జౌళి మంత్రిత్వ శాఖ
జౌళి & పర్యాటక అనుసంధానం ఏక ప్రాంతంలో హస్తకళలు, పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఎనిమిది గ్రామాల హస్తకళల అభివృద్ధి
చేతిపనివారికి హస్తకళల ద్వారా నిలకడైన, ఆదాయాన్ని కల్పించేందుకు హస్తకళల గ్రామం అభివృద్ధి
Posted On:
29 JUL 2022 1:05PM by PIB Hyderabad
పర్యాటకంతో జౌళి అనుసంధానం కింద ప్రధాన పర్యాటక ప్రదేశాలను చేతిపనుల సమూహం, మౌలిక సదుపాయాల మద్దతుతో నెమ్మదైన చొరవలను జత చేయడాన్ని ప్రతిపాదిస్తున్నారు.
ఈ విషయంలో, పర్యాటం, హస్తకళల ప్రోత్సాహం, పర్యాటకం ఒకే ప్రాంతంలో జరుగుతున్న 8 హస్తకళల గ్రామాలు - రఘురాజ్‌పూర్ (ఒడిషా), తిరుపతి (ఆంధ్రప్రదేశ్), వదజ్ (గుజరాత్), నైనీ (ఉత్తర్‌ప్రదేశ్), అనెగొంది (కర్ణాటక), మహాబలిపురం (తమిళనాడు), తాజ్ గంజ్ (ఉత్తర్ ప్రదేశ్), అమెర్ (రాజస్థాన్)ల సమగ్రాభివృద్ధికి పనులను ఇప్పటికే చేపట్టడం జరిగింది.
హస్తకళల గ్రామాలు ఆ గ్రామ సముదాయాలలో చేతివృత్తి పనివారలకు నిలకడైన ఆదాయాన్ని ఆర్జించే ప్రత్యామ్నాయంగా చేతిపనులను అభివృద్ధి చేయడంతో పాటుగా దేశపు గొప్ప శిల్పకళా వారసత్వాన్ని కాపాడుతారు. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 1000 చేతివృత్తి పనివారు లబ్ధిపొందతారు. ఈ కార్యక్రమం ఈ హస్తకళల గ్రామాలకు పర్యాటక ప్రవాహాన్ని పెంచింది.
****
(Release ID: 1846613)
Visitor Counter : 148