హోం మంత్రిత్వ శాఖ
"అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం" సందర్భంగా కేంద్ర హోం సహకార మంత్రి అమిత్ షా సందేశం ఇచ్చారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించింది.
మోదీ 'డ్రగ్స్ ఫ్రీ ఇండియా' సంకల్పాన్ని నెరవేర్చడంలో పాలుపంచుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు వాలంటీర్లందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
75వ స్వాతంత్య్ర సంవత్సరంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘డ్రగ్స్ ఫ్రీ ఇండియా’ పిలుపును ఈ అమృత కాలంలో దృఢ సంకల్పంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నామని అన్నారు.
మాదకద్రవ్య వ్యసనం సమస్య జాతీయ భద్రతకు కూడా పెద్ద సవాలు, దీనిని అందరి సమన్వయంతో మాత్రమే ఆపవచ్చు , తొలగించవచ్చు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, భారత ప్రభుత్వం మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించడానికి విస్తృతంగా కృషి చేస్తోంది ఆయన నాయకత్వంలో, మేము ఈ పోరాటాన్ని సమన్వయం చేసి, సంస్థాగతీకరించాము.
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ "నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో" ఆధ్వర్యంలో "నార్కో కోఆర్డినేషన్ మెకానిజం" స్థాపించబడింది. దీని లక్ష్యం అన్ని ఏజెన్సీల మ
Posted On:
26 JUN 2022 4:33PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ డ్రగ్స్ పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించిందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. డ్రగ్ దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా తన సందేశంలో, . 'డ్రగ్స్ ఫ్రీ ఇండియా' అనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పాన్ని నెరవేర్చడంలో పాలుపంచుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛంద సేవకులందరికీ తాను అభినందనలు తెలుపుతున్నాను అని అమిత్ షా అన్నారు.
75వ స్వాతంత్య్ర సంవత్సరం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన 'డ్రగ్స్ ఫ్రీ ఇండియా' పిలుపును ఈ అమృత కాలంలో దృఢ సంకల్పంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నామని అమిత్ షా అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా శూన్య సహన (జీరో టాలరెన్స్) విధానాన్ని అనుసరించింది. మాదకద్రవ్యాల వ్యసనం అనేది దేశ భద్రతకు కూడా పెద్ద సవాలు అని నేను నమ్ముతున్నాను. దీనిని అందరి సమన్వయంతో మాత్రమే ఆపవచ్చు తొలగించవచ్చు.
డ్రగ్స్ అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం భారీ స్థాయిలో కృషి చేస్తోందని కేంద్ర హోం మంత్రి తెలిపారు. మోదీ నాయకత్వంలో తాము ఈ పోరాటాన్ని సమన్వయం చేసాము సంస్థాగతంగా చేసాము. దీని కోసం, మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ను అరికట్టడంలో పూర్తి విజయాన్ని సాధించడానికి, అన్ని ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని ఏర్పరచడమే దీని ఉద్దేశ్యంగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ‘నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో’ ఆధ్వర్యంలో ‘నార్కో కోఆర్డినేషన్ మెకానిజం’ స్థాపించబడింది. జాతీయ స్థాయిలో డ్రగ్స్‌పై జరుగుతున్న ఈ పోరులో ఎన్‌సీబీ చురుకైన పాత్ర పోషిస్తోందని, దీని వల్ల విజయవంతమైన ఫలితాలు చూస్తున్నామని ఆయన అన్నారు. 2014 నుండి 2022 వరకు, గత 8 సంవత్సరాలలో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ గత 8 సంవత్సరాల కంటే దాదాపు 25 రెట్లు ఎక్కువ అని హోం మంత్రి చెప్పారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం సమాజాన్ని నిర్వీర్యం చేయడమే కాదు, డ్రగ్స్ స్మగ్లింగ్ ద్వారా సంపాదించే డబ్బు కూడా దేశ భద్రతకు పెద్ద ముప్పు అని అమిత్ షా అన్నారు. ఎన్‌సిబి వాటాదారులందరి సమిష్టి కృషి ఆశించిన విజయానికి దారితీస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. 'డ్రగ్స్ ఫ్రీ ఇండియా' అనే మోదీ సంకల్పాన్ని నెరవేర్చడంలో మనమంతా మనవంతు సహకారం అందిద్దాం.
***
(Release ID: 1837827)
Visitor Counter : 182