రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

' స్వావలంబన్ ' - భారత నావికాదళం మొట్ట మొదటి నావల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజెనైజేషన్ సెమినార్

Posted On: 20 JUL 2022 1:00PM by PIB Hyderabad

2022 జూలై 18-19 తేదీల్లో న్యూఢిల్లీలో నావల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజెనైజేషన్ ఆర్గనైజేషన్ (ఎన్ఐఐఓ) తొలి సెమినార్ 'స్వావలంబన్ ' జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు.

 

రెండు రోజుల పాటు జరిగిన సెమినార్ లో నావికాదళ సిబ్బందితో పాటు విద్యావేత్తలు, పారిశ్రామిక రంగ ప్రముఖులు, విధాన నిర్ణేతలు, మేధావులు, విద్యార్థులు ,సీనియర్ ప్రభుత్వ అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కమాండ్ హెడ్ క్వార్టర్స్, నేవీ అవుట్ లయింగ్ విభాగాల సిబ్బంది కూడా దేశవ్యాప్తంగా నిర్దేశించిన ఆడిటోరియంలలో ఆన్ లైన్ ద్వారా పాల్గొన్నారు.

 

రియర్ అడ్మిరల్ వినీత్ మెక్ కార్టీ, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ (స్టాఫ్ అవసరాలు) స్వాగతోపన్యాసంతో ఉదయం ప్రారంభ సెషన్ ప్రారంభమైంది, దీని తరువాత రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ ప్రసంగించారు. వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఎస్ఎన్ ఘోర్మేడ్ కీలకోపన్యాసం చేశారు. ప్రెసిడెంట్ సిడ్ఎమ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫాక్చరర్స్) పరిశ్రమ దృక్పథాన్ని అందించారు.ఎంఒయుల మార్పిడి, ఇండియన్ నేవల్ డైరెక్టరీ ఆఫ్ ఇండస్ట్రీ పార్టనర్స్ (ఐఎన్ డిఐపి) విడుదల కూడా ప్రారంభ సెషన్ లో చేపట్టారు.

 

తొలి రోజున  నిర్ధిష్ట ఇతివృత్తాలతో నాలుగు ఇంటరాక్టివ్ సెషన్ లు  జరిగాయి. ఇన్నోవేషన్ పై సెషన్ భారతీయ నావికాదళంలోకి సముచిత టెక్నాలజీ అన్వయింపును వేగవంతం చేయడంలో పరిశ్రమ, అకాడెమియా , పాలసీ పాత్రను పరిశీలించింది. ఇప్పటివరకు ఎన్ ప్రయాణం , ముందుకు సాగే మార్గం గురించి చర్చించారు.నావికాదళ ఆయుధ సంపత్తిపై దృష్టి సారించిన రెండవ ఇంటరాక్టివ్ సెషన్ సముచిత రంగంలో ఆత్మనిర్భరతను సాకారం చేసుకోవడానికి భారతీయ పరిశ్రమ సామర్థ్యాన్ని ఉపయోగించుకునే మార్గాల గురించి చర్చించింది. విమానయానంపై దృష్టి సారించిన మూడవ సెషన్ అల్గోరిథమిక్ వార్ ఫేర్ శకంలో భవిష్యత్ ఆఫ్ ఏవియేషన్ ను పరిశీలించింది. ఇక చివరి ఇంటరాక్టివ్ సెషన్ లో స్వావలంబన దిశగా స్వదేశీకరణ అనే ఇతివృత్తం తో సాగింది. దేశీయ రక్షణ ఉత్పత్తిని పెంపొందించే మార్గాలు, ముడిపడిన సవాళ్లుముందుకు సాగడం గురించి చర్చించారు.

 

ప్లీనరీ సమావేశానికి గౌరవ ప్రధాన మంత్రితో పాటు ఇతర ప్రముఖులు , సీనియర్ ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.   సందర్భంగా పరిశ్రమ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రధాన మంత్రి తిలకించారు. ఆటోనమస్ మల్టీ కాప్తర్ డ్రోన్ కేపబుల్ ఆఫ్ క్యారీయింగ్ ప్యాసింజర్ 'వరుణ' పర్సనల్ ఎయిర్ వెహికల్ డెమోను  ప్రధాన మంత్రి వీక్షించారు. రక్షణ పర్యావరణ వ్యవస్థకు అనుభవజ్ఞులు అందిస్తున్న చేస్తున్న సహకారాన్ని నొక్కిచెప్పారు.

 

ఐడెక్స్ డిస్క్7 (స్ప్రింట్ ) సవాళ్ల ను ప్రధాన మంత్రి విడుదల చేయడం సెమినార్ కు ప్రధాన ఆకర్షణగా  నిలిచింది.స్ప్రింట్ (ఐడెక్స్, ఎన్ ఐఐఓ , టిడిఎసి ద్వారా ఆర్ అండ్ డి పోల్ వాల్టింగ్ కు మద్దతు ఇవ్వడం) అనేది డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ (డి ),  ఎన్ మధ్య సహకార ప్రాజెక్ట్, ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కనీసం 75 స్వదేశీ టెక్నాలజీలు/ప్రొడక్ట్ లను అభివృద్ధి చేయడం  లక్ష్యంగా పెట్టుకుంది.

కృత్రిమ మేధస్సు ( ), స్వయంప్రతిపత్తమానవరహిత వ్యవస్థలు ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సహా అనేక సముచిత సాంకేతిక రంగాలలో సవాళ్లు విస్తరించాయి. వరుసగా రూ.1.5 కోట్లు, రూ.10 కోట్ల వరకు గ్రాంట్ల కోసం నిబంధనలను కలిగి ఉన్న ఐడెక్స్ డిస్క్ (డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజ్) ,ప్రైమ్ కేటగిరీల కింద సవాళ్లను పరిగణనలోకి తీసుకుంటారు.అంతేకాకుండా, ఐడెక్స్ ఓపెన్ ఛాలెంజ్ కేటగిరీ కింద ఆవిష్కర్తలు , స్టార్టప్ లు సమర్పించిన సుమోటో ప్రతిపాదనలను కూడా స్ప్రింట్ కింద పరిగణనలోకి తీసుకుంటున్నారు.

 

ప్రతిష్టాత్మక టైమ్ లైన్ లు చేరుకున్నట్లుగా ధృవీకరించడం కోసం బహుళ స్థాయిల మానిటరింగ్ అమలు చేస్తారు. కేసుల సన్నిహిత సమన్వయం, , నిరంతర పర్యవేక్షణ కోసం ఎన్ ఐఐఓ, డిఐఓ ద్వారా కాంటాక్ట్ పాయింట్ లు గుర్తించారు. దీనికి అదనంగా, వైస్ చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ అధ్యక్షతన గలఎన్ ఐఒ వర్కింగ్ గ్రూప్ ,నావల్ టెక్నాలజీ యాక్సిలరేషన్ కౌన్సిల్ (ఎన్ టిఎసి) ద్వారా నియతానుసారంగా సమీక్షలు జరుగుతాయి.

 

రెండవ రోజు సెమినార్ ప్రభుత్వ విస్పష్ట దార్శనిక సాగర్ ( ప్రాంతంలో అందరికీ భద్రత ,వృద్ధి) కు అనుగుణంగా హిందూ మహాసముద్ర ప్రాంతం (ఐఒఆర్) కు ఔట్ రీచ్ పై దృష్టి పెట్టింది. స్నేహపూర్వక విదేశాలకు వారి 'ఎగుమతి సిద్ధంగా' ఉత్పత్తులను ప్రదర్శించడానికి పరిశ్రమకు అవకాశం కల్పించారు. సెమినార్ భాగాన్ని న్యూఢిల్లీ

లోని ఐఓఆర్ దేశాల డిఫెన్స్ అటాచ్ లు వీక్షించగా, విదేశాలలో నియమితులైన భారత నావికాదళ అధికారులు భాగస్వామ్యం కోసం వారి పోస్టింగ్ దేశాలతో సమన్వయం చేశారు. ఇరవై ఐదు దేశాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

 

మొట్ట మొదటి సెమినార్ పరిధి , ఉద్దేశం రెండింటి lపరంగా 'చారిత్రాత్మకమైనది', రక్షణలో స్వావలంబన దిశగా నావికాదళంలో ఇది ఒక కొత్త అధ్యాయానికిఆత్మనిర్భర్ భారత్ కు తెర తీస్తుంది.

 

****


(Release ID: 1843163) Visitor Counter : 246