గనుల మంత్రిత్వ శాఖ
విజయవంతంగా గనులను వేలం వేసినందుకు ప్రోత్సాహకాలను అందుకోనున్న రాష్ట్రాలు - మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి
గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎకెఎఎం ప్రతిష్ఠాత్మక వారోత్సవాలు ప్రారంభం
Posted On:
11 JUL 2022 12:29PM by PIB Hyderabad
గనులను విజయవంతంగా వేలం వేసిన, సంభావ్య ఖనిజ బ్లాకులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు కేంద్ర బొగ్గు, గనుల, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ చెప్పారు. గనుల రంగంలో మరింత మెరుగైన పనితీరు చూపేలా ఇది ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తినిస్తుందని ఆయన అన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించనున్న గనులు & ఖనిజాలపై జాతీయ సదస్సులో విజయవంతమైన రాష్ట్రాలకు రివార్డులు అందజేయనున్నట్టు ఆయన తెలిపారు.
గనుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత మహోత్సవ్ ప్రతిష్ఠాత్మక వారోత్సవాలను మంగళవారం ఇక్కడ శ్రీ ప్రహ్లాద్ జోషీ ఆరంభించారు. ఒకరోజు జరుగనున్న జాతీయ సదస్సులో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆయన చెప్పారు.
ఈ ప్రతిష్ఠాత్మక వారోత్సవాలను దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలు / మంత్రిత్వ శాఖ ఆధీన కార్యాలయాలు 11 నుంచి 17 జులై వరకు జరుపుకుంటాయని ఎకెఎఎం ప్రతిష్ఠాత్మక వారోత్సవాలలో పాలుపంచుకున్న గనుల శాఖ కార్యదర్శి శ్రీ అలోక్ టాండన్ తెలిపారు.

***
(Release ID: 1840819)
Visitor Counter : 158