ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ పథకం- ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పిఎమ్ఎఫ్ఎమ్ఈ) కు రెండేళ్లు పూర్తి


ప్రస్తుతం దేశంలోని 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలవుతున్న పీఎంఎఫ్ఎంఈ పథకం

ఫుడ్ ప్రాసెసింగ్ కార్యకలాపాల్లో నిమగ్నమైన స్వయం సహాయక బృందం (ఎస్ హెచ్ జి )లోని ప్రతి సభ్యుడి వర్కింగ్ క్యాపిటల్ , చిన్న పనిముట్ల కొనుగోలు కోసం
పిఎమ్ ఎఫ్ ఎమ్ ఈ పథకం కింద రూ. 40,000 ఆర్థిక సహాయం

లక్షకు పైగా ఎస్ హెచ్ జి సభ్యుల గుర్తింపు; ఇప్పటివరకు రూ. 203 కోట్ల మూలధన మొత్తం విడుదల

Posted On: 01 JUL 2022 12:18PM by PIB Hyderabad

కేంద్ర ప్రాయోజిత ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పిఎమ్ఎఫ్ఎంఈ) పథకాన్ని కేంద్ర ప్రభుత్వ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద 2020 జూన్ 29న ప్రారంభించింది. ఈ పథకం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అసంఘటిత సూక్ష్మ పరిశ్రమలకు సాధికారత కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పథకం ప్రయాణం ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడే విధంగా సుస్థిర పరచడం  లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా కొనసాగుతూ ఈ రంగానికి మంచి ఫలితాలను ఇస్తోంది.

 

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ లోని అసంఘటిత విభాగంలో ఇప్పటికే ఉన్న వ్యక్తిగత సూక్ష్మ పరిశ్రమలను అభివృద్ధి చేయడం, ఈ రంగాన్ని సుస్థిర పరచడం లక్ష్యాలతో ప్రారంభమైనపిఎంఎఫ్ఎమ్ఈ పథకం ప్రస్తుతం 35 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు జరుగుతోంది. ఈ పథకం కింద, క్రెడిట్-లింక్డ్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఆన్లైన్ పోర్టల్ (www.pmfme.mofpi.gov.in) ద్వారా జరుగుతుంది. దాదాపు 50,000 మంది దరఖాస్తుదారులు పోర్టల్ లో రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటివరకు 25,000 పైగా దరఖాస్తులు విజయవంతంగా సమర్పించబడ్డాయి.

 

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఓ డి ఓ పి ల వివరాలను అందించడం కోసం భారతదేశ డిజిటల్ జిఐఎస్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ఓ డి ఓ పి) మ్యాప్ ను అభివృద్ధి చేశారు. దీని విలువ గొలుసు అభివృద్ధి కోసం భాగస్వాములు సమిష్టిగా కృషి చేయడానికి ఇది దోహదపడుతుంది.

 

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ పథకానికి సంబంధించి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్డి), గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓటిఎ) , గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓ హెచ్ యు ఎ) లతో సంయుక్త లేఖల పై సంతకాలు చేసింది. అలాగే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసిఎఆర్), నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సిడిసి), ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ట్రైఫెడ్), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) ,  నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఎఫ్డిసి), నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ ఎస్ టి ఎఫ్ డి సి ),  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా

 (ఎఫ్ఎస్ఎస్ఎఐ),  పశుసంవర్ధక , పాడిపరిశ్రమ విభాగం (డి ఏ హెచ్ డీ).

లతో తో ఎమ్ఒయులు కుదుర్చుకుంది. పీఎంఎఫ్ఎంఈ పథకానికి నోడల్ బ్యాంకుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకోగా, ఈ పథకానికి అధికారిక రుణ భాగస్వాములుగా 15 బ్యాంకులతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి.

 

ఈ పథకం కెపాసిటీ బిల్డింగ్ కాంపోనెంట్ కింద, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ మేనేజ్ మెంట్, కుండ్లి (ఎన్ ఐ ఎఫ్ టి ఎం- కె) , నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ మేనేజ్ మెంట్, తంజావూరు (ఎన్ ఐ ఎఫ్ టి ఎం- - టి), రాష్ట్ర స్థాయి సాంకేతిక సంస్థలు , ప్రైవేట్ ట్రైనింగ్ భాగస్వాముల సహకారం తో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్/గ్రూపులు/క్లస్టర్ లకు శిక్షణ, పరిశోధనా మద్దతు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.ఫుడ్ సేఫ్టీ అండ్ హైజీన్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ (ఇ డి పి)తో సహా ఫుడ్ ప్రొడక్ట్ ప్రాసెసింగ్ పై లబ్ధిదారులకు ట్రైనింగ్ నిర్వహించబడుతోంది.

 

ఈ పథకం కింద 75 ఇంక్యుబేషన్ సెంటర్లకు ఆమోదం లభించింది. తంజావూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ (ఎన్ ఐ ఎఫ్ టి ఇ ఎం-టి) సహకారంతో మంత్రిత్వ శాఖ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రతిపాదనలను సమర్పించడానికి ఒక ఆన్ లైన్ పోర్టల్ ని దేశవ్యాప్తంగా ఇంక్యుబేషన్ సెంటర్ ల వివరాలను సులభతరం చేయడానికి ఒక డిజిటల్ మ్యాప్ ని అభివృద్ధి చేసింది.

పిఎమ్ ఎఫ్ ఎమ్ ఈ పథకం, ఫుడ్ ప్రాసెసింగ్ కార్య కలాపాలలో నిమగ్నమైన స్వయం సహాయక బృందం (ఎస్  హెచ్ జి ) లోని ప్రతి సభ్యునికి వర్కింగ్ కేపిటల్ నిమిత్తం,  చిన్న చిన్న పనిముట్లు ను కొనుగోలు చేయడం కోసం రూ.40,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని, కూడా ప్రతిపాదిస్తోంది. లక్షకు పైగా స్వయం సహాయక బృందాలను గుర్తించి, ఇప్పటి వరకు రూ. 203 కోట్ల మూలధన మొత్తాన్ని విడుదల చేశారు.

ఈ పథకం కింద, మొత్తం విలువ గొలుసు వెంబడి వ లబ్దిదారులకు మద్దతు ఇవ్వడం కోసం, హ్యాండ్ హోల్డ్ చేయడం కోసం మార్కెటింగ్ , బ్రాండింగ్ కార్యకలాపాలను

చేపట్టడానికి నాఫెడ్ , ట్రైఫెడ్ తో ఎమ్ఒయు లపై సంతకాలు జరిగాయి.కాంపోనెంట్ కింద నాఫెడ్ సహకారంతో పది ఓ డి ఓ పి బ్రాండ్ లను ప్రారంభించారు. ఈ పథకం రాష్ట్ర స్థాయి బ్రాండ్లకు మార్కెటింగ్ మద్దతును కూడా అందిస్తుంది.ఇప్పటి వరకు, రెండు రాష్ట్ర స్థాయి బ్రాండ్లు విజయవంతంగా ప్రారంభించబడ్డాయి, వీటిలో పంజాబ్ రాష్ట్రం నుండి "ఆశ్నా (AASNAA)" బ్రాండ్, మహారాష్ట్ర రాష్ట్రం నుండి "భీమ్తాడి" బ్రాండ్ తో పాటు అనేక ఇతర బ్రాండ్ లు ర్వరలో రానున్నాయి.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ చొరవ కింద, మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు ,నిఫ్టెమ్ సహకారంతో దేశవ్యాప్తంగా 75 యూనిక్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ఓ డి ఓ) వెబినార్ లు/ ఆఫ్ లైన్ వర్క్ షాప్ లను నిర్వహిస్తోంది. "కహానీ సుక్ష్మా ఉద్యామోన్ కీ" అనే విజయగాథలు కూడా ఈ చొరవ కింద ప్రచురించబడుతున్నాయి, దీనిలో స్ఫూర్తిదాయకమైన కథలు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మైక్రో ఎంటర్ప్రైజెస్ ,స్వయం సహాయక బృందాల ప్రయాణాన్ని కలిగి ఉంటాయి, ఈ రంగంలోని అవకాశాల గురించి అవగాహన కల్పిస్తాయి. ఇంకా వారి ఆహార ప్రాసెసింగ్ వ్యాపారాన్ని మెరుగుపరచడానికి పిఎమ్ఎఫ్ఎమ్ఇ పథకం ప్రయోజనాలను పొందేలా ప్రస్తుత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాయి

నెలవారీ ఇ-న్యూస్ లెటర్ కూడా విజయగాథలు, సృజనాత్మకత గాథలు , వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఆధారిత కథలు ఇంకా ఫుడ్ ప్రాసెసింగ్ కు సంబంధించిన పరిశోధన ఆధారిత కథనాలను కలిగి ఉంటుంది.ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి చెందిన విద్యావేత్తలు,  ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ తో ఇంటర్వ్యూలు, మైక్రో ఎంటర్ ప్రైజెస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, ఎఫ్ పిఒలు ,కో-ఆపరేటివ్ లు ఎదగడానికి ఆత్మనిర్భర్ గా మారడానికి సహాయపడే ఈ రంగంలోని ఆవిష్కరణలు , పోకడలను కూడా ఈ-న్యూస్ లెటర్ ద్వారా అందిస్తారు. 

 

*****(Release ID: 1838645) Visitor Counter : 361