ప్రధాన మంత్రి కార్యాలయం
‘ఐ-టు-యు-టు’ సమిట్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగంపాఠం
Posted On:
14 JUL 2022 4:51PM by PIB Hyderabad
శ్రేష్ఠుడు, ప్రధాని శ్రీ లాపీద్,
శ్రేష్ఠుడు, శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్ యాన్,
శ్రేష్ఠుడు, అధ్యక్షుడు శ్రీ బైడెన్,
అన్నిటి కంటే ముందు, ప్రధాని శ్రీ లాపీద్ కు ప్రధాన మంత్రి గా పదవీ బాధ్యతల ను స్వీకరించినందుకు గాను అనేకానేక అభినందన లు, శుభాకాంక్షలూ ను.
ఈ రోజు న శిఖర సమ్మేళనాని కి ఆతిథేయి గా వ్యవహరిస్తున్నందుకు కూడా ను ఆయన కు నేను మనస్ఫూర్తి గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇది సరి అయినటువంటి అర్థం లో వ్యూహాత్మక భాగస్వాముల సమావేశం అని చెప్పాలి.
మనం అందరం మంచి మిత్రులం గా కూడా ఉన్నాం; మరి మన అందరి దృష్టి కోణం లో, అలాగే మన హితాల లో సైతం సమానత్వం ఉంది.
శ్రేష్ఠులారా,
ఈ నా ఈ ఒకటో సమిట్ నుంచే ‘‘ఐ-టు-యు-టు’’ ఒక సకారాత్మకమైన కార్యక్రమ పట్టిక ను ఏర్పరచుకొన్నది.
మనం అనేక రంగాల లో సంయుక్త పథకాల ను గుర్తించాం; మరి వాటి ద్వారా ముందుకు పోయేందుకు ఒక మార్గసూచీ ని కూడా మనం రూపొందించుకొన్నాం.
‘‘ఐ-టు-యు-టు’’ ఫ్రేమ్ వర్క్ లో భాగం గా మనం జలం, శక్తి, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం, ఇంకా ఆహార భద్రత అనేటటువంటి ఆరు కీలక రంగాల లో సంయుక్త పెట్టుబడుల ను పెంపు చేయడాని కి అంగీకరించాం.
‘‘ఐ-టు-యు-టు’’ యొక్క దృష్టి కోణం మరియు కార్యక్రమాల ఆచరణ అనేవి ప్రగతిశీలమైనవి గాను, ఆచరణ సాధ్యమైనవి గాను ఉన్నాయి అనేది స్పష్టం.
మన దేశాల బలాల ను అంటే - పెట్టుబడులు, ప్రావీణ్యం, ఇంకా బజారులు అనే వాటిని కూడగట్టుకొని మనం మన కార్యాచరణ కు గతి ని అందించగలుగుతాం; అలా చేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో మహత్వపూర్ణమైనటువంటి తోడ్పాటు ను అందించగలం.
ప్రపంచం లో అనిశ్చిత స్థితులు పెరుగుతూ ఉన్న నేటి కాలం లో, మన సహకార భరితమైన ఫ్రేమ్ వర్క్ ఆచరణ సాధ్యమైనటువంటి సహకారాని కి ఒక చక్కని నమూనా గా కూడా ఉంది.
‘‘ఐ-టు-యు-టు’’ లో మనం ప్రపంచ స్థాయి లో శక్తి సంబంధిత భద్రత, ఆహార భద్రత, మరియు ఆర్థిక వృద్ధి ల కోసం చెప్పుకోదగినటువంటి తోడ్పాటు ను అందించ గలుగుతామని నాకు పూర్తి విశ్వాసం ఉన్నది.
మీకు ఇవే ధన్యవాదాలు.
అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి రమారమి అనువాదం. సిసలు ఉపన్యాసం హిందీ భాష లో సాగింది.
***
(Release ID: 1841816)
Visitor Counter : 186
Read this release in:
Odia
,
Assamese
,
English
,
Hindi
,
Marathi
,
Punjabi
,
Gujarati
,
Urdu
,
Bengali
,
Manipuri
,
Tamil
,
Kannada
,
Malayalam