ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) మొహాలి, ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌, క‌ల‌క‌త్తాతో క‌లిసి మౌలిక స‌దుపాయాల రంగంలో సామ‌ర్ధ్య నిర్మాణాల చొర‌వ‌ల‌లో భాగంగా శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించిన డిఇఎ

నాడు పోస్టు చేయడమైనది: 02 AUG 2022 6:19PM by PIB Hyderabad

దేశంలో మంత్రిత్వ శాఖ‌లు, రాష్ట్ర ప్ర‌భుత్వాలు, మౌలిక స‌దుపాయాల  అమ‌లులో విస్త్ర‌త ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థకు సంబంధించిన త‌గు సామ‌ర్ధ్యాల‌ను ప్రోత్స‌హించేందుకు కెపాసిటీ బిల్డింగ్ క‌మిష‌న్ (సామ‌ర్ధ్య నిర్మాణ క‌మిష‌న్ - సిబిసి) స‌హ‌కారంతో ఆర్థిక వ్య‌వ‌హారాల విభాగం (డిఇఎ) కెపాసిటీ ఎన్హాన్స్‌మెంట్ ప్లాన్ ( సామ‌ర్ధ్యాల పెంపు ప్ర‌ణాళిక‌- సిఇపి) ను రూపొందించింది. నేటి వ‌ర‌కూ, మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌ప్ర‌ణాళిక‌, నిర్వ‌హ‌ణ‌, అమ‌లు, ప‌ర్య‌వేక్ష‌ణ‌తో సంబంధం క‌లిగి ఉన్న‌ 358మంది సీనియ‌ర్  ప‌న్నెండు శిక్ష‌ణా కార్య్ర‌క‌మాలు (ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్లు క‌లిపి)నిర్వ‌హించింది. 
ఈ క్ర‌మంలో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజిన‌దెస్ భాగ‌స్వామ్యంతో వారి మొహాలీ క్యాంప‌స్‌లో ప్రాజెక్టు నిర్వ‌హ‌ణ‌, నాయ‌కత్వం అనే అంశంపై  11 నుంచి 15 జులై వ‌ర‌కూ 5 రోజుల శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది.  ప్రాజెక్టుల గుర్తింపు & ఎంపిక‌, స‌మ‌కాలీన ఉప‌క‌ర‌ణాలు & ప‌ద్ధ‌తులు, కాంట్రాక్టు నిర్వ‌హ‌ణ‌, ప‌నితీరు & మార్పు కోసం నాయ‌క‌త్వం, ప్ర‌భావ‌వంత‌మైన చ‌ర్చ‌ల కోసం వ్యూహాలు అన్న అంశాలను ఈ శిక్ష‌ణా కార్య్ర‌క‌మం క‌వ‌ర్ చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రిత్వ శాఖ‌లు /  విభాగాలు, సిపిఎస్ఇలు, రాష్ట్ర ప్ర‌భ‌/త‌్వాల‌కు చెందిన 34మంది సీనియ‌ర్ అధికారులు పాలుపంచుకున్నారు. 
మ‌రొక 5రోజుల శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, క‌ల‌క‌త్తా (ఐఐఎం-సి)భాగ‌స్వామ్యంతో 25 నుంచి 29 జులై వ‌ర‌కూ వారి క్యాంప‌స్‌లో నిర్వ‌హించారు., ప్రాజెక్టు నిర్వ‌హ‌ణ‌లో  సామ‌ర్ధ్య నిర్మాణాలు అన్న విష‌యాంశం పై ప్ర‌ధానంగా ఈ కార్యక్ర‌మం జ‌రిగింది. దీనితో పాటుగా, ప్రాజెక్టు యాజ‌మాన్య న‌మూనా, విప‌త్తు నిర్వ‌హ‌ణ, షెడ్యూలింగ్‌, ప‌ర్య‌వేక్ష‌ణ & నియంత్ర‌ణ‌, విలువ విశ్లేష‌ణ‌, కాంట్రాక్టు నిర్వ‌హ‌ణ‌, వివాదాల ప‌రిష్కారం అన్న అంశాలు కూడా ఈ కార్యక్ర‌మంలో చోటు చేసుకున్నాయి. ఇందులో కేంద్ర మంత్రిత్వ శాఖ‌లు/  విభాగాలు, సిపిఎస్ఇలు, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు చెందిన 35మంది అధికారులు పాల్గొన్నారు. 


***


(రిలీజ్ ఐడి: 1847670) సందర్శకుల సూచీ సంఖ్య : : 173
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Punjabi , English , Urdu , हिन्दी