ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హర్యానా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని అరోగ్య సేవ‌ల‌ను అందిస్తున్న గ్రూపు సంస్థ‌లపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు

Posted On: 03 AUG 2022 2:42PM by PIB Hyderabad

ఆసుపత్రులను నడుపుతూ వివిధ ఆరోగ్య సంరక్షణ సేవల్లో నిమగ్నమై ఉన్న అనేక గ్రూపుల‌పై  ఆదాయపు పన్ను శాఖకు చిందిన అధికారులు  27.07.2022న  శోధన మరియు జప్తు కార్యకలాపాల్ని నిర్వహించారు. ఢిల్లీ -ఎ న్‌సీఆర్‌లో మొత్తం 44 ప్రాంగణాల‌లో శోధన మరియు జప్తు కార్యకలాపాల‌ను నిర్వహించారు. శోధన మరియు జప్తు సమయంలో భారీ నేరారోపణల‌కు సంబంధించిన‌ భౌతిక మరియు డిజిటల్ ఆధారాల‌ను స్వాధీనం చేసుకున్నారు. రోగుల నుండి నగదు రూపంలో స్వీకర‌ణ‌ రసీదులకు సంబంధించిన ఖాతాల‌ క్రమబద్ధీక‌ర‌ణ విష‌యంలో  ఈ గ్రూపు సంస్థ‌లు న‌గ‌దును త‌క్కువ చేసి చూపారు. సోదాలు నిర్వ‌హించిన గ్రూపుల‌లో ఒక గ్రూపు సంస్థ ఖాతా పుస్తకాల సమాంతర సెట్‌ను నిర్వహిస్తున్నట్లుగా సాక్ష్యాధారాల విశ్లేషణ వెల్ల‌డైంది. ఈ సమూహం అనుసరించిన విధానంలో ఇన్‌వాయిస్‌లను తీసి వేయడం , ఇన్‌వాయిస్ మొత్తాన్ని "డిస్కౌంట్లు/రాయితీలు" మొదలైనవిగా చూపిన‌ట్టుగా గుర్తించడం ద్వారా రోగులను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసే సమయంలో వాటిని తొలగించడం వంటి కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డి ఉన్న‌ట్టుగా గుర్తించ‌డ‌మైంది.  దీని ద్వారా ఆదాయాన్ని ఎగవేత చేసిన‌ట్టుగా తేలింది. ఈ విధానం సమూహంలోని అన్ని ర‌కాల‌ ఆసుపత్రులలో అనుసరించబడిన‌ట్టుగాను ప‌లు సంవత్సరాలుగా ఇలాంటి కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డిన‌ట్టుగా తేలింది. ఈ సోదాల‌
కార్య‌క్ర‌మాల‌లో జ‌రిపిన  ఇత‌ర హెల్త్‌కేర్ గ్రూపులు ఫార్మాస్యూటికల్ మందులు మరియు/లేదా స్టెంట్‌ల వంటి వైద్య పరికరాల కోసం బోగస్ లేదా పెంచిన ఇన్‌వాయిస్‌లను పొందడం వంటి అక్ర‌మ కార్య‌క్ర‌మాల‌లో నిమగ్నమై ఉన్నట్లు కనుగొనబడింది, దీని  ద్వారా వాస్తవ లాభాల్ని అణిచివేయ‌డం మాత్రమే కాకుండా రోగుల నుండి అధిక ఛార్జీని కూడా వసూలు చేశార‌ని తేలింది. ఈ బూటకపు/ అధికంగా చూపిన ఇన్‌వాయిస్‌ల కోసం బ్యాంకింగ్ మార్గాల ద్వారా చేసిన చెల్లింపులకు బదులుగా గ్రూపులు తిరిగి నగదును స్వీకరిస్తున్నాయనే వాస్తవాన్ని దర్యాప్తులో కనుగొనబడింది. ఇది డబ్బు జాడ మరింత ధృవీకరిస్తోంది. ఈ గ్రూపులకు చెందిన ఆసుపత్రుల్లో ఒకటి, నిర్దిష్ట వ్యాపారంగా అర్హత పొందేందుకు అవసరమైన షరతులను నెరవేర్చకుండానే సంవత్సరాల తరబడి తప్పుడు మినహాయింపును క్లెయిమ్ చేస్తున్నట్లు కనుగొనబడింది. స్వాధీనం చేసుకున్న సాక్ష్యాలు ఖాతా పుస్తకాలలో వీటిని సక్రమంగా నమోదు చేయకుండా వైద్యులు, క్లినిక్‌లకు రెఫరల్ చెల్లింపు పద్ధతిని కూడా బహిర్గతం చేసింది. రోగుల నుంచి సేకరించిన ఇన్‌వాయిస్‌ల శాతంలో రెఫరల్ చెల్లింపు నిర్ణయించబడింది. సోదాల్లో బినామీ లావాదేవీలకు సంబంధించిన ప‌లు ఇతర ఆధారాలు కూడా బయటపడ్డాయి. ఈ సోదాల‌లో ఇప్పటివరకు రూ.3.50 కోట్లకు పైగా నగదు, రూ.10 కోటి విలువ చేసే నగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యకలాపాలలోఅన్ని గ్రూపుల యొక్క లెక్కలోకి రాని ఆదాయం రూ. 150 కోట్ల కంటే ఎక్కువ‌గా గుర్తించబడింది.  వీరికి సంబంధించిన మొత్తం 30కి పైగా బ్యాంకు లాకర్లను అదుపులోకి తీసుకున్నారు. త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగుతోంది.
                                                                           

****(Release ID: 1848128) Visitor Counter : 17


Read this release in: English , Urdu , Hindi , Punjabi