ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
స్వదేశీ సాంకేతికత పరిజ్ఞానం తో ఈ-రిక్షాల కోసం ఐఐటీ ఖరగ్‌పూర్ అభివృద్ధి చేసిన బి ఎల్ డి సి మోటార్ మరియు స్మార్ట్ కంట్రోలర్ వాణిజ్య ఉత్పత్తి కోసం బదిలీ
విద్యుత్ వాహనాల ఉప వ్యవస్థలను స్వదేశంలో అభివృద్ధి చేయాలన్న లక్ష్య సాధన దిశలో సాంకేతికత పరిజ్ఞానం అభివృద్ధి
Posted On:
06 JUL 2022 11:28AM by PIB Hyderabad
విద్యుత్ వాహనాల కోసం వినియోగిస్తున్న ఉపకారణాల్లో 90% ఉపకరణాలు ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న మోటార్/కంట్రోలర్/ కన్వర్టర్/బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్/ఛార్జర్ లాంటి ఉపకరణాలు దేశ పర్యావరణ పరిస్థితులు, రహదారులు, ట్రాఫిక్ పరిస్థితులకు అనుకూలంగా లేవు. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశంలో దేశ పరిస్థితులకు అనుగుణంగా ఉపకరణాలను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా దేశంలో వినియోగంలో ఉన్న 80% పైగా వాహనాలకు అవసరమైన 2 డబ్ల్యు/ 3 డబ్ల్యు ఉత్పత్తికి అవసరమైన సాంకేతికత పరిజ్ఞానం అభివృద్ధి చేయబడింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈ- రిక్షాలకు అవసరమైన బి ఎల్ డి సి మోటార్ మరియు స్మార్ట్ కంట్రోలర్ ను ఐఐటీ ఖరగ్‌పూర్ అభివృద్ధి చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఐఐటీ ఖరగ్‌పూర్ అభివృద్ధి చేసిన మోటార్ మరియు స్మార్ట్ కంట్రోలర్ సమర్ధంగా పనిచేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా సర్టిఫికెట్ కలిగి ఉంటుంది. మోటార్ మరియు స్మార్ట్ కంట్రోలర్ వాణిజ్య ఉత్పత్తులు ప్రారంభించేందుకు నిన్న జరిగిన కార్యక్రమంలో మెస్సర్స్ బ్రష్లెస్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు సాంకేతికత పరిజ్ఞానం బదిలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఆల్కేష్ కుమార్ శర్మ, అదనపు కార్యదర్శి డాక్టర్ జైదీప్ కుమార్ మిశ్రా, మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్స్ పరిశోధన అభివృద్ధి గ్రూప్ కోఆర్డినేటర్ శ్రీమతి సునీతా వర్మ, ఐఐటీ ఖరగ్‌పూర్ కి చెందిన డాక్టర్ సోమనాథ్ సేన్‌గుప్తా, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సైంటిస్ట్ డి శ్రీ ఓం క్రిషన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా వారోత్సవాలను ప్రారంభించిన సందర్భంగా సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కార్యక్రమం ఏర్పాటయింది.
***
(Release ID: 1839562)
Visitor Counter : 224