నీతి ఆయోగ్
సిఇఒగా పరిమేశ్వరన్ అయ్యర్‌ను స్వాగతించిన నీతి ఆయోగ్
Posted On:
11 JUL 2022 4:06PM by PIB Hyderabad
నీతి ఆయోగ్ సిఇఒగా శ్రీ పరమేశ్వరన్ అయ్యర్‌ను ఆహ్వానించిన నీతి ఆయోగ్.
జలం, పారిశుద్ధ్య రంగంలో 25 ఏళ్ళ అనుభవంతో, సురక్షిత పారిశుద్ధ్యాన్ని 550 మిలియన్ల మంది ప్రజలకు విజయవంతంగా అందుబాటులోకి తెచ్చిన భారత ప్రభుత్వ 20 బిలియన్ల ప్రతిష్ఠాత్మక స్వచ్ఛ భారత్ మిషన్ అమలుకు అయ్యర్ నేతృత్వం వహించారు.
ఈసారి నీతి ఆయోగ్ సిఇఒగా దేశానికి సేవ చేసే అద్భుతమైన అవకాశం లభించడం గౌరవప్రదంగా భావిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత దేశ పరివర్తన దిశగా పని చేసేందుకు మరొక అవకాశాన్ని కల్పించినందుకు మనసు లోతుల నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అయ్యర్ అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ కేడర్‌కు చెందిన అయ్యర్ 1981వ బ్యాచ్ ఐఎఎస్ అధికారిగా అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు రంగాలలో పని చేశారు. కేంద్ర తాగు నీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా న్యూఢిల్లీలో 2016-20 మధ్య కాలంలో ఉన్నారు.
***
(Release ID: 1840836)
Visitor Counter : 281