ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫిలీపీన్స్ అధ్యక్షుడుశ్రీ ఫర్డీనాండ్ మార్కోస్ జూనియర్ కు మరియు ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ కి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ

Posted On: 05 AUG 2022 2:59PM by PIB Hyderabad

ఫిలీపీన్స్ అధ్యక్షుడు శ్రీ ఫర్డీనాండ్ మార్కోస్ జూనియర్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.

ఫిలీపీన్స్ కు 17వ అధ్యక్షుని గా శ్రీ ఫర్డీనాండ్ మార్కోస్ జూనియర్ ఎన్నికైనందుకు కు ప్రధాన మంత్రి ఆయన కు అభినందనలను తెలియజేశారు.

నేత లు ఇద్దరూ ద్వైపాక్షిక సంబంధం కొనసాగుతున్న వివిధ రంగాల ను సమీక్షించారు. ఇటీవల కొన్నేళ్లు గా ఉభయ దేశాల మధ్య సహకారం శీఘ్ర గతి న వృద్ధి చెందడం పట్ల వారు వారి సంతృప్తి ని వ్యక్తం చేశారు.

భారతదేశం యొక్క యాక్ట్ ఈస్ట్ పాలిసీ లో మరియు ఇండో-పసిఫిక్ విజన్ లో ఫిలిప్పీన్స్ ప్రముఖ పాత్ర ను పోషిస్తోందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటిస్తూ, ద్వైపాక్షిక సంబంధాల ను మరింత గా విస్తరింప చేసుకోవాలన్న అభిలాష ను వ్యక్తం చేశారు.

ఫిలీపీన్స్ అభివృద్ధి కోసం అధ్యక్షుడు శ్రీ ఫర్డీనాండ్ మార్కోస్ జూనియర్ కు ఉన్న ప్రణాళికల కు మరియు ప్రాజెక్టుల కు భారతదేశం వైపు నుంచి పూర్తి స్థాయి సమర్థన ఉంటుందని కూడా ప్రధాన మంత్రి ఆయన కు హామీ ని ఇచ్చారు.

***


(Release ID: 1848850)