సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

రచనా వైవిధ్యం,నిర్మాణానంతర రంగాల్లో ప్రపంచ హబ్ గా బారతదేశ ఆవిర్భావానికి రంగం సిద్ధం: సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ రాకూర్ 



2025 నాటికి నాలుగు లక్షల కోట్ల రూపాయల స్థాయికి  చేరుకోనున్న మీడియా, వినోద రంగం  


మీడియా, వినోద రంగంలో అంకుర సంస్థల సంస్కృతిని  ప్రోత్సాహించాలి.. మంత్రి సూచన 

Posted On: 26 JUN 2022 12:56PM by PIB Hyderabad

 

దేశంలో డిజిటల్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, ఏవీజీసీ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్) రంగంలో సాధిస్తున్న పురోగతితో మీడియా మరియు వినోద పరిశ్రమ నిర్మాణానంతర రంగంలో భారతదేశం అత్యంత ప్రాధాన్యత గల కేంద్రంగా రూపు దిద్దుకుంటుందని కేంద్ర సమాచార & ప్రసార మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు.

'మీడియా వినోద రంగాల్లో వస్తున్న మార్పులు 2022' అనే అంశంపై పూణేలోని సింబయాసిస్ స్కిల్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నిర్వహించిన జాతీయ సదస్సులో శ్రీ ఠాకూర్ పాల్గొన్నారు. సదస్సులో కీలక ఉపన్యాసం చేసిన శ్రీ ఠాకూర్ " ఏవీజీసీ రంగ అభివృద్ధికి దేశవ్యాప్తంగా డిజిటల్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. దేశంలో ఏవీజీసీ రంగానికి ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. దేశ విదేశాల్లో రచన వైవిధ్యం కోసం ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు అమలు జరుగుతున్నాయి" అని శ్రీ ఠాకూర్ పేర్కొన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/IMG-20220626-WA0000UDJL.jpg

దేశంలో మీడియా, వినోద రంగాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని శ్రీ ఠాకూర్ అన్నారు. 2025 నాటికి ఈ రంగాల ఉత్పత్తి సామర్థ్యం నాలుగు లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అన్నారు. 2030 నాటికి ఈ పరిశ్రమ 100 బిలియన్ డాలర్లు లేదా రూ. 7.5 లక్షల కోట్ల రూపాయల స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని మంత్రి వివరించారు.

ఆడియో-విజువల్ సేవల రంగాన్ని దేశంలో గుర్తించిన 12 కీలక సేవా రంగాల్లో ఒకటిగా ప్రభుత్వం గుర్తించిందని శ్రీ ఠాకూర్ తెలిపారు. ఈ రంగాల్లో సుస్థిర అభివృద్ధి సాధించేందుకు విధాన చర్యలను ప్రకటించి అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/IMG-20220626-WA00016XXD.jpg

 

నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ డిజిటల్ యుగం లోకి ప్రవేశించిన రేడియో, చలనచిత్ర మరియు వినోద పరిశ్రమ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శ్రీ ఠాకూర్ అన్నారు. వీడియో ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), సౌండ్ డిజైన్, రోటో స్కోపింగ్, 3D మోడలింగ్ అంశాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయని అన్నారు."ఈ రంగంలో ప్రతి ఉద్యోగానికి ఒక ప్రత్యేక నైపుణ్యత సామర్థ్యం అవసరముంటాయి. రంగానికి అవసరమైన మానవ వనరులను అభివృద్ధి చేసేందుకు విద్య, పరిశ్రమ వర్గాలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది." అని శ్రీ ఠాకూర్ అన్నారు. ఈ రంగంలో రాణించేందుకు భారతదేశ విద్యార్థులను సాంకేతికంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రైవేటు రఁగంతో కలిసి పనిచేసేందుకు గల అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి అన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇస్తున్న ప్రాధాన్యత తో యువతకు అనేక అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని శ్రీ ఠాకూర్ అన్నారు. స్కిల్ ఇండియా మిషన్ కింద 40 కోట్ల మంది యువతకు మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నైపుణ్యం కల్పించి వారికి సాధికారత కల్పించేందుకు కృషి చేస్తున్నామని శ్రీ ఠాకూర్ అన్నారు.

అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2021 సందర్భంగా నిర్వహించిన '75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో' ప్రాజెక్టును మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. '75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో' ద్వారా వెలుగులోకి వచ్చిన వారిలో కొంతమంది మీడియా, వినోద రంగంలో ప్రవేశించారని, మరికొంతమంది స్వయంగా అంకుర సంస్థలు ప్రారంభించారని మంత్రి అన్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/IMG-20220626-WA0003WKTO.jpg

దేశంలో అంకుర సంస్థలు పెద్ద సంఖ్యలో ఏర్పాటువుతున్నాయని శ్రీ ఠాకూర్ అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా దేశంలో 50 వరకు యునికార్న్ అంకుర సంస్థలు ఏర్పాటయ్యాయని ఇది భారతదేశ వ్యవస్థాపక స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు.ఎఫ్‌టిఐఐ, ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ వంటి ప్రముఖ సంస్థల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు మరిన్ని అంకుర సంస్థలను ప్రారంభిస్తారని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ప్రపంచ రచనా వైవిధ్య హబ్ గా భారత్

'డిజిటల్ ఇండియా' వ్యవస్థ పరిశ్రమలో రచనా వైవిధ్య రంగం గణనీయంగా అభివృద్ధి సాధించిందని శ్రీ ఠాకూర్ అన్నారు. " సులభంగా పొందేందుకు అందుబాటులో ఉన్న నాణ్యమైన కంటెంట్, , ఆసక్తిగల ప్రేక్షకులను కలిగి ఉన్న భారతదేశం విజయ పథంలో పయనించి ప్రపంచ రచనా వైవిధ్య హబ్ గా మారడానికి సిద్ధంగా ఉంది" అని అన్నారు. ప్రధాన పాత్రలతో సహా ఈ రంగంలో తెర వెనుక నుంచి విజయాలకు సహకరిస్తున్న సాంకేతిక నిపుణులను గుర్తించి సత్కరించవలసి ఉంటుందని శ్రీ ఠాకూర్ న్నారు.

ఆస్కార్ మరియు బాఫ్ట అవార్డులు గెలుచుకున్న సౌండ్ డిజైనర్ రెసూల్ పూకుట్టి జాతీయ సదస్సుకు గౌరవ అతిథిగా హాజరయ్యారు. విద్యాసంస్థలు విద్యార్థులకు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు బాహ్య ప్రపంచాన్ని ఎదుర్కొనే విధంగా జ్ఞానాన్ని అందించే ప్రాచీన భారతీయ సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని ఆయన సూచించారు.

జాతీయ సదస్సులో యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ మరియు కామిక్స్‌లో అవకాశాలు, ఓటీటీ టీవీ, చిత్ర నిర్మాణంలో అవకాశాలు, మీడియా నైపుణ్యాలు మొదలైన ప్రధాన అంశాలు చర్చకు వచ్చాయి. మీడియా మరియు వినోద రంగాల ప్రతినిధులు, సింబయాసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్శిటీ ఛాన్సలర్ డాక్టర్ ఎస్‌బి మజుందార్, ప్రో-ఛాన్సలర్ డాక్టర్ స్వాతి మజుందార్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ గౌరీ షియుర్కర్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు..

 

 



(Release ID: 1837253) Visitor Counter : 133