రైల్వే మంత్రిత్వ శాఖ

జూలై'22లో భారతీయ రైల్వేలు జులై నెలవారీ సరకు లోడింగ్‌లో అత్యధిక రికార్డు 122.14 ఎంటీలు నమోదు చేసింది


జూలై నెలలో పెరిగిన లోడింగ్ 9.3 ఎంటీ. ఇది 2021లో సాధించిన మునుపటి ఉత్తమ జూలై గణాంకాల కంటే 8.25% వృద్ధి


దీనితో భారతీయ రైల్వేలు వరుసగా 23 నెలలపాటు అత్యుత్తమ నెలవారీ సరుకు రవాణాను నమోదు చేశాయి

Posted On: 03 AUG 2022 10:42AM by PIB Hyderabad

భారతీయ రైల్వే (ఐఆర్) జులై'22లో 122.14 ఎంటీల అత్యధిక జూలై నెలవారీ సరుకు లోడింగ్‌ను నమోదు చేసింది. జూలై నెలలో పెరిగిన లోడింగ్ 9.3 ఎంటీ. అంటే 2021లో సాధించిన మునుపటి ఉత్తమ జూలై గణాంకాల కంటే ఇది 8.25% వృద్ధి. దీనితో భారతీయ రైల్వేలు 23 వరుస నెలలలో అత్యుత్తమ నెలవారీ సరుకు రవాణాను నమోదు చేశాయి.

 

బొగ్గు రవాణాలో ఐఆర్‌ 11.54 ఎంటీ పెరుగుదలను సాధించింది. ఆ తర్వాత ఇతర వస్తువులలో 1.22 ఎంటీసిమెంట్ క్లింకర్ మరియు కంటైనర్లలో ఒక్కొక్కటి 0.56 ఎంటీ మరియు పిఓఎల్‌లో 0.47 ఎంటీలుగా ఉంది.

 

ఆటోమొబైల్ లోడింగ్ పెరుగుదల  ఎఫ్‌వై 2022- 23లో ఫ్రైట్ వ్యాపారంలో మరో ముఖ్యాంశం.  2022-23 ఎఫ్‌వైలో జూలై వరకు 1698 రేక్‌లు లోడ్ చేయబడ్డాయిగత సంవత్సరం ఇదే కాలంలో 994 రేక్‌లు అంటే 71% వృద్ధి నమోదయింది.

 

1 ఏప్రిల్'2022 నుండి జూలై 31'2022 వరకు 501.53 ఎంటీ ఉందిఇది 2021-22లో సాధించిన 452.13 ఎంటీ కంటే 49.40 ఎంటీ పెరుగుదల. గత సంవత్సరం ఇదే కాలంలో 10.92% వృద్ధి నమోదయింది.

 

 

సరుకు రవాణా ఎన్‌టీకేఎంలు (నికర టన్ను కిలోమీటర్లు) జూలై '21లో 63.3 బిలియన్ల నుండి జూలై'22 నాటికి 75 బిలియన్లకు పెరిగి 18.38% వృద్ధిని నమోదు చేసింది. మొదటి నాలుగు నెలల్లో సంచిత ఎన్‌టీకేఎంలు కూడా 19.46% పెరిగాయి.

 

 

విద్యుత్ మరియు బొగ్గు మంత్రిత్వ శాఖతో సన్నిహిత సమన్వయంతో పవర్ హౌస్‌లకు బొగ్గు సరఫరాను పెంచడానికి భారతీయ రైల్వేలు చేసిన నిరంతర ప్రయత్నాలు జూలై నెలలో సరుకు రవాణా పనితీరు యొక్క ముఖ్య లక్షణాలలో ఒకటి. గత సంవత్సరం 34.74 ఎంటీ నుండి 47.98 ఎంటీ బొగ్గును పవర్ హౌస్‌లకు తరలించడం ద్వారా పవర్ హౌస్‌లకు (దేశీయ మరియు దిగుమతి చేసుకున్న రెండూ) బొగ్గు లోడ్ జూలైలో 13.2 ఎంటీ పెరిగిందిఅంటే 38% వృద్ధి. సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 47.95 ఎంటీ అదనపు బొగ్గును పవర్ హౌస్‌లకు ఐఆర్‌ లోడ్ చేసింది. అంటే 32% కంటే ఎక్కువ వృద్ధిని సాధించింది.

 

కమోడిటీ వారీగా వృద్ధి సంఖ్య ఈ క్రింది వృద్ధి రేటుతో దాదాపు అన్ని కమోడిటీ విభాగాలలో ఐఆర్ అద్భుతమైన వృద్ధిని సాధించినట్టు తెలుస్తోంది:

 

సరుకు

వేరియంట్

(ఎంటీ)

 శాతం

బొగ్గు

11.54

23.45

సిమెంట్ మరియు క్లింకర్

0.56

5.10

పిఓఎల్

0.47

12.90

కంటైనర్లు

0.56

9.30

ఇతర వస్తువులు 

1.22

13.25

 

***

 



(Release ID: 1847817) Visitor Counter : 82