ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

డాక్టర్ మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో డాక్టర్స్ డే వేడుకలు


ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అత్యుత్తమ అంకితభావంతో
అమూల్యమైన సహకారం అందిస్తున్న 75 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు
ఉన్న వైద్యులకు సత్కారం

వైద్య నిపుణులు నిస్వార్థంగా పని చేయడం ద్వారా మన దేశ సంప్రదాయమైన
“సేవా భావ్”, “సేవా పరమో ధర్మ” అనుసరించారు: డాక్టర్ మన్సుఖ్ మాండవియా

"అద్భుతమైన వైద్యుడు, గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయిన డాక్టర్ బి.సి. రాయ్ నుండి మనం స్ఫూర్తి పొందాలి;
మన ప్రధాని ఊహించిన విధంగా మన దేశ ఆరోగ్యాన్ని మొదటి ప్రాధాన్యతగా ఉంచడం మన పవిత్ర కర్తవ్యం": డాక్టర్ మన్సుఖ్ మాండవియా

రోగులందరి సేవతో పాటు, మనమందరం స్వాస్థ్య భారత్, శుద్రత్ భారత్ కోసం
కృషి చేస్తున్నాము: డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్

Posted On: 01 JUL 2022 4:36PM by PIB Hyderabad

డాక్టర్స్ డే సందర్బంగా  లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీ (ఎల్హెచ్ఎంసి)లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా, ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ పాల్గొన్నారు. 

 

నిస్వార్థ సేవను అందిస్తున్న వైద్య మిత్రులకు డాక్టర్ మన్సుఖ్ మాండవియా అభివాదాలు తెలిపారు. “మన వైద్యులు వైద్య నిపుణులు మన జీవితంలో కీలక పాత్ర పోషించారు. ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకోవడం వారి అపారమైన పాత్రను గుర్తించే ప్రయత్నం. ప్రఖ్యాత డా. బిధాన్ చంద్ర రాయ్, స్వతంత్ర భారతదేశంలో వైద్య వృత్తికి మార్గదర్శకులలో ఒకరు , అత్యుత్తమ వైద్యుడు" అని డాక్టర్ మాండవీయ అన్నారు. 

“ఈ సంవత్సరం మన స్వాతంత్య్ర  75 వ సంవత్సరం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌తో, 75 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వైద్య సోదరుల నుండి వచ్చిన ప్రముఖులను సత్కరించడం ద్వారా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాము. సమాజం, మానవత్వం, దేశానికి వైద్యుడిగా వారి అత్యుత్తమ అంకితభావం, విలువైన సహకారం గుర్తు చేసుకుంటున్నాం" అని డాక్టర్ మాండవీయ తెలిపారు. .

మనం తప్పనిసరిగా వైద్యుల నుండి ప్రేరణ పొందాలని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ సమర్థుడైన వైద్యుడు, అడ్మినిస్ట్రేటర్ అని, మన దేశ ఆరోగ్య రంగాన్ని మొదటి ప్రాధాన్యతగా ఉంచడం మన పవిత్ర కర్తవ్యమని తెలిపారు. మన దేశంలో ఆరోగ్యాన్ని సేవగా చూస్తారని, మన వైద్య నిపుణులు మన దేశ సంప్రదాయాలైన సేవా భావ్ , సేవా పరమో ధర్మాన్ని పాటిస్తూ అవిశ్రాంతంగా, నిస్వార్థంగా కృషిచేస్తున్నారన్నారు. మన కోవిడ్ యోధులు నిస్వార్థ పద్ధతిలో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఏకైక కారణం ఇదే అని తెలిపారు. మన ప్రయత్నాలు దేశ పురోభివృద్ధి దిశలో ఉండాలని  నొక్కి చెప్పారు దేశం ఎప్పుడూ అగ్ర స్థానంలో ఉండాలి. మనం మన సేవాభావాన్ని కొనసాగించాలి, అప్పుడే మనం ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించగలుగుతాము, అది సమృద్ధ దేశానికి మార్గం వేస్తుందని కేంద్ర మంత్రి డాక్టర్ మాండవీయ చెప్పారు. 

టిబి, క్యాటరాక్ట్, లెప్రసీ వంటి సవాళ్లపై దృష్టి సారించిన కేంద్ర మంత్రి, దేశంలో టిబి ముక్త్ భారత్, ష్టు వ్యాధి నిర్మూలన వంటి లక్ష్యాలను నెరవేర్చడానికి వైద్య నిపుణులు, ఇతర భాగస్వాములందరూ నిబద్ధత, అంకితభావంతో పని చేయాలని కోరారు.
 

అందరికీ ఆరోగ్యాన్ని అందించాలనే ప్రభుత్వ అంకితభావాన్ని ప్రస్తావిస్తూ, దేశంలో ఆరోగ్య రంగం డైనమిక్స్ వేగంగా మారుతున్నాయని, మన  ప్రధాన మంత్రి దార్శనికతతో కూడిన నాయకత్వంలో, ప్రభుత్వం అన్ని వాటాదారులతో కలిసి సంపూర్ణ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి కృషి చేస్తోందని తెలిపారు, లభ్యత, అందుబాటు, నాణ్యత మొత్తం లక్ష్యం దీర్ఘకాలిక సినర్జీలను సృష్టించడం ద్వారా ఆరోగ్య సేవలు అందించాలని అన్నారు. 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, వైద్య నిపుణులు తమ నిర్విరామ కృషికి, కోవిడ్ నిర్వహణలో భారతదేశాన్ని ప్రపంచ విజయగాథగా మార్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ “రోగులందరి సేవతో పాటు, మనమందరం స్వాస్త్య భారత్, కోసం కృషి చేస్తున్నామని దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా మిషన్ మోడ్‌లో టెలిమెడిసిన్ సేవల వంటి అనేక కార్యక్రమాలను  తీసుకెళ్తూ  ప్రభుత్వం ఆరోగ్య రంగంలో కొత్త తరం  సాంకేతికతను జోడిస్తోందని ఆమె అన్నారు. ఈ విధంగా మాత్రమే మనం ఆత్మనిర్భర్ భారత్‌ను సృష్టించగలుగుతామని తెలిపారు. 

మన ప్రాచీన కాలం నాటి చైతన్యవంతమైన ప్రయత్నాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చరక్, సుశ్రుత, పతంజలి, జీవక్, ధన్వంతరి, అగ్నివేష్, చ్యవన్ వంటి వైద్య నిపుణులు అపారమైన సహకారాన్ని అందించారని  అలాగే మనం కూడా వైద్య రంగానికి మంచి సహకారం అందించాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. 

గత రెండు సంవత్సరాల మహమ్మారి నుండి మనం సాధించిన విజయాలను ప్రతిబింబించేలా వేడుక జరుపుకోవడానికి ఇది ఒక సందర్భం అని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్నారు. సేవా, సమర్పణ్ ఔర్‌ విశ్వాస్‌ అనే నిస్వార్థ సేవలను పునరుద్ఘాటిస్తూ, వైద్యుల దినోత్సవం ఈ విలువలకు ప్రతీక అని, మన సంప్రదాయాలు ఈ సేవకే అంకితమై ఉండాలని నేర్పాయని అన్నారు. మన యువత ఈ బాధ్యతను అంకితభావంతో చేపడతారని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ఆశాభావం వ్యక్తం చేశారు.

డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయెల్, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ రామ్ చందర్, మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు, ప్రముఖ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

****



(Release ID: 1838872) Visitor Counter : 229