ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఇండియా స్టాక్ నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్ 2022
ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, వాణిజ్యం, ఆర్థిక సమ్మిళితం, డిజిటల్ ఐడెంటిటీ, డేటా ఎంపవర్ మెంట్ , సుపరిపాలన రంగాలలో భారతదేశ డిజిటల్ ఉత్పత్తులు, సేవల ప్రదర్శన
విజ్ఞాన మార్పిడి కోసం 53 దేశాల నుండి 5000 మందికి పైగా పాల్గొనేవారిని ఒకచోట చేర్చే వర్చువల్ ఈవెంట్
పట్టణ , గ్రామీణ జనాభా స్థాయిలో విజయవంతమైన ప్రాజెక్టులకు నాయకత్వం వహించడంలో కీలక పాత్ర పోషించేలా
భారతదేశ డిజిటల్ మార్పు మార్గదర్శకులతో థీమాటిక్ సెషన్లు
Posted On:
08 JUL 2022 12:16PM by PIB Hyderabad
డిజిటల్ ఇండియా వీక్ 2022 వేడుకల్లో భాగంగా, భారత విజ్ఞాన సంపద మార్పిడి పై మూడు రోజుల వర్చువల్ ఈవెంట్ 2022 జూలై 7న ప్రారంభమైంది. భారతదేశ 1.4 బిలియన్ల జనాభాను డిజిటల్ శకం లోకి తీసుకురావడానికి ఏకీకృత సాఫ్ట్ వేర్ ప్లాట్ ఫారమ్ అయిన ఇండియా స్టాక్- డిజిటల్ ప్రపంచానికి భారతదేశ అత్యంత కీలకమైన సహకారాన్ని ప్రదర్శించడానికి ఈ కార్యక్రమం ఒక అవకాశం. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్యాన్ని చూసింది. భారతదేశంలో డిజిటల్ మార్పు కు దోహదపడుతున్న ఇండియా స్టాక్ ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్‌లకు ఓరియంటేషన్ ఇవ్వడం లక్ష్యం. ఇండియాస్టాక్.గ్లోబల్ ను గౌరవ ప్రధాన మంత్రి 4, జూలై 2022న ప్రారంభించారు, ఇది ఇండియా స్టాక్ పై ఉన్న అన్ని ప్రధాన ప్రాజెక్టుల ఏకైక భాండాగారం.
ప్రారంభ సెషన్ లో మూడు రోజుల కార్యక్రమం సందర్భాన్ని కేంద్ర ఎం ఇ ఐ టి వై కార్యదర్శి శ్రీ అల్కేష్ కుమార్ శర్మ ప్రస్తావిస్తూ, గత ఎనిమిది సంవత్సరాలలో భారత దేశ డిజిటల్ మార్పు సవాలుతో కూడిన ఇంకా ప్రతిఫలదాయకమైన ప్రయాణం గురించి వివరించారు. ఈ ప్రయాణం డిజిటల్ టెక్నాలజీలలో భారతదేశం నాయకత్వానికి , జనాభా స్థాయిలో డిజిటల్ మార్పు ప్రాజెక్టులను అమలు చేయడంలో దాని అనుభవానికి ఫలవంతమైంది.
నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ డైరెక్టర్ జనరల్ శ్రీ రాజేష్ గెరా, ఆధార్ , మొబైల్ ను రెండు సేవలుగా విపులీకరించారు, ఇది గ్రామీణ లేదా పట్టణ ప్రాంతాలలో, జీవన సౌలభ్యానికి, గ్రామీణ /పట్టణ ప్రాంతాలలోని అంతిమ వినియోగదారుని చేరుకోవడానికి, సుపరిపాలనకు దోహదపడింది.
నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ అధ్యక్షుడు, సి ఇ ఓ శ్రీ అభిషేక్ సింగ్, ప్రముఖ వక్తలందరినీ స్వాగతించారు, ప్రతి వక్త దేశంలో జనాభా స్థాయిలో డిజిటల్ మార్పు ప్రాజెక్టులను అమలు చేసిన ఒక మార్గదర్శకుడు, నిజమైన అభ్యాసకుడు అనే వాస్తవాన్ని పునరుద్ఘాటించారు,
మొదటి సెషన్ ఇండియా స్టాక్ ప్రధాన 'ఉత్పత్తి అయిన ఆధార్'పై జరిగింది. యూఐడీఏఐ వ్యవస్థాపక సీఈఓ డాక్టర్ ఆర్.ఎస్.శర్మ, యూఐడీఏఐ సీఈఓ డాక్టర్ సౌరభ్ గార్గ్, యూఐడీఏఐ మాజీ చీఫ్ ఆర్కిటెక్ట్ అండ్ అడ్వైజర్ డాక్టర్ ప్రమోద్ వర్మ, ప్రొటీన్ ఈగోవ్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ సురేశ్ సేథి మొదలైన వక్తలు ఇందులో ఉన్నారు. ఈ సెషన్ ను డాక్టర్ సౌరభ్ గార్గ్ మోడరేట్ చేశారు. విభిన్న జనాభా యొక్క అన్ని సవాళ్లను పరిగణనలోకి తీసుకొని ఆధార్ పరిణామం గురించి ఇందులో మాట్లాడారు. ఈ సవాళ్లను అధిగమించడం ద్వారా ఆధార్ పౌరులకు, ముఖ్యంగా అత్యంత అట్టడుగు, నిరుపేద వర్గాలకు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల సబ్సిడీలు, ప్రయోజనాలు , ఇతర సేవలను నిరంతరాయంగా అందించడం ద్వారా జీవన సౌలభ్యాన్ని కల్పించింది.
ఆధార్ బహుళ బిల్డింగ్ బ్లాక్ లకు కూడా పునాదిగా ఉంది. డిజిటల్ ఐడెంటిటీ, పేమెంట్స్, డేటా ఎంపవర్ మెంట్ , ఓపెన్ ఎకోసిస్టమ్స్ కోసం దేశవ్యాప్తంగా 17కు పైగా లావాదేవీ స్టాక్ లను ప్రారంభించారు.
‘యుపిఐ: లీడింగ్ డిజిటల్ పేమెంట్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా' అనే అంశంపై జరిగిన రెండో సెషన్ లో ఎం ఇ ఐ టి వై అదనపు కార్యదర్శి శ్రీ. అమిత్ అగర్వాల్ పాల్గొన్నారు, ఆయన సెషన్ కి మోడరేటర్ గా వ్యవహరించారు. ప్రైవసీ, వినియోగదారుల రక్షణ , సంభావ్య రిస్క్ మేనేజ్ మెంట్ అంశాలను దృష్టిలో ఉంచుకొని, జనాభా స్థాయిలో సమ్మిళిత ప్రజాస్వామిక పరిష్కారాలను ధృవీకరించే డిజిటల్ ఇండియా కార్యక్రమాలను ఆయన ప్రధానంగా వివరించారు. శ్రీ. దిలీప్ అస్బే, ఎన్ సి పి ఐ ఎం డి. అండ్ సి ఇ ఓ , శ్రీ సుధాన్షు ప్రసాద్, ఆర్ బి ఐ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, యుపిఐ డిజిటల్ చెల్లింపులలో కొత్త ఇన్నోవేషన్ గురించి , దేశంలో ప్రజలు చెల్లింపులు జరిపే విధంగా వాలెట్లు ఎలా విప్లవాత్మకంగా మారాయో వివరించారు.
గత దశాబ్దంలో భారతదేశ పేమెంట్ ల్యాండ్ స్కేప్ వాల్యూమ్ (సిఎజిఆర్ 50%) , విలువ (సిఎజిఆర్ 6%) ద్వారా డిజిటల్ చెల్లింపులకు సంబంధించి అత్యంత అధునాతన చెల్లింపు వ్యవస్థగా అభివృద్ధి చెందింది.
టెక్నాలజీ స్టాక్ ద్వారా విద్యారంగంలో భారతదేశం సాధించిన విజయాలను తెలిపేందుకు ఒక సమాంతర సెషన్ ను కూడా నిర్వహించారు. ఈ సెషన్ లో సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అమరేంద్ర పి.బెహరా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ శ్రీ విజయ్ కిరణ్ ఆనంద్, స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ (డిజిటల్ ఎడ్యుకేషన్), డిపార్ట్ మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ డిపార్ట్ మెంట్ శ్రీ రజనీష్ కుమార్ , ఎన్ సిఈఆర్ టి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏంజెల్ రత్నాబాయి పాల్గొన్నారు. శ్రీ. రజనీష్ కుమార్ నిర్వహించిన ఈ సెషన్ నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ (ఎన్ డి ఇ ఏ ఆర్) ) ప్రాముఖ్యతను , దాని సమ్మిళిత, , భద్రత పరంగా గోప్యత , డిజైన్ గురించి వివరించింది. పబ్లిక్, ప్రైవేట్ వాటాదారులు, ,, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహా భాగస్వాములం అంతా అభ్యసన పథంలో ఉత్పాదకంగా నిమగ్నం అయ్యేవిధంగా ఎన్ డిఇఆర్ ఇంటర్ ఆపరేటబుల్ గా ఉంటుంది. అలాగే, ఫ్రేమ్ వర్క్ జీవితకాల రికార్డులను కలిగి ఉండేలా రూపొందించబడింది, తద్వారా అభ్యసనలు భవిష్యత్తులో లీవరేజ్ చేయబడతాయి. అభ్యసన ప్రయాణంలో అంగన్ వాడీ, స్కూళ్లు, నైపుణ్యాలు , ఉన్నత విద్య ఉంటాయి, ఇవన్నీ కలిసి పనిచేస్తాయి, ఇది ప్రీ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్థి కి అంతరాయం లేని పురోగతిని అందిస్తుంది.
కాగిత రహిత పాలన , మరియు డేటా ఎంపవర్ మెంట్ పై చివరి థీమాటిక్ సెషన్ జరిగింది. దీనిని ఎన్ ఈ జి డి ప్రెసిడెంట్ అండ్ సిఇఒ శ్రీ అభిషేక్ సింగ్ మోడరేట్ చేశారు. ప్రసంగించిన వారిలో ఎన్ ఈ జి డి అడిషనల్ డైరెక్టర్ శ్రీ అమిత్ జైన్, నీతి ఆయోగ్ సీనియర్ అడ్వైజర్ శ్రీమతి అన్నా రాయ్, డిఇపిఎ ఓపెన్ సోర్స్ ప్రోటోకాల్ డెపా.గ్లోబల్ లీడ్ శ్రీ సిద్ధార్థ్ శెట్టి , అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎంటర్ ప్రైజ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ శ్రీ అమిత్ సావంత్ ఉన్నారు. డేటా ఎంపవర్ మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆర్కిటెక్చర్ (డిఇపిఎ) ప్రాముఖ్యత ను భారతదేశంలోని పౌరులందరికీ ఆర్థిక శ్రేయస్సు దిశగా డేటా సాధికారత కోసం ఒక సముచిత వ్యూహంగా వివరించారు. అందుకే ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పిఎంజెడివై) కింద, ఖాతాలు ఆన్ లైన్ లో ఉంటాయlని, రూపే డెబిట్ కార్డు లేదా ఆధార్ ఎనేబుల్డ్ సిస్టమ్ (ఏ ఈ పి ఎస్) ద్వారా ఇంటర్ ఆపరేబిలిటీ ఉంటుందనీ చెప్పారు. కెవైసి/ఇ-కెవైసి ఫార్మాలిటీస్ ఇప్పుడు చాలా సులభం. డేటా సంరక్షణ, భాగస్వామ్యం, అంగీకారం , గోప్యత కు డి ఇ పి ఎ వీలు కల్పిస్తుంది. పౌరులు తమ డేటాను అంతరాయం లేకుండా , సురక్షితంగా యాక్సెస్ చేసుకోవచ్చు . ఇంకా దానిని తృతీయపక్ష సంస్థలతో పంచుకోవచ్చు.
ఇండియా స్టాక్ హైలైట్, మంచి డేటా గవర్నెన్స్‌ని లక్ష్యంగా చేసుకున్న ఎపిఐ సేతు, ఇతర ఇ-గవర్నెన్స్ అప్లికేషన్‌లు , సిస్టమ్‌లతో శీఘ్ర ,పారదర్శక సాఫ్ట్‌వేర్ ఇంటిగ్రేషన్‌ను ప్రారంభించే అంశాలను కూడా ప్యానెల్ చర్చించింది.
వర్చువల్ ఈవెంట్ మొదటి రోజు విజయవంతంగా 19 మంది ప్రముఖ వక్తలతో ముగిసింది - వారంతా సంబంధిత థీమాటిక్ రంగాలలో నిపుణులు.53 దేశాలలో 5000 మందికి పైగా రిజిస్టర్డ్ పార్టిసిపెంట్లకు వారు తమ అనుభవం , విజ్ఞానాన్ని అందించారు.
అన్ కనెక్ట్ చేయబడ్డ వారిని కనెక్ట్ చేయడం లక్ష్యంగా రెండవ రోజున స్కిల్లింగ్ , డిజిటల్ ఇంక్లూజన్ కోసం హెల్త్ స్టాక్, అగ్రిస్టాక్, టెక్నాలజీ స్టాక్ పై థీమాటిక్ సెషన్ లు జరుగుతాయి- ప్రభుత్వం, పరిశ్రమలు , అకాడెమియా నుండి జాతీయ , అంతర్జాతీయ అభ్యాసకులు 5654 మందికి పైగా రిజిస్టర్డ్ పార్టిసిపెంట్స్ తో ఈ సెషన్ లు నిర్వహిస్తారు. గ్లోబల్ డిజిటల్ ప lబ్లిక్ గూడ్స్ రిపోజిటరీకి భారత దేశం అందించిన తోడ్పాటు గురించి మాట్లాడేందుకు ఈ
కార్య క్రమం ఒక నాలెడ్జ్ ఎక్స్ ఛేంజ్ వేదిక గా దోహదపడింది.
***
(Release ID: 1840164)
Visitor Counter : 233