సహకార మంత్రిత్వ శాఖ
దేశంలో సాగు స్థితిగతులను మార్చేసిన వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకులు
ఎ.ఆర్.డి.బి.ల జాతీయ సదస్సులో
ముఖ్య అతిథి కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటన..
9దశాబ్దాల కింద అదృష్టంపైన మాత్రమే
ఆధారపడిన వ్యవసాయం...
వ్యవసాయాన్ని శ్రమ ఆధారంగా మార్చిన
వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకులు..
సమీకృత డాటాబేస్ లేనిదే
సహకార రంగం విస్తృతి సాధ్యం కాదు.
మోదీ ప్రభుత్వ సారథ్యంలో ఈ డాటాబేస్‌ను
సృష్టిస్తున్న సహకార రంగం..
పి.ఎ.సి.ఎస్.ల బహుముఖ వృద్ధికి
సహకార మంత్రిత్వ శాఖ కృషి..
70-80ఏళ్ల బై-లాస్ మార్పుతో పి.ఎ.సి.ఎస్.లకు
కొత్త విధులను జోడిస్తున్నాం..
70శాతం పేదలను సమ్మిళిత అభివృద్ధిలో
భాగస్వాములను చేయగలిగేది సహకార రంగమే..
సంస్కరణలు బ్యాంకులకే పరిమితం కాకుండా,
సహకార రంగానికి వర్తింపజేసినపుడే
సహకారోద్యమం బలోపేతమవుతుంది...
సదస్సుకు హాజరైన వారంతా సహకార రంగం
ఉత్తమ విధానాలపై చర్చ జరపాలి..
బ్యాంకింగ్ సంస్కరణలపై సూచనలు ఉంటే
స్వీకరించడానికి సహకార శాఖ సిద్ధంగా ఉంది...
నాబార్డ్ ప్రతి రూపాయీ వ్యవసాయం,
గ్రామీణాభివృద్ధికే ఉపయోగపడాలి...
ఇందుకు దీర్ఘకాలిక ఆర్థిక సహాయం,
మౌలిక సదుపాయాలు, సూక్ష్మ సేధ్యం అవసరం...
స్వాతంత్ర్యం తర్వాత గత 70ఏళ్లలో
6
Posted On:
16 JUL 2022 6:30PM by PIB Hyderabad
ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకుల (ఎ.ఆర్.డి.బి.ల) జాతీయ సదస్సులో కేంద్ర హోమ్, సహకార శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర సహకార, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల సహాయమంత్రి బి.ఎల్. వర్మ,కేంద్ర సహకార మంత్రిత్వ శాఖకార్యదర్శి, భారత జాతీయ సహకార సంఘాల యూనియన్ (ఎన్.సి.యు.ఐ.) అధ్యక్షుడు, ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘానీ, అంతర్జాతీయ సహకార కూటమి ఆసియా పసిఫిక్ ప్రాంతీయ అధ్యక్షుడు, కృషక్ భారతి సహకార సంఘం (క్రిభ్‌కో) చైర్మన్ డాక్టర్ చంద్రపాల్ సింగ్ యాదవ్, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర హోమ్, సహకారశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, వ్యవసాయ అభివృద్ధికి సహకారసంఘాల విస్తృతి చాలా ముఖ్యమని, సహకార సంఘాల విస్తరణ లేకుండా, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలను సాకారం చేయజాలమని అన్నారు. దేశంలో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకుల పురోగతికి దాదాపు 9 దశాబ్దాల చరిత్ర ఉందన్నారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు వ్యవసాయ రుణ వ్యవస్థకు రెండు మూలస్తంభాలని అన్నారు. 1920వ సంవత్సరానికి ముందు కాలంలో వ్యవసాయ రంగం పూర్తిగా వర్షాలపైనే ఆధారపడి ఉండేదని, వర్షాలు వచ్చినపుడు మాత్రమే వ్యవసాయం మంచి దిగుబడిని ఇచ్చేదని అన్నారు. 1920వ పడిలో రైతులకు దీర్ఘకాలిక రుణాల సదుపాయం ప్రారంభమైందని, దీనితో తన పొలంలోనే మౌలిక సదుపాయాలను నెలకొల్పుకోవాలన్న రైతుల కలలు సాకారం కావడం మొదలైందని అన్నారు. కేవలం వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకులు మాత్రమే దేశ వ్యవసాయ రంగాన్ని మార్చివేశాయని, దీనితో అదృష్టం ప్రాతిపదికన జరిగే వ్యవసాయం, శ్రమ ఆధారిత వ్యవసాయంగా మారిందని అన్నారు. రైతులను స్వావలంబన సాధించేలా మార్చడంలో సహకార రంగం విస్తృతి ఎంతగానో దోహదపడిందని అన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయని, దీర్ఘకాలిక రుణ వ్యవస్థను పెంపొందించనిదే వ్యవసాయాభివృద్ధి సాధ్యం కాదన్నది ప్రధానమంత్రి భావన అని అన్నారు. బ్యాంకులు దెబ్బతిన్న పెద్ద రాష్ట్రాలు కూడా ఉన్నాయని, ఈ అంశాన్ని కూడా మనం పరిశీలించవలసిన అవసరం ఉందని అమిత్ షా అన్నారు. వ్యవసాయేతర వినియోగంకోసం అదనపు నిధులను అభివృద్ధి చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదన్నారు. అందుబాటులోని నిధులన్నింటినీ గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాలపై ఖర్చుపెట్టినప్పుడే జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) లక్ష్యాలు నెరవేరుతాయని అన్నారు. వ్యవసాయంలో దీర్ఘకాలిక రుణ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, సూక్ష్మ సాగు వంటి విధానాలను ప్రోత్సహించనిదే నాబార్డ్ లక్ష్యాలు పూర్తిగా నెరవేరబోవని ఆయన అన్నారు.
వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకుల పని కేవలం రుణసదుపాయం అందించడంతోనే పూర్తికాబోదని, అవి తమ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని అమిత్ షా అన్నారు. విస్తరణ ప్రక్రియలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా వారిని తొలగించే మార్గాలను మనం అన్వేషించాలని అప్పుడే వ్యవసాయ అభివృద్ధి లక్ష్యాన్ని సాధించగలమని ఆయన అన్నారు. మనం బ్యాంకులను నిర్వహించడం మాత్రమే కాక, బ్యాంకింగ్ లక్ష్యాలను నెరవేర్చేందుకు కూడా పనిచేయాలని అన్నారు.
దీర్ఘకాలిక రుణాల లక్ష్యాలను సాధించేందుకే సహకార సంఘాలను రూపొందించారని, కొత్త సహకార సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా, రైతులందిరికీ మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలను అందించాల్సి ఉందని ఆయన సూచించారు.
సత్వర రుణమంజూరీ వ్యవస్థను, రుణాల వసూలు వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అమిత్ షా అన్నారు. సహకార రంగంలో సేవలను మరింత విస్తృతం చేయాలని, సేద్యపునీటి సదుపాయంతో సాగయ్యే భూమి శాతాన్ని, దిగుబడిని, ఉత్పాదనను పెంచే అంశంపై మరింత విపులంగా చర్చించాలని, రైతులను సుసంపన్నం చేయాలని, సహకార రుణాలపై రైతులకు అవగాన కల్పించాలని ఆయన సూచించారు. సహకార సంఘాల్లో కేవలం పదవిలో ఉన్నంత మాత్రాన సరిపోదని, 1924లో సహకార సంఘాలను ఎందుకు స్థాపించారో ఆ లక్ష్యాలను సాధించే విషయమై శ్రద్ధగా ఆలోచించాలని అన్నారు. బ్యాంకులు 3 లక్షల ట్రాక్టర్ల కొనుగోళ్లకు రుణం అందించాయని, దేశంలో 8లక్షలకుపైగా ట్రాక్టర్లు ఉన్నాయని అన్నారు. 13కోట్ల మంది రైతుల్లో 5.2లక్షల మంది రైతులకు మాత్రమే మనం మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలు అందించామన్నారు. బ్యాంకులు ఎన్నో సంస్కరణలు చేపట్టాయని, అయితే వ్యవసాయ రంగానికి పూర్తిగా ప్రయోజనం అందించేలా సంస్కరణలు ఉండాలని అన్నారు.
ఏదైనా బ్యాంకు మంచిపనిచేసిన పక్షంలో సహకార సమాఖ్య దాన్ని గురించి అన్నిబ్యాంకులకు ఆ సమాచారాన్ని తెలియజేసి, ముందుకు తీసుకెళ్లాలన్నారు. బ్యాంకింగ్ రంగానికే ప్రయోజనం కలిగించేలా సంస్కరణలు ఉండాలని అప్పుడే సహకార రంగం మరింత బలోపేతమనవుతుందన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార రంగాల పరిధిలోకి బావులు, పంపుసెట్లు, భూమి అభివృద్ధి, ఉద్యానవన సాగు, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమ వంటి వాటిని చేర్చారని, అయితే ఈ వ్యవస్థను విస్తరింపచేడయం మన బాధ్యత అని అన్నారు. అప్పుడే సహకార సంఘాల లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఈ రోజు ఈ సదస్సుకు హాజరవుతున్న బ్యాంకు సభ్యులంతా సహకార రంగం ఉత్తమ విధానాలపై చర్చించాలని, బ్యాంకింగ్ రంగంలో ఏవైనా సంస్కరణలు అసరమైనపక్షంలో, అందుకు సంబంధించిన సూచనలను స్వీకరించడానికి సహకార మంత్రిత్వ శాఖ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అన్నారు.
దేశంలో వ్యవసాయ రుణాల వ్యవస్థ ఒక విధంగా దెబ్బతిని ఉందని, చాలా వరకు ప్రాంతాల్లో వ్యవస్థ కార్యకలాపాలు చక్కగా సాగుతున్నప్పటికీ, పలు రాష్ట్రాల్లో ఇది చెల్లాచెదురైందని అన్నారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని చక్కదిద్ది, నిస్సహాయంగా ఉన్న రైతులను ఆర్థికాభివృద్ధి బాటలో నిలిపాల్సి ఉందని, ఇందుకోసం సహకార రంగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని అమిత్ షా అభిప్రాయపడ్డారు. సహకార రంగంలో పెట్టుబడికి ఎలాంటి నిధుల లోపం లేదని, రుణాల వ్యవస్థను, మన మౌలిక సదుపాయాలను పునరుద్ధరించవలసి ఉందని, ఈ కార్యకలాపాలు సమస్యాత్మక ప్రాంతాలను ప్రతి స్టేట్ బ్యాంకు గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతులు, తమకు అవసరమైన మధ్యకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక సహాయం పొందేందుకు వీలుగా నాబార్డ్ కూడా రుణాల వ్యవస్థ విస్తరణ విభాగాన్ని రూపొందించాలన్నది తన అభిప్రాయమని అన్నారు. అవసరమైన మేరకు సంస్థాగత రుణాల వ్యవస్థను వర్తింపజేయడం ఇప్పటి ఆవశ్యకత అని అన్నారు. స్వల్పకాలిక పరపతి వ్యవస్థ కంటే దీర్ఘకాలిక పరపతి వ్యవస్థకు ఎప్పటికీ ఎక్కువ స్థాయిలో ప్రాధాన్యం ఉండాలని అన్నారు. దీర్ఘకాలిక ఆర్థిక వ్యవస్థ పెరిగేకొద్దీ వ్యవస్థ మెరుగవుతూ వస్తుందని, దీనితో స్వల్పకాలిక రుణ వ్యవస్థ కూడా దానంతట అదే పెరుగుతూ వస్తుందని అన్నారు.
పాతికేళ్ల కిందట దీర్ఘకాలిక రుణాల వాటా 50శాతం ఉండేదని, ప్రస్తుతం ఇపుడు ఈ వాటా 25శాతానికి తగ్గిందని, ఇది ఆందోళనకరమైన పరిణామమని అన్నారు. అస్సాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని అన్నారు. ప్రస్తుతం దేశంలోని 13రాష్ట్రాల్లోని వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకులు మాత్రమే ప్రభుత్వ ఆశయాలు, ప్రమాణాల మేరకు పనిచేస్తున్నాయని అన్నారు.
వ్యవసాయ భూమి అందుబాటు విషయంలో ప్రపంచంలో భారతదేశం స్థానం ఏడవ స్థానంసో ఉందని, వ్యవసాయ కార్యకలాపాల్లో మాత్రం మనం అమెరికా తర్వాతి స్థానంలో అంటే రెండవ స్థానంలో ఉన్నామని అన్నారు. ఈ పరిస్థితుల్లోనే నాబార్డ్ ఏర్పాటైందని, మనం 39.4కోట్ల ఎకరాల భూమిని పూర్తిగా సేద్యపునీటి సదుపాయం కల్పిస్తే, రైతులు దేశంలోనే కాక, ప్రపంచం ఆకలి బాధలను నిర్మూలించగలుగుతారని అమిత్ షా అన్నారు. ఒక వేళ సేద్యపునీటి వ్యవస్థకు తగినంత నీటి సదుపాయం లేని పక్షంలో సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థ దిశగా ముందుకు సాగాల్సి ఉందని, భూమి కమతాలు చిన్నవిగా మారిన పక్షంలో సహకార సంఘాల సహాయంతో సాగునీటిని సదుపాయాన్ని కల్పించాలని అన్నారు. మన అసరాలకు తగినట్టుగా బ్యాంకులను పునర్‌వ్యవసస్థీకరించాల్సి ఉందని, ప్రభుత్వం, నాబార్డ్, సహకార సమాఖ్య ఈ దిశగా తగిన కృషి చేయాలని అన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ బలమైన దీర్ఘకాలిక రుణాల వ్యవస్థను ఎలా ఏర్పాటు చేయాలన్న అంశంపై రానున్న రోజుల్లో నాబార్డ్, సమాఖ్య, సహకార శాఖలతో ఒక ఉమ్మడి సమావేశాన్ని తాను ఏర్పాటు చేయబోతున్నానని అమిత్ షా చెప్పారు. ఇందుకోసం సహకార సమాఖ్య కీలకపాత్ర పోషించాల్సి ఉందన్నారు.
సహకార వ్యవస్థ అభివృద్ధి కోసం ప్రదానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పలు చర్యలు తీసుకున్నట్టు కేంద్రమంత్రి అమిత్ షా చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ, సహకార సంఘాలను (పి.ఎ.సి.ఎస్.లను) అన్నింటినీ రూ. 2,500కోట్లతో కంప్యూటరీకరించేందుకు చర్యలు తీసుకోవడం చాలా గొప్ప విషయమని అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లాల సహకార బ్యాంకులు, రాష్ట్రస్థాయి సహకార బ్యాంకులు, నాబార్డ్‌ల అక్కౌంటింగ్ వ్యవస్థలు ఆన్‌లైన్‌లో అనుసంధానం కాబోతున్నాయని దీనితో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పారదర్శకంగా నిర్వహించడానికి వీలవుతుందని, ఇది చాలా ప్రయోజనకరమని అన్నారు. ఒక సహకార విశ్వవిద్యాలయం నెలకొల్పాలని సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ప్రస్తుతం రూ. వంద కోట్ల కంటే ఎక్కువ వ్యాపారం చేసే యూనిట్లన్నీ జి.ఇ.ఎం. వేదికపై కొనుగోళ్లు జరపగలుగుతున్నాయని, దీనితో ఉత్పాదనల సేకరణ ప్రక్రియ కూడా చవుకగా మారుతుందని, దీనితో అవినీతిని కూడా నిర్మూలించినట్టవుతుందని అన్నారు.
దేశంలో సహకార సంఘాలకు సంబంధించిన సమాచార వ్యవస్థ (డాటాబేస్) లేదని, డాటాబేస్ లేనిదే విస్తరణ కార్యకలాపాల గురించి ఆలోచించడం సాధ్యంకాదని అన్నారు. తీరప్రాంతాల్లోని రాష్ట్రాల్లో మత్స్యకార్మికులకు సహకార సంఘాలు అందుబాటులో లేవన్నది తెలుసుకునే డాటాబేస్ మనకు లేదని అన్నారు. దేశంలో ఎన్ని సహకార సంఘాలు పనిచేస్తున్నాయో, ఎన్ని గ్రామాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నోచుకోలేదో.. అన్న సమాచారం తెలిపే డాటాబేస్ కూడా మనకు అందుబాటులో లేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఎంతో ప్రయోజనకరమైన ఈ డాటాబేస్‌ను ఏర్పాటుచేసే ప్రక్రియను తాము ప్రారంభించామన్నారు. విస్తరణ ప్రక్రియ ఎక్కడ అవసరమో తెలిసినపుడే విస్తరణ జరిగే అవకాశం ఉంటుందని, ఇందుకు సంబంధించిన మౌలికపరమైన కార్యకలాపాలను కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ప్రారంభించిందని అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకోసం నమూనా నిబంధనల తయారీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, సహకార ఉద్యమంలో పాలుపంచుకునే వారంతా తమ అనుభవాల ఆధారంగా తగిన సూచనలను ప్రభుత్వానికి పంపించాలని తాను విజ్ఞప్తి చేస్తున్నట్టు అమిత్ షా చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బహముఖ ప్రయోజనాల సంస్థలుగా తీర్చిదిద్దాలన్నది తమ అభిమతమని అన్నారు. గ్యాస్ పంపిణీ, నిల్వ, చవుక ధాన్యాలకోసం దుకాణాలను పరిగణనలోకి తీసుకోవడం వంటి కార్యకలాపాలను పి.ఎ.సి.ఎస్.లు చేపట్టవచ్చని వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలుగా అవి మారవచ్చని, కమ్యూనికేషన్ కేంద్రాలుగా రూపుదిద్దుకోవచ్చని, కుళాయిల ద్వారా నీటి సరఫరాను చేపట్టవచ్చని ఆయన అన్నారు. కంప్యూటర్ సదుపాయంతో అనుసంధానించిన పక్షంలో ఈ కార్యకలాపాలన్నీ చేపట్టవచ్చని అన్నారు. ఎప్పుడో 70-80 ఏళ్ల కింద రూపొందించిన నిబంధనలను, బై-లాస్‌ను పూర్తిగా మార్చవలసిన అవసరం ఉందన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సహకార స్ఫూర్తిని తాము ఏమాత్రం తగ్గించడం లేదని, ఆ సంఘాలకు కొత్త కార్యకలాపాలను, విధులను జోడించేందుకు తాము కృషి చేస్తున్నామని అన్నారు.
సహజ వ్యవసాయ ఉత్పాదనలను మార్కెటింగ్‌కు సంబంధించిన ప్రాథమిక పనులను అమూల్ సంస్థ కూడా నిర్వర్తిస్తోందని అమిత్ షా అన్నారు. చేతి పని వస్తువులను, హస్తకళా ఖండాల మార్కెటింగ్ కోసం బహుళ విధుల రాష్ట్ర సహకార సంఘాలను ఏర్పాటు చేసే విషయం తాము యోచించామని అన్నారు. విత్తన సంస్కరణలకు సంబంధించిన బాధ్యతలను భారతీయ వ్యవసాయ ఎరువుల సహకార సంఘానికి (‘ఇఫ్కో’కు), క్రిబ్కోకు అప్పగించామని, ఎగుమతులకోసం బహుళ రాష్ట్రాల సహకార ఎగుమతుల సంస్థ ఏర్పాటు కాబోతున్నదని, ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీలోగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇది వాస్తవ రూపం దాల్చేలా తాము తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సహకార మంత్రిత్వ శాఖకు భారీ స్థాయిలో కేటాయింపును పెంచాలన్న ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే ఆమోదం తెలిపారని అన్నారు. వ్యవసాయాభివృద్ధి కోసం నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధర (ఎం.ఎస్.పి.) గురించి తాను తప్పనిసరిగా ప్రస్తావించాల్సి వస్తుందని అమిత్ షా అన్నారు.
దేశంలో వరిధాన్యం సేకరణ దాదాపు 8శాతం పెరిగిందని, 2014-15వ సంవత్సరంలో 475లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్య సేకరణ జరగ్గా, ఇపుడు 896 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరణ జరిగిందని, లబ్ధి పొందిన రైతుల సంఖ్య కూడా 76లక్షలనుంచి కోటీ 31లక్షలకు పెరిగిందని అన్నారు. గోధుమల సేకరణ 72శాతం పెరిగిందని, ఇంతకుముందు 251లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా, ఈరోజున 433లక్షల మెట్రిక్ టన్నుల గోధులను కొనుగోలు చేసినట్టు తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు, సేంద్రియ వ్యవసాయానికి, సహజ వ్యవసాయానికి ఇతోధిక ప్రోత్సాహం లభిస్తోందని, వ్యవసాయ ఎగుమతులు వంటివి తొలిసారిగా 50 బిలియన్ల అమెరికన్ డాలర్ల స్థాయికి చేరాయని అన్నారు.
‘‘ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన’’ పథకంకిందగత ఎనిమిదేళ్లలో వ్యవసాయ భూమి విస్తీర్ణం 64లక్షల హెక్టార్లు పెరిగిందన్నారు. గతంలో 70ఏళ్లలో పెరిగిన వ్యసాయ భూమి విస్తీర్ణం కేవలం 64లక్షల హెక్టార్లు మాత్రమేనని అన్నారు. వ్యవసాయ మౌలిక సదపాయాల్లో ప్రభుత్వ పెట్టుబడి పెరిగేకొద్దీ, సహకార సంఘాల సామర్థ్యం, ప్రత్యేకించి వ్యవసాయ పరపతిలో సహకార సంఘాల సామర్థ్యం పెరుగుతుందని ఆయన అన్నారు. దేశంలో వ్యవసాయ యాంత్రీకరణ కూడా ప్రారంభమైందని, 10,000వరకూ వ్యవసాయ ఉత్పత్తిదార్ల సంఘాల (ఎఫ్.పి.ఒ.,)కోసం రూ. 6,800కోట్ల బడ్జెట్‌ను ఖర్చు పెట్టారని, మండీల్లో డిజిటల్ లావాదేవీలు భారీస్థాయిలో పెరిగాయని అమిత్ షా అన్నారు. సహకార రంగాన్ని ప్రభుత్వం మాత్రమే విస్తరించడం సాధ్యంకాదని, సహకార సంఘాలు కూడా తమంత తాముగా ఆ పనిచేయాల్సి ఉంటుందని అమిత్ షా అన్నారు. ప్రభుత్వం సదుపాయాలను మాత్రమే ఏర్పాటు చేయగలదని, సహకార సంఘాల స్ఫూర్తిని పునరుద్ధరించడం, భవిష్యత్తులో అదే స్ఫూర్తిని పెంపొందించేలా చేయడం, ఇలాంటి సహకార రంగాన్ని సృష్టించడం మన బాధ్యతేనని అన్నారు. సహకార స్ఫూర్తిని పునరుద్ధరించి, సహకార లక్ష్యాల సాధనకోసం అంకిత భావంతో కృషిని కొనసాగించినపుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలుగన్న 5 ట్రిలియన్ల అమెరికన్ డాలర్ల స్థాయికి ఆర్థికవ్యవస్థను చేర్చడంలో సహకార సంఘాలు మరింత గొప్ప పాత్ర పోషిస్తాయని అన్నారు. దేశంలోని 70కోట్ల మంది పేదలను సమ్మిళిత అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములను చేయగలిగే సామర్థ్యం కలిగినది సహకార రంగం మాత్రమేనని కేంద్ర హోమ్, సహకారశాఖల మంత్రి అమిత్ షా అన్నారు.
*****
(Release ID: 1842107)
Visitor Counter : 290