ఆర్థిక మంత్రిత్వ శాఖ

గుజరాత్‌లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు

Posted On: 02 AUG 2022 2:32PM by PIB Hyderabad

ఆదాయపు పన్ను శాఖ 20.07.2022న టెక్స్‌టైల్స్కెమికల్స్ప్యాకేజింగ్రియల్ ఎస్టేట్ మరియు ఎడ్యుకేషన్ వంటి విభిన్న రంగాలలో ఉన్న ప్రముఖ వ్యాపార సమ్మేళనంపై సెర్చ్ మరియు సీజ్ ఆపరేషన్ నిర్వహించింది. ఖేడాఅహ్మదాబాద్ముంబైహైదరాబాద్ మరియు కోల్‌కతాలో విస్తరించి ఉన్న మొత్తం 58 ప్రాంగణాలలో ఓకేసారి సెర్చ్ నిర్వహించింది.

సెర్చ్ ఆపరేషన్‌లో, వివిధ పత్రాలు, డిజిటల్ డేటా రూపంలో వివిధ నేరారోపణ ఆధారాలను అధికారులు కనుగొని స్వాధీనం చేసుకున్నారు. ఖాతా పుస్తకాలో నమోదు చేయబడని నగదు విక్రయాలుబోగస్ కొనుగోళ్ల బుకింగ్, రియల్ ఎస్టేట్ లావాదేవీల నుండి డబ్బుపై వచ్చే రసీదులతో సహా వివిధ పద్ధతులను అనుసరించడం ద్వారా పెద్ద ఎత్తున పన్ను ఎగవేతలకు పాల్పడినట్లు ఈ ఆధారాలు వెల్లడిస్తున్నాయి. కోల్‌కతా ఆధారిత షెల్ కంపెనీల నుండి షేర్ ప్రీమియం ద్వారా లెక్కించబడని మొత్తాలను లేయర్‌లుగా వేయడంలో ఈ బృందం పాలుపంచుకున్నట్లు కనుగొనబడింది. నగదు ఆధారిత 'సరాఫీ' (అన్‌సెక్యూర్డ్) అడ్వాన్సుల ద్వారా లెక్కలోకి రాని ఆదాయానికి సంబంధించిన కొన్ని లావాదేవీలు కూడా అధికారులు కనుగొన్నారు.

ఆపరేటర్ల ద్వారా తమ లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలను తారుమారు చేయడం ద్వారా గ్రూప్ లాభాలకు పాల్పడినట్లు తేలింది. ప్రమోటర్ల వ్యక్తిగత ఉపయోగం కోసం గ్రూప్ కల్పిత సంస్థల ద్వారా నిధులను పొందినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. ఇంకా, సంస్థ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల ఖాతా పుస్తకాలు తారుమారు కూడా చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ సెర్చ్ ఆపరేషన్ ద్వారా రూ.1000 కోట్లకు మించిన లెక్కల్లో లేని లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు లెక్కల్లో చూపని రూ.24 కోట్లుఆధారాలు లేని ఆభరణాలుకడ్డీ తదితరాలను (విలువ రూ.20 కోట్లు) అధికారులు సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు.

తదుపరి విచారణ కొనసాగుతోంది.

****



(Release ID: 1847681) Visitor Counter : 123