యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
సి డబ్లూ జి 2022 గేమ్స్ (CWG 2022) లో భారత్ 6వ రోజు ఒక రజత, నాలుగు కాంస్య పతకాలను గెలుచుకుంది
Posted On:
04 AUG 2022 11:53AM by PIB Hyderabad
ముఖ్యాంశాలు:
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ సి డబ్లూ జి లో లవ్‌ప్రీత్ కనపరిచిన అసాధారణ ప్రతిభకు అభినందనలు తెలిపారు.
తేజస్వనీ శంకర్ చరిత్ర సృష్టించినందుకు అభినందనలు. సి డబ్లూ జి గేమ్స్ (CWG) లో మీ మొదటి పతకాన్ని గెలుచుకున్నందుకు శుభాభినందనలు, ఈ కాంస్యం స్వర్ణం కంటే చాలా ప్రత్యేకమైనది: శ్రీ అనురాగ్ ఠాకూర్
కామన్వెల్త్ గేమ్స్ 2022 6వ రోజున భారత్ ఒక రజతం నాలుగు కాంస్య పతకాలను గెలుచుకుంది. లవ్‌ప్రీత్ సింగ్ కాంస్య పతకం తర్వాత, జూడోకా తూలికా మాన్ 78+ కేజీల కేటగిరీ లో రజతం, వెయిట్‌లిఫ్టర్ గుర్దీప్ సింగ్ పురుషుల +109 కేజీల కేటగిరీలో కాంస్య పతకాన్ని సాధించారు, సౌరవ్ ఘోషల్ కాంస్యాలు సాధించారు. తేజస్విన్ శంకర్ హైజంప్‌లో భారత్‌కు తొలిసారిగా కాంస్యం సాధించి అథ్లెటిక్స్ లో చరిత్ర సృష్టించాడు. 5 స్వర్ణాలు, 6 రజతాలు, 7 కాంస్య పతకాలతో భారత్ పతకాల సంఖ్య 18కి చేరుకుంది. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ, కేంద్ర క్రీడా మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ మరియు దేశం నలుమూలల నుండి వచ్చిన భారతీయులు పతక విజేతలను వారి విజయాలకు అభినందించారు.
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తేజస్విన్ శంకర్‌ను అభినందించారు. కాంస్య పతకాన్ని గెలుచుకోవడంలో తేజస్విన్ శంకర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. #కామన్వెల్త్ గేమ్స్‌లో హైజంప్‌లో పతకం గెలిచిన మొదటి భారతీయుడు గా నిలిచినందుకు అభినందనలు. దేశానికి కీర్తిని సంపాదించి మీరు ఆదర్శప్రాయమైన సంకల్పాన్ని ప్రదర్శించారు. విజేతలందరికీ నా శుభాకాంక్షలు, మీరంతా మరెన్నో స్ఫూర్తిదాయకమైన విజయాలు సాధించాలని నా శుభకామనలు” అని అన్నారు.
తులికా కనబరచిన ప్రతిభా ప్రదర్శనను ప్రశంసిస్తూ ట్వీట్ చేస్తూ, “#కామన్వెల్త్ గేమ్స్‌లో జూడోలో ఉత్సాహభరితమైన పోరాటం చేసి రజత పతకాన్ని గెలుచుకున్నందుకు తులిక మాన్‌కు అభినందనలు. మీరు చిన్న వయస్సులో విజయం సాధించడానికి అద్భుతమైన ధైర్యం అంకిత భావావేశము ప్రదర్శించారు. మీరు శక్తి నుండి సామర్థ్యం వైపుకు పయనించండి భవిష్యత్ పోటీలలో మరిన్ని విజయాలు సాధించండి. ”
రాష్ట్రపతి ఒక ట్వీట్‌లో, “అద్భుతమైన ప్రయత్నం తపన #కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నందుకు గురుదీప్ సింగ్‌కు అభినందనలు. మీరు మీ పోడియం ఫినిషింగ్, మీ ఉత్సాహవంతమైన లిఫ్టింగ్‌తో భారతదేశం గర్వపడేలా చేసారు. రాబోయే కాలంలో మీరు మరిన్ని విజయాల శిఖరాలను అధరోహించటం కొనసాగించండి. ”
కాంస్యం సాధించిన సౌరవ్‌ను రాష్ట్రపతి అభినందించారు. రాష్ట్రపతి ట్వీట్ చేస్తూ, “#కామన్వెల్త్ గేమ్స్‌లో స్క్వాష్ పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న సౌరవ్ ఘోషల్‌కు అభినందనలు. పురుషుల సింగిల్స్ స్క్వాష్‌లో భారత్‌కు తొలి పతకాన్ని సాధించిపెట్టి కొత్త పుంతలు తొక్కినందుకు భారతదేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది.
సి డబ్ల్యు జి CWG 2022లో పతకాలు సాధించినందుకు స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోసల్, జూడో ప్లేయర్ తులికా మాన్, వెయిట్ లిఫ్టర్ గుర్దీప్ సింగ్ తేజస్విన్ శంకర్‌లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అభినందించారు. భారతదేశానికి మొదటి హైజంప్ పతకాన్ని సాధంచినందుకు తేజస్విన్ శంకర్‌ను ప్రధాని అభినందించారు. హైజంప్‌లో తేజస్విన్ శంకర్ కాంస్యం కూడా కామన్వెల్త్ గేమ్స్, 2022లో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారతదేశానికి మొదటిది. ప్రధాన మంత్రి ట్వీట్ లో; “తేజస్విన్ శంకర్ చరిత్ర సృష్టించాడు. సి డబ్ల్యూ జి CWGలో మొదటి హైజంప్ పతకాన్ని గెలుచుకున్నాడు. కాంస్య పతకం సాధించినందుకు అతనికి అభినందనలు. అతని ప్రతిభ కు ప్రదర్శనకు గర్విస్తున్నాను. అతని భవిష్యత్ ప్రతిభాపాటవాలకు శుభాకాంక్షలు. అతను సదా విజయాన్ని పొందుతూనే ఉండనివ్వండి. ” గురుదీప్ సింగ్‌ను అభినందిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు; "కఠోర శ్రమ అంకితభావం దీక్ష అత్యుత్తమ ఫలితాలకు దారితీస్తాయి... సి డబ్ల్యూ జి CWGలో వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకోవడం ద్వారా గుర్దీప్ సింగ్ చూపించినది ఇదే. అతను మన దేశ క్రీడాభిమానులలో ఆనంద స్ఫూర్తిని పెంచాడు. అతనికి అభినందనలు మరియు శుభాకాంక్షలు."
మరొక ట్వీట్‌లో ప్రధాని జూడో ప్లేయర్ తులిక మాన్‌ను అభినందిస్తూ, "తులికా మాన్ బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో తారలా మెరిసింది! జూడోలో రజత పతకాన్ని గెలుచుకున్నందుకు ఆమెకు అభినందనలు. ఈ పతకం ఆమె విశిష్ట క్రీడా జీవితంలో మరో ఘనత. రాబోయే కాలంలో ఆమె విజయాలకు నా శుభాకాంక్షలు.
సౌరవ్ ఘోషల్‌ను అభినందిస్తూ ప్రధాని ట్వీట్ చేసారు; "@సౌరవ్ ఘోషల్ విజయం ఉన్నత శిఖరాలను అధరోహించడం లాంటిది, నాకు చాలా ఆనందంగా ఉంది. బర్మింగ్‌హామ్‌లో అతను సాధించిన కాంస్య పతకం చాలా ప్రత్యేకమైనది. అతనికి అభినందనలు. అతని విజయాలు దేశ యువతలో స్క్వాష్ కు ప్రజాదరణను పెంచడంలో సహాయపడతాయి."
శ్రీ అనురాగ్ ఠాకూర్ కూడా తేజస్వనికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు, “భారతదేశం తరపున సి డబ్ల్యూ జి CWGలో హైజంప్‌లో పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణి గా చరిత్ర సృష్టించినందుకు మరియు సి డబ్ల్యూ జి CWGలో మీ మొదటి పతకాన్ని గెలుచుకున్నందుకు తేజస్వని శంకర్‌కి అభినందనలు. ఈ కాంస్యం స్వర్ణం కంటే చాలా ప్రత్యేకమైనది!!”
గురుదీప్ ని క్రీడా మంత్రి అభినందిస్తూ, సి డబ్ల్యూ జి “#CWG2022లో వెయిట్ లిఫ్టింగ్‌లో 10వ పతకాన్ని ఇంటికి తెచ్చినందుకు గుర్దీప్‌కి అభినందనలు. మొత్తం మన క్రీడా బృందం అంతా అద్భుతంగా రాణించింది. ఎన్ ఎస్ ఎన్ ఐ ఎస్ (NSNIS ) పాటియాలా నుండి మరొక పతక విజేత, దశాబ్దాలుగా ఉత్తమ క్రీడా ప్రతిభను అందించడం లో ఎన్ ఎస్ ఎన్ ఐ ఎస్ విజేతగా నిలుస్తుంది. ఈ ఎడిషన్ సి డబ్ల్యూ జి CWG లో భారతదేశానికి 10 పతకాలను అందించింది.
మరో ట్వీట్‌లో శ్రీ ఠాకూర్, సి డబ్ల్యూ జి #CWG2022లో కాంస్యం గెలిచినందుకు సౌరవ్ ఘోషల్‌కు అభినందనలు. మీ పతకం చాలా మంది యువకులను స్క్వాష్‌లో పాల్గొనేలా స్ఫూర్తినిస్తుంది. ఈ విజయ సందర్భం మేము మరింత మంది విజేతలను సృష్టించగల ఈ ఆట అభివద్ధి కోసం అవసరమైన సరైన మరిన్ని మౌలిక సదుపాయాలను అందించడానికి క్రీడా విభాగం ఎల్లప్పుడూ అంకిత భావంతో కట్టుబడి ఉంది.
***
(Release ID: 1848418)