రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

2023 మార్చి నాటికి పూర్తి కానున్న పూణే-సతారా జాతీయ రహదారి (ఎన్ హెచ్ -4)లో ఖంబత్కి ఘాట్ వద్ద నిర్మిస్తున్న కొత్త 6-లేన్ సొరంగ మార్గం నిర్మాణం

Posted On: 06 JUL 2022 11:41AM by PIB Hyderabad

పూణే-సతారా హైవేస్‌లో (NH-4) ఖంబత్కీ ఘాట్ వద్ద   కొత్తగా నిర్మిస్తున్న 6-లేన్ సొరంగ మార్గం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ వెల్లడించారు.   ఒక్కొక్కటి 3 లేన్‌లతో నిర్మిస్తున్న  జంట సొరంగం  నిర్మాణం పూర్తి స్థాయిలో ఉందని మంత్రి తెలిపారు. సొరంగ మార్గం వివరాలను  శ్రీ గడ్కరీ ట్వీట్ లో వివరించారు. .

 

.సతారా-పూణే మార్గంలో  ప్రస్తుతం  'ఎస్' ఆకారంలో ఉన్న మలుపు నిర్మాణం  త్వరలో పూర్తవుతుందని మంత్రి తెలిపారు. దీని నిర్మాణం పూర్తయితే  ప్రమాదాల సంఖ్య గణనీయంగాతగ్గుతుందని ఆయన అన్నారు. 6.43 కి.మీ పొడవున్న ఈ ప్రాజెక్టును 926 కోట్ల రూపాయల మూలధన ఖర్చు అంచనాలతో చేపట్టామని అన్నారు.   మార్చి 2023 నాటికి నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని అన్నారు.  

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  నాయకత్వంలో దేశంలో మౌలిక సదుపాయాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి చెందుతున్నాయని శ్రీ గడ్కరీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ' అనుసంధానం ద్వారా అభివృద్ధి' అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం కార్యక్రమాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. నవ భారతదేశానికి  ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని  ఆయన అన్నారు.

సొరంగ మార్గం రవాణా సౌకర్యాలను  మెరుగుపరుస్తుందని శ్రీ గడ్కరీ వివరించారు. ప్రయాణ సమయం, ఖర్చు తగ్గించడం ద్వారా  ప్రయాణికులకు సొరంగ మార్గం  ప్రత్యక్ష ప్రయోజనాలను అందిస్తుందని  శ్రీ గడ్కరీ చెప్పారు. 

పూణే-సతారా మరియు సతారా - పూణేలో ఖంబటాకీ ఘాట్‌లో సగటు ప్రయాణ సమయం వరుసగా 45 నిమిషాలు మరియు 10-15 నిమిషాలుగా ఉందని  మంత్రి చెప్పారు. ఈ సొరంగం పూర్తయితేసగటు ప్రయాణ సమయం సగటున దాదాపు 5-10 నిమిషాలకు తగ్గుతుంది.

***(Release ID: 1839561) Visitor Counter : 147