గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గనులు, ఖనిజాలపై 6వ జాతీయ సదస్సు నిర్వహించనున్న గనుల మంత్రిత్వ శాఖ


ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వారోత్సవాల్లో భాగంగా న్యూఢిల్లీలో నిర్వహించనున్న సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా

Posted On: 09 JUL 2022 10:41AM by PIB Hyderabad

ఆజాదీ కా  అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వారోత్సవాల్లో  భాగంగా గనులుఖనిజాలపై 6  జాతీయ సదస్సును గనుల మంత్రిత్వ శాఖ   2022 జూలై 12న న్యూఢిల్లీలో నిర్వహించనున్నది.  డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగే ఈ సదస్సుకు కేంద్ర హోంమంత్రి శ్రీ. అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గనులుబొగ్గు మరియు రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ రావుసాహెబ్ పాటిల్ దాన్వేగనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అలోక్ టాండన్ మరియు మంత్రిత్వ శాఖ ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో కేంద్ర గనులుబొగ్గు మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఒకరోజు సదస్సును  ప్రారంభిస్తారు.

 మైనింగ్ రంగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు జాతీయ స్థాయి అవార్డు రాష్ట్రీయ ఖనిజ్ వికాస్ పురస్కారం , మైనింగ్ టెనిమెంట్ సిస్టమ్ (MTS)  మూడు మాడ్యూళ్లను ప్రారంభించడం, 2020-21 సంవత్సరానికి 5-స్టార్ రేటెడ్ గనులకు అవార్డులు, నేషనల్ జియో సైన్స్ అవార్డు-2019 ప్రదానం  వంటివి ఈ సదస్సులో  కొన్ని ముఖ్యాంశాలు. సదస్సు ప్రారంభ కార్యక్రమంలో  భాగంగా నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ (NMET) ద్వారా సాంకేతిక సదస్సు  మరియు గనుల తవ్వకంలో  ఆటోమేషన్‌పై సదస్సు జరుగుతుంది. సదస్సులో భాగంగా జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో భారతదేశం గనుల రంగానికి సంబంధించి వివిధ అంశాలపై  వివిధ మైనింగ్ సంస్థల సీఈవోలు చర్చలు జరుపుతారు. 

మధ్యాహ్నం జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలకు  మరియు బొగ్గు మంత్రిత్వ శాఖకు కొత్త మైన్ బ్లాకులను అందిస్తుంది. మైనింగ్ బ్లాకులను గుర్తించి వాటిని విజయవంతంగా వేలం వేసిన రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలను అందిస్తారు.  డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (DMF) కింద లక్ష్యాల మేరకు పనిచేస్తున్న జిల్లాలు సాధించిన విజయాలను  ప్రదర్శిస్తాయి. గత 75 సంవత్సరాలలో అన్వేషణ మరియు మైనింగ్ అభివృద్ధిలో సాధించిన ప్రగతి, అభివృద్ధి  డిజిటల్ విధానంలో ప్రదర్శించబడుతుంది. మైనింగ్ రంగంలో చేపట్టిన సంస్కరణలను వివరించే భారీ డిజిటల్ బుక్‌లెట్ సదస్సులో మరో ఆకర్షణ గా ఉంటుంది. 

గనుల మంత్రిత్వ శాఖ 2016 నుంచి జాతీయ స్థాయిలో మైనింగ్ సదస్సులు నిర్వహిస్తోంది. విధాన నిర్ణయాలు తీసుకునే కేంద్ర ప్రభుత్వ అధికారులు,   రాష్ట్ర ప్రభుత్వ అధికారులువేలం ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొనే కార్యనిర్వాహకులుపరిశ్రమలు మరియు పరిశ్రమ సంఘాలు వంటి వివిధ వాటాదారుల మధ్య పరస్పర చర్చకు వేదికను అందించాలనే లక్ష్యంతో ఈ సదస్సులకు గనుల మంత్రిత్వ శాఖ శ్రీకారం చుట్టింది. గనులు, ఖనిజాలపై జరిగే జాతీయ స్థాయి సదస్సు ప్రభుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణయాలను వెల్లడించి,ఖనిజ రంగ అభివృద్ధికి అమలు చేయాల్సిన అంశాలపై సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకుని, వాటి ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకునే అంశంలో ప్రభుత్వానికి సహకారం అందించడంలో విజయవంతం అవుతున్నాయి. 

***


(Release ID: 1840543) Visitor Counter : 147