సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతదేశంలో కొత్త పని సంస్కృతిని ప్రవేశపెట్టారు: ఇందులో పేదల అనుకూల ప్రజా సంక్షేమ పథకాలన్నీ కులం, మతం లేదా ఓటుతో సంబంధం లేకుండా అత్యంత పేద లేదా వరుస లోని చివరి మనిషికి చేరుకునే విధంగా రూపొందించబడ్డాయి. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


సమకాలీన భారతదేశ అభివృద్ధికి అనుగుణంగా తమ స్వంత జీవనోపాధిని సంపాదించగల సామర్థ్యం కలిగిన స్టార్టప్ లను మోదీ నిరంతరం ప్రోత్సహించారు:

యూపీలోని మొరాదాబాద్ లో విలేకరుల సమావేశంలో పాల్గొన్న డాక్టర్ జితేంద్ర సింగ్: ఎనిమిది సంవత్సరాల స్వల్ప వ్యవధిలో, కేంద్రం అనేక పథకాలను 100% గరిష్ట స్థాయికి దగ్గరగా తీసుకురాగలిగింది.

గరీబ్ కల్యాణ్ అన్న యోజన, జన్ ధన్, ఉజ్వల, సౌచలయ, పీఎం ఆవాస్, హర్ ఘర్ జల్, హర్ ఘర్ బిజ్లీ, ఆయుష్మాన్ వంటి గేమ్ ఛేంజర్ పథకాలు మోదీని పేదలు, అణగారిన వర్గాల ఛాంపియన్ గా నిలిపాయి: డాక్టర్ జితేంద్ర సింగ్

నాడు పోస్టు చేయడమైనది: 10 JUL 2022 5:36PM by PIB Hyderabad

భారతదేశంలో ఒక కొత్త పని సంస్కృతిని ప్రవేశపెట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎల్లప్పుడూ దక్కుతుందని కేంద్ర సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) సైన్స్ అండ్ టెక్నాలజీ , ఎర్త్ సైన్సెస్ శాఖల  సహాయ మంత్రి (స్వతంత్ర హోదా ) , పీఎంవో, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.యూపీలోని మొరాదాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిని కులం, మతం, మతం లేదా ఓటు పరిగణనతో సంబంధం లేకుండా చిట్టచివరి నీరు పేద వరకు ప్రతి ఒక్కరికీ అందేలా రూపొందించినట్టు తెలిపారు. అదేవిధంగా, సమకాలీన భారతదేశం అభివృద్ధి నీ పరిగణనలోకి తీసుకొని, తమ స్వంత జీవనోపాధిని సంపాదించగల సామర్థ్యం కలిగిన స్టార్టప్ లను ప్రధానమంత్రి శ్రీ మోదీ నిరంతరం ప్రోత్సహించారని ఆయన అన్నారు.

గతంలో అవసరం తీరని చోట అవసరాలను తీర్చడానికి , అలాగే గతంలో న్యాయం నిరాకరించబడిన చోట న్యాయం అందించడానికి.పూర్తిగా ఆబ్జెక్టివ్ పారామితులను అనుసరించామని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.ఇది, కాంగ్రెస్ దాని మిత్రపక్ష ప్రభుత్వాలు అనుసరించిన గత పద్ధతికి చాలా వ్యతిరేకమని, అందులో ఓటు బ్యాంకు రాజకీయాలు రాష్ట్ర ప్రయోజనాలను ఎంపిక చేయడాన్ని ముందే నిర్ణయించాయని ఆయన అన్నారు.

ఇది కాంగ్రెస్, దాని అనుబంధ ప్రభుత్వాలు అనుసరించిన గత ఆచారానికి పూర్తిగా భిన్నమైనదని, విధానంలో ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రభుత్వ ప్రయోజనాలను ఎంపిక చేసి విడుదల చేయడాన్ని ముందుగానే నిర్ణయించాయని ఆయన అన్నారు.అందరికీ న్యాయం అనే సూత్రం ఆధారంగా మోడీ విజయవంతంగా ప్రజా పంపిణీ ప్రమాణాలను ఓట్ల పరిశీలనకు మించి పెంచారు, ఆపై ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారనే  నిర్ణయాన్ని ప్రజలకే వదిలేశారు, మునుపటి ఎన్నికల కంటే చాలా ఎక్కువ మెజారిటీతో మోదీ ప్రభుత్వాన్ని రెండవసారి గెలిపించడం ద్వారా ప్రజలు కూడా విధానాన్ని ఆమోదించారు అని ఆయన అన్నారు.

పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, సోచలయ వంటి పౌర కేంద్రిత పథకాలు సౌకర్యాలు కొరవడిన ప్రతి ఇంటికి చేరాయని, కుటుంబం మతానికి లేదా కులానికి చెందినది, లేదా గత ఎన్నికల్లో రాజకీయ పార్టీకి ఓటు వేశారో అధికారులు ఎప్పుడూ అడగలేదని కేంద్ర మంత్రి అన్నారు. కొత్త పని సంస్కృతి భారత రాజకీయాల్లో ఒక కొత్త ప్రమాణంగా మారుతుందని, ప్రతి రాజకీయ పార్టీ కూడా దీనిని అనుసరించాలని ప్రజలు ఆశిస్తారని ఆయన అన్నారు.ఎనిమిది సంవత్సరాల స్వల్ప వ్యవధిలో, కేంద్రం అనేక పథకాలను 100% పరిపూర్ణతకు దగ్గరగా తీసుకురాగలిగింది "సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్" అనే సూత్రాన్ని అనుసరించడం ద్వారా అర్హులైన వారికి ప్రయోజనాలు అందించబడ్డాయి‘‘ అని ఆయన అన్నారు.

గరీబ్ కల్యాణ్ అన్నా యోజన, జన్ ధన్, ఉజ్వల, సౌచలయ, పీఎం ఆవాస్, హర్ ఘర్ జల్, హర్ ఘర్ బిజ్లి, ఆయుష్మాన్ వంటి గేమ్ ఛేంజర్ పథకాల వల్ల దేశ ప్రజలు మోదీ ప్రభుత్వంపై కేంద్రంతో పాటు చాలా రాష్ట్రాల్లోనూ పదే పదే విశ్వాసం ఉంచారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.బుజ్జగింపు విధానం ప్రబలంగా ఉన్నప్పుడు గతంలో మాదిరిగా కాకుండా ఎలాంటి వివక్ష లేకుండా సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలు పొందుతున్నారని ఆయన అన్నారు. సంక్షేమ చర్యలు కోట్లాది మంది ప్రజలను

తీవ్రమైన పేదరికం బారి నుంచి బయటకు తీసుకువచ్చి, వారికి గౌరవ ప్రదమైన జీవితాన్ని అందించాయని మంత్రి ఉద్ఘాటించారు.

సంక్షేమ పథకాల లబ్ధిదారులు అన్ని కులాలు, మతాలకు చెందిన వారని, ఎందుకంటే లబ్ధిదారుల జాబితాలు పూర్తి నిష్పాక్షికతతో, పక్షపాతం లేకుండా తయారు చేయబడ్డాయని, మునుపటి ప్రభుత్వాల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులు కులం వారో, మతం వారో తెలుసు కునెలా ఉండేవని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. గ్రామీణ ఉపాధి పథకంతో పాటు ఇతర పథకాలు నిరుపేదల జీవితాలను మార్చాయని, వారి జీవన ప్రమాణాలను గౌరవ స్థాయికి పెంచడానికి దోహదపడ్డాయని మంత్రి తెలిపారు. పారదర్శకమైన ,సమర్థవంతమైన డెలివరీ మెకానిజం ద్వారా ఎటువంటి లీకేజీలు లేకుండా పూర్తి ప్రయోజనాలు నేరుగా అవసరమైన వారికి చేరుతున్నాయని మంత్రి నొక్కి చెప్పారు.

ఈశాన్య ప్రాంతాన్ని ఉదాహరణగా చూపిస్తూ, 2014కు ముందు, వరుస కేంద్ర ప్రభుత్వాల మయోపిక్ విధానాల కారణంగా ప్రాంతం ఆర్థికంగా నష్టపోయిందని, అయితే 2014 లో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే, దేశంలోని మరింత అభివృద్ధి చెందిన ప్రాంతాలతో సమానంగా ఈశాన్య ప్రాంతాన్ని l తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.

గత ఎనిమిదేళ్ళలో అభివృద్ధి అంతరాలను విజయవంతంగా పూడ్చడlమే కాకుండా, ఈశాన్య ప్రాంతం కూడా మానసిక ఆత్మవిశ్వాసాన్ని పొందిందని ఆయన అన్నారు

రోడ్డు, రైలు, విమాన కనెక్టివిటీ పరంగా గణనీయమైన అభివృద్ధి ప్రాంతం అంతటా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సరుకులు ,ప్రజల రవాణాను సులభతరం చేయడానికి దోహదపడుతోందని ఆయన అన్నారు.

మిజోరం గురించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ బిజెపికి వ్యతిరేకమని, కానీ ఎటువంటి వివక్ష లేకుండా, ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానంతో  మిజోరాంలో సిట్రస్ ఫ్రూట్ "సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేయించిందని జితేంద్ర సింగ్ తెలిపారు.సిట్రస్ ఫ్రూట్ సెంటర్ భారతదేశంలో ఒక ప్రత్యేకమైన సంస్థగా ఆవిర్భవించిందని, ఇది మిజోరాంలో ఉన్నప్పటికీ, మొత్తం ఈశాన్య ప్రాంతం lవాస్తవానికి మొత్తం దేశానికి సేవలందిస్తుందని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2015 లో ఎర్ర కోట నుండి "స్టార్ట ప్ ఇండియా స్టాండప్ ఇండియా" కోసం ఇచ్చిన పిలుపుతో మొద లైన ఉత్తేజం కారణంగా, భారత దేశంలో

స్టార్టప్ సంఖ్య 300 -400 నుంచి 70,000 కు పెరిగిందని, ఇది వివిధ స్టార్టప్ లలో కెరీర్ ను కొనసాగించాల ని కోరుకునే ఉత్తర ప్రదేశ్ యువత కు ఎంతో ఆసక్తి కలిగి ఉందని డాక్ట ర్ జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు. భారతదేశంలో 100 కి పైగా యునికార్న్లు ఉన్నాయి.బయోటెక్ స్టార్టప్ లు కూడా పెరుగుతున్నాయి.

స్టార్టప్ కు ఇంకా ఉన్న విస్తారమైన అన్వేషించబడని మార్గాలు సాంకేతిక పరిజ్ఞానం , స్టార్టప్ లకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక మద్దతు గురించి యువత లో అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని మంత్రి నొక్కి చెప్పారు.

ఎనిమిదేళ్ళ మోదీ ప్రభుత్వం దేశంలో 'యువ lక్తి', 'నారీ శక్తి' కు ఒక కొత్త వెలుగును దిశా నిర్దేశాన్ని కల్పించి వారి ఆకాంక్షలు, లక్ష్యాలకు ప్రాధాన్యతను కల్పిస్తోందని డాక్ట ర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.

 

*****


(రిలీజ్ ఐడి: 1840688) సందర్శకుల సూచీ సంఖ్య : : 183
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Tamil