ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

199.98 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.79 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,43,449

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 20,528

ప్రస్తుత రికవరీ రేటు 98.47%

వారపు పాజిటివిటీ రేటు 4.55%

Posted On: 17 JUL 2022 9:54AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 199.98 కోట్ల ( 1,99,98,89,097 ) డోసులను అధిగమించింది. 2,63,22,345 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.79 కోట్లకు పైగా ( 3,79,82,251 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,10,322

రెండో డోసు

1,00,79,660

ముందు జాగ్రత్త డోసు

60,21,211

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,27,518

రెండో డోసు

1,76,52,093

ముందు జాగ్రత్త డోసు

1,14,59,871

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,79,82,251

రెండో డోసు

2,62,02,322

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,08,43,400

రెండో డోసు

5,01,13,916

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,88,87,272

రెండో డోసు

50,58,64,044

ముందు జాగ్రత్త డోసు

62,19,363

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,35,68,118

రెండో డోసు

19,45,59,339

ముందు జాగ్రత్త డోసు

45,13,607

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,73,60,055

రెండో డోసు

12,15,70,899

ముందు జాగ్రత్త డోసు

2,81,53,836

ముందు జాగ్రత్త డోసులు

5,63,67,888

మొత్తం డోసులు

1,99,98,89,097

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,43,449. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.33 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 17,790 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,30,81,441 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 20,528 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,92,569 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 86.94 కోట్లకు పైగా ( 86,94,25,632 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 4.55 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 5.23 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1842263) Visitor Counter : 126