రైల్వే మంత్రిత్వ శాఖ
శ్రీ అశ్విని వైష్ణవ్ సహ అధ్యక్షతన ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుపై 14వ జాయింట్ కమిటీ సమావేశం
- జపాన్ ప్రధాన మంత్రి ప్రత్యేక సలహాదారు డాక్టర్ మోరీ మసాఫుమీ జపాన్ వైపు నుండి సమావేశానికి సహ అధ్యక్షత వహించారు
- ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని ఈ సమావేశంలో ఉద్ఘాటించిన రైల్వే మంత్రి
Posted On:
30 JUN 2022 2:51PM by PIB Hyderabad
ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు 14వ జాయింట్ కమిటీ సమావేశం ఈ రోజు జరిగింది. ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ (ఎంఏహెచ్ఎస్ఆర్) ప్రాజెక్ట్ అమలుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి.. రైల్వేలు, కమ్యూనికేషన్లు మరియు ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఈ రోజు సమావేశంలో పాల్గొన్నారు. 14వ జాయింట్ కమిటీ సమావేశానికి అధ్యక్షత ఆయన భారతదేశం తరఫున ఈ సమావేశానికి సహ అధ్యక్షతను
వహించారు. జపాన్ ప్రధాన మంత్రి ప్రత్యేక సలహాదారు డాక్టర్ మోరీ మసాఫుమి జపాన్ వైపు నుండి సమావేశానికి కో-అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ పురోగతికి సంబంధించిన ప్రదర్శన మరియు వీడియో ఫిల్మ్‌ను ప్రదర్శించారు. దీనికి తోడు నిధులు, ఒప్పందాల అమలుకు సంబంధించిన సమస్యలు పరస్పర పరిష్కారం మరియు ప్రాజెక్ట్ యొక్క లక్ష్య కమీషన్ తదితర అంశాలు ఇందులో చర్చించబడ్డాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భారత ప్రభుత్వం మరియు జపాన్ ప్రభుత్వం మధ్య జాయింట్ కమిటీ సమావేశం పరస్పర ప్రయోజనాలతో పాటు, ఆయ ప్రయోజనాలకు సంబంధించిన ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకెళ్లడానికి అత్యున్నత సంప్రదింపుల వ్యవస్థ. జపాన్ ప్రభుత్వం ఎంఏహెచ్ఎస్ఆర్) ప్రాజెక్ట్‌లకు తక్కువ వడ్డీతో కూడిన రుణం మరియు సాంకేతికత, ఆర్థిక సహకార నిధులను సమకూర్చడానికి కట్టుబడి ఉంది. ఈ సమావేశం ఫలప్రదంగా ముగిసంది. ఈ మీటింగ్ ఉత్పాదకమైనది మరియు ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయడానికి వ్యూహాత్మక సమస్యలను ఖరారు చేసింది. ప్రాజెక్ట్ యొక్క మొత్తం ప్రయోజనాల దృష్ట్యా ఒక ప్రాజెక్ట్ - ఒక బృందం యొక్క గౌరవనీయమైన పీఎం యొక్క అభిప్రాయానికి అనుగుణంగా పని చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.
***
(Release ID: 1838494)
Visitor Counter : 182