రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
నాగ్‌పూర్‌లో ప్రపంచ రికార్డు - ఏక వరుస స్తంభాల మద్దతుతో హైవే ఫ్లైఓవర్ & మెట్రో రెయిల్ మార్గంతో పొడవైన డబుల్ డెక్కర్ వంతెన నిర్మాణం
प्रविष्टि तिथि:
10 JUL 2022 8:15PM by PIB Hyderabad
మరొక ప్రపంచ రికార్డు ! ఒకే వరుస స్తంభాల మద్దతుతో హైవే ఫ్లై ఓవర్ & మెట్రోరెయిల్ మార్గంతో పొడవైన డబుల్ డెక్కర్ వంతెన (3.14 కిమీ)ను నాగ్‌పూర్ నిర్మించి ప్రపంచ రికార్డు సాధించినందుకు మహారాష్ట్ర మెట్రో బృందానికి& ఎన్‌హెచ్ఎఐ బృందానికి అభినందనలు అంటూ కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ట్వీట్‌ల పరంపరలో కొనియాడారు.
నాగ్‌పూర్‌లో డబుల్ డెక్కర్ వయాడక్ట్‌పై గరిష్ట మెట్రో స్టేషన్లను నిర్మించడాన్ని ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ & ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించాయని, ఇది మొత్తం దేశానికే గర్వకారణమైన క్షణమని అన్నారు.
ఈ రోజును సాకారం చేసేందుకు పగలు రాత్రి పట్టుదలతో కృషి చేసిన అద్భుతమైన ఇంజినీర్లు, అధికారులు, కార్మికులకు శ్రీ గడ్కరీ కృతజ్ఞతలు తెలిపారు. నవ భారతదేశంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మిస్తామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన వాగ్ధాన అమలుకు ఈ అభివృద్ధి నిదర్శనమని ఆయన అన్నారు.
***
(रिलीज़ आईडी: 1840649)
आगंतुक पटल : 272