సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఖాదీ కోసం ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఖాదీ’ ద్వారా నాలెడ్జ్ పోర్టల్‌ను ప్రారంభించిన కేవిఐసీ
Posted On:
15 JUL 2022 12:08PM by PIB Hyderabad
ఖాదీ నాలెడ్జ్ పోర్టల్ అనేది ఖాదీ సంస్థలకు డిజైన్ సంబంధిత విషయాలను అందించేందుకు ఏర్పాటు చేయబడింది. దీనిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఖాదీ అభివృద్ధి చేసింది. 14 జూలై 2022న కేవిఐసి ముఖ్య కార్యదర్శి, శ్రీమతి ప్రీతా వర్మ ఈ పోర్టల్‌ని ప్రారంభించారు. ఖాదీ సంస్థలకు మద్దతుగా నిఫ్ట్‌లో ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ కేవిఐసీ ద్వారా ఖాదీ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని ఏర్పాటు చేశారు.
ఖాదీ కోసం ఈ నాలెడ్జ్ పోర్ట్ డిజైన్ పరిజ్ఞానాన్ని ఖాదీ సంస్థల యొక్క విస్తృత విభాగాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఖాదీకి ప్రత్యేకంగా సరిపోయే నూతన ట్రెండ్‌లను సరళీకృతం చేయడం ద్వారా డిజైన్‌ని పోర్టల్ రూపొందిస్తుంది. మొదటి వాల్యూమ్‌లో నాలుగు కథలు/డిజైన్ లను రూపొందించారు. ప్రతి డిజైన్‌కు కీలకమైన థీమ్, రంగుల పాలెట్ మరియు నేసిన డిజైన్‌లు, ప్రింట్లు, అల్లికలు మరియు ఉపరితలం కోసం పలు డిజైన్స్ ఉంటాయి. ప్రతి డిజైన్ రెండు భాగాలుగా విభజించబడింది - ఇల్లు మరియు దుస్తులు. థీమ్‌లతో పాటు, పోర్టల్ సైజ్ చార్ట్‌లు, సిల్హౌట్ బోర్డ్‌లు, బటన్‌లు మరియు క్లోజర్‌లు, ఫినిషింగ్‌లను ఇల్లు మరియు దుస్తులు రెండింటికీ అందిస్తుంది.
వివిధ కాలాలకు ట్రెండ్‌లకు అనుగుణంగా డిజైన్స్‌ను అందించడానికి పోర్టల్‌లో సమాచారం సంవత్సరానికి రెండుసార్లు నవీకరించబడుతుంది. ఖాదీ సంస్థలకు మాత్రమే కాకుండా, ఖాదీ కోసం దుస్తులు, గృహోపకరణాలు మరియు ప్యాకేజింగ్‌ను అభివృద్ధి చేయడానికి మద్దతునిచ్చే సంస్థలకు కూడా సమాచారం విలువైనదిగా ఉంటుంది. ఇండ్ల కోసం మరియు దుస్తులు కోసం అల్లికలు మరియు నిర్మాణాలను సృష్టించే అవకాశాలను అన్వేషించడానికి ఖాదీ నూలు యొక్క వివిధ మందాలను ఉపయోగించి పోర్టల్‌లో వస్త్రాలు ప్రత్యేకంగా చూపబడ్డాయి.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఖాదీ రూపొందించిన వెబ్‌సైట్ www.coek.in ను ఇక్కడ నుంచి చూడవచ్చు.
***
(Release ID: 1842000)
Visitor Counter : 191