కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యుఎస్ఓఎఫ్) కింద పైలట్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు ఐటీఐ లిమిటెడ్, బీఎస్ఎన్ఎల్‌తో టెలికమ్యూనికేషన్స్ శాఖ ఒప్పందం
Posted On:
01 JUL 2022 3:37PM by PIB Hyderabad
సీ-డాట్ కోర్‌తో 4జీ/5జీ ప్రోటోటైప్‌ల ఏకీకరణతో సహా.. ఈ-బ్యాండ్, ఎల్‌టీఈ స్వదేశీ టెక్నాలజీ పైలట్ ప్రాజెక్ట్‌లకు తగు నిధుల్నిసమకూర్చడానికి గాను ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ (ఐటీఐ) లిమిటెడ్ సంస్థ, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తో కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (యుఎస్ఓఎఫ్)
ఒక ఒప్పందంపై కుదుర్చుకుంది. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యుఎస్ఓఎఫ్) కింద గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలలో టెలికాం రంగంలో కొత్త సాంకేతిక అభివృద్ధిని ప్రేరేపించే కార్యక్రమం కింద, ఈ టెక్నాలజీల అభివృద్ధి మరియు పటిష్టపరిచేందుకు కేంద్రం దాదాపు రూ.10 కోట్ల చొప్పున 4 పైలట్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చనుంది. దేశీయ కంపెనీలైన ఆస్ట్రోమ్ టెక్నాలజీస్, లేఖా వైర్‌లెస్ సొల్యూషన్స్, రెసోనస్ టెక్నాలజీస్, సిగ్నల్‌ట్రాన్ సంస్థలు ఈ ప్రాజెక్టులను సీ-డాట్ మరియు డీఓటీ ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్ మరియు ఐటీఐ భాగస్వామ్యంతో అమలు చేయనున్నాయి.
***
(Release ID: 1838639)
Visitor Counter : 177