భారత్-'ఏ' జట్టు విజయవంతమైన నోట్‌ తో ఆటను ప్రారంభించింది.  42వ మరియు 43వ ఎత్తులో బిషప్‌ లు చేసిన వరుస తప్పుడు కదలికలు 49వ ఎత్తులో విజయంగా మార్చుకోవడాని కి సాయికిరణ్‌ కు సహకరించాయి. 

 

తమిళనాడులోని మామల్లపురంలో జరిగిన 44 చదరంగం ఒలింపియాడ్ ఆరో రౌండ్ పోటీలో భారత్ ఓపెన్ -'జట్టు కు చెందిన జి.ఎం. పెంటల హరికృష్ణ (ఫోటో సౌజన్యం : ఎఫ్..డి.)

 

మరోవైపు సెవాగ్ క్రికోర్ మెఖిటేరియన్‌పై ఎరిగైసి ఇంగ్లీష్ బాట పట్టాడు.  25వ ఎత్తులో ప్రత్యర్థి ఆలస్యమైన తర్వాత, ఎరిగైసి ఒక మార్పిడిని గెలుచుకున్నాడు మరియు విజయం సాధించడానికి 63 ఎత్తులు అవసరం.  మిగతా ఇద్దరు ఆటగాళ్లు పెంటల హరికృష్ణ, విదిత్ గుజరాతీ తమ తమ పోటీలలో 'డ్రా' గా నిలిచారు.

 

శశికిరణ్ ఆదివారం నాడు ఆర్మేనియాపై పరాజయం అనంతరం వ్యాఖానిస్తూ,  కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతుంటాయిఅయితే ఒక జట్టుగామేము ఎల్లప్పుడూ సుదీర్ఘ ప్రయాణంలో భాగంగాఇలాంటి ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నిస్తాము.  బృందం కలిసికట్టుగా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నానుమేము ఎల్లప్పుడూ కలిసి తింటాము , అదే విధంగా చాలా విషయాలు కలిసి చర్చించుకుంటాము." అని పేర్కొన్నారు. 

 

తమిళనాడులోని మామల్లపురంలో ఆదివారం జరిగిన 44 చదరంగం ఒలింపియాడ్ తొమ్మిదో రౌండ్ పోటీ లో  భారత్-ఓపెన్-'బిజట్టుకు చెందిన గుకేష్ డి. (ఫోటో సౌజన్యం : ఎఫ్..డి.) 

 

తమిళనాడులోని మామల్లపురంలో ఆదివారం జరిగిన 44 చదరంగం ఒలింపియాడ్  తొమ్మిదో  రౌండ్‌ పోటీ లో భారత ఓపెన్ జట్టు-'బిసభ్యుడు ప్రజ్ఞానానంద ఆర్. (ఫోటో  సౌజన్యం : ఎఫ్..డి.)

 

పరాగ్వే ను 3-1 తేడాతో చిత్తు చేసిన భారత్-'సి' జట్టు కూడా విజేతగా నిలిచింది.  ఇలా ఉండగా, వాసిఫ్ దురార్‌బైలీ ని ఆర్.ప్రజ్ఞానంద ఓడించగా, భారత్-'బి' జట్టు, ఆరో సీడ్ అజర్‌ బైజాన్‌ ను 2-2 తో డ్రా గా కట్టడి చేసింది.   షఖ్రియార్ మమెద్యరోవ్‌ తో హోరా హోరీగా జరిగిన పోటీలో, తన మొదటి 'డ్రా' ను అంగీకరించడంతో, డి.గుకేష్ విజయ పోరాటం ముగిసింది.  నిహాల్ సరిన్‌ ను కూడా రౌఫ్ మమెదోవ్ 'డ్రా' గా ముగించగా, నిజత్ అబాసోవ్‌ పై రౌనక్ సాధ్వని పరాజయంపాలయ్యాడు. 

 

మరో ఓపెన్ సెక్షన్ పోటీలో, గ్రీస్‌పై 2.5-1.5 తేడాతో విజయం నమోదు చేయడం ద్వారా అమెరికా శనివారం భారత్‌ పై ఓటమిని చవిచూసింది.  ప్రస్తుతం ఓపెన్ విభాగంలో ఉజ్బెకిస్థాన్ 16 పాయింట్లతో అగ్రగామిగా ఉండగా, ఇండియా-'బి' జట్టు, ఆర్మేనియా జట్టు, 15 పాయింట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

 

మహిళల విభాగంలో భారత్-'బి'; భారత్-'సి' జట్లు  వరుసగా 4-0 మరియు 3-1 తో స్విట్జర్లాండ్ మరియు ఎస్టోనియా పై విజయం సాధించాయి.  కాగా, నాలుగో సీడ్ పోలాండ్‌ తో జరిగిన పోటీలో, 1.5-2.5 తేడాతో, భారత్-'ఏ' జట్టు పరాజయం పాలయ్యంది.

 

కీలకమైన ఒక పోటీలో,  రెండో సీడ్ ఉక్రెయిన్‌ ను జార్జియా 2-2 తో 'డ్రా' గా ముగించింది, తద్వారా, మహిళల విభాగంలో భారత్-'ఏ' అగ్రస్థానంలో కొనసాగుతోంది.  అయితే, ఇప్పుడు జార్జియా, పోలాండ్, కజఖిస్తాన్ దేశాలు ఒక్కొక్కటి 15 పాయింట్లు సాధించాయి.  కాగా, కజకిస్థాన్ 3-1 తో బల్గేరియా పై విజయం సాధించింది.

 

*****


(Release ID: 1850221) Visitor Counter : 148