ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

205.92 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.94 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,34,793

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 19,406

ప్రస్తుత రికవరీ రేటు 98.50%

వారపు పాజిటివిటీ రేటు 4.63%

Posted On: 06 AUG 2022 9:48AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 205.92 కోట్ల ( 2,05,92,20,794 ) డోసులను అధిగమించింది. 2,73,35,261 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.94 కోట్లకు పైగా ( 3,94,13,983 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10412407

రెండో డోసు

10093238

ముందు జాగ్రత్త డోసు

6428470

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18431631

రెండో డోసు

17676520

ముందు జాగ్రత్త డోసు

12480171

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

39413983

రెండో డోసు

28570987

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61329558

రెండో డోసు

51402118

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

559737698

రెండో డోసు

509721439

ముందు జాగ్రత్త డోసు

30692983

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203726437

రెండో డోసు

195488035

ముందు జాగ్రత్త డోసు

19743829

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127466783

రెండో డోసు

122170487

ముందు జాగ్రత్త డోసు

34234020

ముందు జాగ్రత్త డోసులు

10,35,79,473

మొత్తం డోసులు

2,05,92,20,794

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,34,793. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.31 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.50 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 19,928 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,34,65,552 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 19,406 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,91,187 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 87.75 కోట్లకు పైగా ( 87,75,51,833 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 4.63 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 4.96 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1848997) Visitor Counter : 119