పర్యటక మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మన్ కీ బాత్ తాజా ఎడిషన్ లో, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ప్రోత్స హించడంలో సంప్రదాయ ఉత్సవాల(జాతరల) ప్రాముఖ్యాన్ని ప్రస్తావించారు.



ఉత్సవాలు(జాతరలు) ప్రజలను, హృదయాలను అనుసంధానిస్తాయి: ప్రధాన మంత్రి

Posted On: 01 AUG 2022 5:59PM by PIB Hyderabad

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 31 జూలై, 2022న 'మన్ కీ బాత్' 91వ ఎడిషన్ సందర్భంగా, భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తి 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్'ను ప్రోత్సహించడంలో సాంప్రదాయ జాతరల ప్రాముఖ్యతను ప్రస్తావించారు. మన్ కీ బాత్ వివిధ ఎడిషన్‌లలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్‌కు సగర్వ స్థానం లభించింది. 'మన్ కీ బాత్' 91 వ ఎడిషన్‌లో, ఈసారి 'మన్ కీ బాత్' చాలా ప్రత్యేకమైనదని ప్రధాని పేర్కొన్నారు. దీనికి కారణం భారతదేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవం.

 

 

మన్ కీ బాత్ ప్రసంగం సందర్భంగా, ప్రధానమంత్రి ఇలా అన్నారు, “ నేను హిమాచల్ ప్రదేశ్ నుండి 'మన్ కీ బాత్' శ్రోత శ్రీమాన్ ఆశిష్ బహ్ల్ జీ నుండి ఒక లేఖ అందుకున్నాను. అతను తన లేఖలో చంబా యొక్క 'మింజర్ మేళా' గురించి పేర్కొన్నాడు. నిజానికి, మొక్కజొన్న మొక్క  పుష్పగుచ్ఛాన్ని మింజార్ అంటారు. మొక్కజొన్నలో పువ్వులు వికసించినప్పుడు, మింజర్ మేళా కూడా జరుపుకుంటారు. ఈ జాతరలో, దేశం నలుమూలల నుండి పర్యాటకులు పాల్గొనడానికి సుదూర ప్రాంతాల నుండి వస్తారు. యాదృచ్ఛికంగా, ఈ సమయంలో మింజర్ జాతర కూడా జరుగుతోంది. మీరు హిమాచల్‌ను సందర్శించడానికి వెళ్ళినట్లయితే, మీరు ఈ జాతరను చూడటానికి చంబాకు వెళ్ళవచ్చు. “చాంబే ఏక్ దిన్ ఓనా కనే మహినా రైనా” అంటే చంబాకు ఒకరోజు వచ్చిన వారు దాని అందాలను చూసి ఒక నెల రోజులు ఇక్కడే మకాం వేస్తారు.

 

మన దేశంలో కూడా జాతరలకు ఎంతో సాంస్కృతిక ప్రాధాన్యత ఉందని ప్రధాని మోదీ అన్నారు. జాతరలు ప్రజలను, హృదయాలను కలుపుతాయి. సెప్టెంబర్‌లో హిమాచల్‌లో వర్షాల తర్వాత ఖరీఫ్ పంటలు పండినప్పుడు, సిమ్లా, మండి, కులు మరియు సోలన్‌లలో, సరి లేదా సైర్ కూడా జరుపుకుంటారు. జాగ్ర కూడా సెప్టెంబర్ లోనే రాబోతోంది. జాగ్ర జాతరలలో మహాసుని దేవతను ఆవాహన చేసి బిసు పాటలు పాడతారు. మహాసు దేవత యొక్క ఈ మేల్కొలుపు హిమాచల్‌లో సిమ్లా, కిన్నౌర్ మరియు సిర్మౌర్‌లో, ఉత్తరాఖండ్‌లో ఏకకాలంలో జరుగుతుంది.

 

మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఆదివాసీ సమాజంకు సంబంధించిన అనేక సంప్రదాయ ఉత్సవాలు ఉన్నాయని ప్రధాన మంత్రి తెలియజేశారు. వీటిలో కొన్ని జాతరలు గిరిజన సంస్కృతితో ముడిపడి ఉండగా, మరికొన్ని గిరిజన చరిత్ర మరియు వారసత్వానికి సంబంధించి నిర్వహించబడుతున్నాయి. ఉదాహరణకు, మీకు అవకాశం లభిస్తే, తెలంగాణలోని మేడారంలో నాలుగు రోజుల పాటు జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరను తప్పక సందర్శించాలి. ఈ జాతరను తెలంగాణ మహాకుంభ్ అంటారు. సారలమ్మ జాతర మేళాను ఇద్దరు గిరిజన స్త్రీలు – సమ్మక్క, సారలమ్మ గౌరవార్థం జరుపుకుంటారు. ఇది తెలంగాణలోనే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్‌లలో కూడా కోయ గిరిజన సమాజానికి పెద్ద విశ్వాస కేంద్రంగా ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌లోని మరిడమ్మ జాతర కూడా గిరిజన సమాజంలోని విశ్వాసాలతో ముడిపడి ఉన్న పెద్ద జాతర. మరిడమ్మ జాతర జ్యేష్ఠ అమావాస్య నుండి ఆషాఢ అమావాస్య వరకు నడుస్తుంది. ఇక్కడి గిరిజన సమాజం శక్తి ఉపాసన, ఆరాధనతో అనుబంధం కలిగి ఉంది. ఇక్కడ తూర్పుగోదావరిలోని పెద్దాపురంలో మరిడమ్మ గుడి కూడా ఉంది. అదేవిధంగా, రాజస్థాన్‌లోని గరాసియా తెగ ప్రజలు వైశాఖ శుక్ల చతుర్దశి నాడు 'సియావా కా మేళా' లేదా 'మంఖాన్ రో మేళా' నిర్వహిస్తారు.

 

 

ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రజల మధ్య వారి వైవిధ్యాన్ని పంచుకోవడం, ప్రశంసించడం ద్వారా వారి మధ్య పరస్పర చర్యను పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రత్యేక కార్యక్రమం; తద్వారా వారి మధ్య పరస్పర అవగాహనను పెంపొందిస్తుంది.

*****

 



(Release ID: 1847128) Visitor Counter : 158