యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

కామన్వెల్త్ క్రీడలు 2022లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ కు మొదటి స్వర్ణాన్ని వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను సాధించిన తర్వాత ఇపుడు రెండవ బంగారు పతకాన్ని గెలుచుకున్న జెరెమీ

Posted On: 31 JUL 2022 5:36PM by PIB Hyderabad

* జెరెమీ అసాధారణ ప్రదర్శనకు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము,  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు 

* జెరెమీని చూసి భారతదేశం గర్విస్తోంది : క్రీడా మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రశంస 

 

 కామన్వెల్త్ గేమ్స్‌లో ఆదివారం జరిగిన 67 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో మిజోరంకు చెందిన 19 ఏళ్ల జెరెమీ లాల్రిన్నుంగా భారత్‌కు రెండో స్వర్ణం అందించాడు. జెరెమీ గేమ్స్‌లో మొత్తం 300కిలోలు (స్నాచ్‌లో 140కిలోలు + C&Jలో 160కిలోలు) ఎత్తాడు, ఇది సిడబ్ల్యూజి రికార్డు. ఈ పోటీల్లో భారత్‌కు ఇది ఐదో పతకం కాగా రెండో స్వర్ణం. రాష్ట్రపతి శ్రీమతి. జెరెమీ సాధించిన విజయానికి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడా మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్   తో పాటు దేశం నలుమూలల అభినందనల వెల్లువ కురిసింది. 

అంతకుముందు, మీరాబాయి చాను కామన్వెల్త్ గేమ్స్ 2022లో మహిళల 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్‌లో మొత్తం 201 కేజీలను ఎత్తడం ద్వారా భారతదేశానికి మొదటి బంగారు పతకాన్ని సాధించింది. పురుషుల 55 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్‌లో సంకేత్ సర్గర్ రజతం సాధించాడు. మహిళల 55 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో బింద్యారాణి దేవి రజత పతకాన్ని గెలుచుకోగా, పురుషుల 61 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో గురురాజా పూజారి కాంస్యం సాధించారు.

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము  జెరెమీకి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ట్వీట్ చేశారు.

“కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణం గెలిచినందుకు జెరెమీ లాల్రిన్నుంగాకు అభినందనలు. ఈవెంట్ సమయంలో గాయపడినప్పటికీ మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని చరిత్ర సృష్టించడానికి, లక్షలాది  మందికి స్ఫూర్తిని కలిగించేలా చేసింది.మీ పోడియం ముగింపు భారతీయులకు గర్వంగా నిలిచింది. మీకు ఇలాంటి కీర్తి క్షణాలు మరిన్ని రావాలని కోరుకుం టున్నాను. ” అని రాష్ట్రపతి ట్వీట్ లో పేర్కొన్నారు. 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జెరెమీ లాల్రిన్నుంగా తన మొట్టమొదటి కామన్వెల్త్ క్రీడలలో స్వర్ణ పతకం సాధించి, కామన్వెల్త్ గేమ్స్ రికార్డు సృష్టించినందుకు అభినందించారు. మన యువశక్తి చరిత్ర సృష్టిస్తోంది’ అని ప్రధాని ట్వీట్ చేశారు. చిన్న వయస్సులోనే జెరెమీ అపారమైన గౌరవాన్ని, కీర్తిని తెచ్చిపెట్టారని అన్నారు. ఆయన భవిష్యత్ ప్రయత్నాలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.”

అంతకుముందు, బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలు 2022లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఒక ట్వీట్‌లో, ప్రధాని ఇలా అన్నారు; "అసాధారణమైన మీరాబాయి చాను భారతదేశాన్ని మరోసారి గర్వించేలా చేసింది! బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో ఆమె స్వర్ణం గెలిచి కొత్త కామన్వెల్త్ రికార్డును నెలకొల్పినందుకు ప్రతి భారతీయుడు సంతోషిస్తున్నాడు. ఆమె విజయం అనేక మంది భారతీయులకు, ముఖ్యంగా వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది."

బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన జెరెమీ లాల్రినుంగను క్రీడా మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ అభినందించారు. "సిడబ్ల్యుజి 2022లో పురుషుల 67 కిలోల వెయిట్ లిఫ్టింగ్‌లో జెరెమీ స్వర్ణం ఖేలో ఇండియా నుండి టాప్స్ కోర్ గ్రూప్‌కి ఎదగడానికి గొప్ప ఉదాహరణ" అని శ్రీ ఠాకూర్ ట్వీట్ చేశారు. జెరెమీ ఆటల రికార్డును కూడా బద్దలు కొట్టినట్లు మంత్రి తెలిపారు. అతడిని చూసి భారతదేశం గర్విస్తోందని అన్నారు.

అంతకుముందు శ్రీ ఠాకూర్ మీరాబాయి చానుని అభినందిస్తూ, ట్వీట్ చేస్తూ, “మీరాబాయి చాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్వర్ణం, మహిళల 49 కేజీల స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్,  మొత్తం లిఫ్ట్‌లో కొత్త ఆటల రికార్డును సృష్టించింది. మీ అద్భుతమైన ప్రదర్శనతో మీరు భారతదేశాన్ని మళ్లీ అగ్రస్థానంలో నిలిపారు. " అని అన్నారు. 

 

 

Click here for achievements of Jeremy Lalrinnunga

 

 

*******



(Release ID: 1846836) Visitor Counter : 123